Kaki Madhava Rao
-
జ్ఞాన సమాజమే లక్ష్యం
సాక్షి, గద్వాల: జ్ఞానసమాజ నిర్మాణమే స్వేరోస్ అంతిమలక్ష్యమని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్వేరోస్ అధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన జ్ఞానయుద్ధం మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వివక్షకు తావులేకుండా జ్ఞానసమాజాన్ని సృష్టించడం కోసం స్వేరోస్ నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తల్లిగర్భం నుంచి భూమి మీదకు అడుగుపెట్టిన ప్రతి జీవికి తనశక్తిని తాను తెలుసుకునే వాతావరణం కల్పించడమే స్వేరోయిజం అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రెండు చేతులతో అందుకోని ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్, దర్శానాల సుష్మా, సుందర్రాజు, తేజాబాయి, అంచిపాక సునిల్, సైదులు ఇలా అనేక విజయాలు సాధించిన గురుకుల విద్యార్ధులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్షనిస్టుల గురించి కాదు.. అనేక విజయాలు సాధించిన మహనీయుల గురించి చెప్పాలన్నారు. అంబేద్కర్ కలలు నిజం చేయాలి రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలు భవిష్యత్‌లో నిజం అవుతాయనడానికి ఈ సభ నిదర్శనమన్నారు. దేశంలో అందరు సమానమేనని చెబుతున్న రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం ఉందన్నారు. అంటరాని కులాలను సమాజం అణిచివేసిందన్నారు. అణిచివేతను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా ఎదిగిన భారతరత్న అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిభ జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. అవకాశం ఇస్తే దేనినైనా సాధించగలరని ఇక్కడ స్వేరోస్‌ను చూస్తే అర్ధమవుతుందన్నారు. గురుకులాల విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూనే సమాజ శ్రేయస్సుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పూర్ణ, ఆనంద్ స్ఫూర్తికావాలి మాజీ డీజీపీ డాక్టర్ ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. అతి సామాన్య కుటుంబంలో జన్మించి డీజీపీ స్థాయికి ఎదగడానికి అంబేద్కర్ చూపిన స్ఫూర్తియే కారణమన్నారు. కష్టపడి చదివి అత్యున్నతస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం పది నెలల శిక్షణతోనే ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ ప్రతి విద్యార్థికి స్ఫూర్తి కావాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఎంతైనా చదివించాలి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా గతాన్ని, తల్లిదండ్రులను మరిచిపోవద్దన్నారు. తమ పిల్లలను చదివించాలని, స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దళితుల పిల్లలు చదువుకోవడమే నేరమనే సమాజం నుంచి నేడు జ్ఞాన సమాజం వైపు ముందుకు సాగడం శుభశూచకమన్నారు. మన పిల్లలు చదువుకోవద్దనేది ధనికుడి నైజమని...ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ పగిడిపాటి దేవయ్య మాట్లాడుతూ..గురుకులాల్లో చదువుకుని అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకోని దేశవిదేశాల్లో వ్యాపారరంగాల్లో రాణించినట్లు తెలిపారు. దేశంలో ఉన్న పేద విద్యార్ధులకు విద్య, వైద్య, ఉపాధిరంగాల్లో సేవలు అందించాలనే ఉద్దేశంతో నాదం స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. కింది కులాల బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. పూర్ణ, ఆనంద్ ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన శిఖరాలను అధిరోహించేందుకు ఖర్చును తాము భరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అందించిన ప్రోత్సాహం, స్ఫూర్తితోనే అతి పేద కుంటుబాలకు చెందిన తాము ఎవరెస్ట్ శిక్షరాన్ని అధిరోహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఊషన్న, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎస్.స్వాములు, రాష్ట్ర కార్యదర్శి తోకల కృష్ణయ్య, ముకురాల శ్రీహరి, రవిందర్ తదితరులు పాల్గొన్నారు. -
మధుకర్‌ది హత్యే!
