కేటీపీపీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
గణపురం(వరంగల్): వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (కేటీపీపీ)లో 600 మెగావాట్ల ప్లాంట్లో మంగళవారం మధ్యాహ్నం ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
ప్లాంట్లోని బాయిలర్లో సాంకేతికలోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంజనీర్లు ప్లాంట్ను షట్డౌన్ చేసి మరమ్మతులు మొదలు పెట్టారు.