♦ నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెల్లడి ♦ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం, ఖానాపూర్‌లో మృతి చెందిన మధుకర్ ఆత్మహత్య చేసుకోలేదని అది హత్యేనని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు అన్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మర్మాంగాలు కోసుకుని యాసిడ్ పోసుకుంటారా..? కన్ను తీసుకుంటారా..? ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారు ఇప్పటివరకూ ఊరిలోనే లేరని అన్నారు. ఇవన్ని చూస్తుంటే మధుకర్‌ది హత్యే అని నిర్ధారణ అవుతుందన్నారు. మధుకర్ ఉదంతంపై ఆఫీసర్స్ ఫోరం, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఫ్యాకల్టీ, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేసుకుని.. అక్కడ సేకరించిన విషయాలు మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రక టించారు. కమిటీ సభ్యులు భరత్‌భూషణ్, ప్రొఫెసర్లు కె.వై.రత్నం, విజయ్, సిద్దోజి, కరు ణాకర్లతో కలసి మాధవరావు మాట్లాడారు. తమ కమిటీ ఘటన జరిగిన చోటును సంద ర్శించి అక్కడి స్థానికులతో, బాధితుని కుటుం బ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడిందని.. మధుకర్‌ది హత్యే అని చెప్పడానికి సాక్ష్యాలు లభించాయని వారు పేర్కొన్నారు. దళితుడైన మధుకర్ అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడ ని, అమ్మాయి బంధువులు, కుటుంబీకులకు విషయం తెలిసి బెదిరింపులకు దిగారన్నారు. పోలీసులూ బెదిరించారు కుటుంబసభ్యులు మధుకర్‌ది హత్యే అని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులూ బెదిరింపులకు పాల్పడ్డారని కమిటీ సభ్యులు చెప్పారు. కేవలం అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడన్న కోపంతోనే చంపేశారని, నిజాలు వెలికి తీసి నిందితులను శిక్షించాలన్నారు. దళితులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఆరోపణలు ఎదు ర్కొంటున్న ప్రజాప్రతినిధి ఆ కేసుతో తనకు సంబంధం లేదని.. ఆ అమ్మాయి తన బంధు వు కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఊరు వదిలి ఎందుకు వెళ్లిపోయారో కూడా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. విషం తాగితే మర్మాంగాలు ఎందుకు కోసుకుంటాడు? మధుకర్ చనిపోవడానికి 2 రోజుల ముందు స్థానిక ప్రజాప్రతినిధి, అమ్మాయి బంధువు మధుకర్‌కు ఫోన్ చేసి చంపుతా నని బెదిరించాడని, ఈ విషయం మధుకర్ తమకు చెప్పినట్లు ఆయన తల్లిదండ్రులు చెప్పారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. చనిపోయే ముందురోజు మధుక ర్ను ఓ అగ్రకుల యువకుడు తీసుకుని వెళ్లా డని, ఆ తర్వాతి రోజు ప్రేమించిన అమ్మా యే మధుకర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెట్లపొదల్లో మృతదేహం ఉందని చెప్పినట్లు వెల్లడించారు. విషం తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారని.. కాని విషం తాగిన వ్యక్తి మర్మాంగాలు ఎందుకు కోసు కుంటాడని, మృతదేహం వెనుక భాగం లోనూ యాసిడ్ పోశారని.. తనకు తానుగా ఎలా పోసుకుంటాడని వారు అడిగారు. -
బెల్టు షాపులు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాలి
బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కాకి మాధవరావు బృందం భేటీ సాక్షి, హైదరాబాద్: బెల్టు షాపుల నిషేధం, మద్యం అమ్మకాల నియంత్రణకు సంబంధించి అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ప్రక టించాలని మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ, ఎన్నికల నిఘా వేదిక డిమాండ్ చేశాయి. ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలు విడుదల చేసిన పార్టీలు ఈ అంశాన్ని అదనపు జోడింపుగా పేర్కొనాలని కోరాయి. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశాయి. సంస్థ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, వి.లక్ష్మణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, తదితరులతో కూడిన బృందం కిషన్‌రెడ్డితో భేటీ అయింది. మద్యం అమ్మకాల వల్ల జరుగుతున్న నష్టాలు, దాని నియంత్రణ అవశ్యకతను వారు వివరించారు. దీనికి తమ ఎన్నికల ప్రణాళికలో ప్రాధాన్యం ఇస్తామని కిషన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
దారిమళ్లుతున్న నిధులు: కాకి మాధవరావు
హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా అమల్లోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారిమళ్లుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు ఆరోపించారు. దళిత, గిరిజనుల అభివృద్ధికోసం ఖర్చు చేయాల్సిన నిధులను ప్రభుత్వం వైద్యం, నీటిపారుదల శాఖలకు మళ్లించిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై ప్రజల్లో అవగాహన తెచ్చేం దుకు దళిత స్త్రీ శక్తి సంస్థ అధ్యక్షురాలు గడ్డం ఝాన్సీ నేతృత్వంలో ఈ నెల 18న విశాఖపట్నంలో ప్రారంభించిన ప్రచార కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో మాధవరావు ఈ విమర్శలు చేశారు. ఎస్టీల అభివృద్ధికి రూ.882 కోట్ల నిధులు, ఎస్సీల కోసం రూ. 2,272 కోట్ల నిధులు ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఆధారాలు చూపడంలేదని ఆయన ఆరోపించారు. ఈ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు దళిత సంఘాలు, మేధావులు పోరాడాలని పిలుపునిచ్చారు