విలేకరులతో మాట్లాడుతున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు కాకి మాధవరావు
♦ నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెల్లడి
♦ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం, ఖానాపూర్‌లో మృతి చెందిన మధుకర్ ఆత్మహత్య చేసుకోలేదని అది హత్యేనని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు అన్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మర్మాంగాలు కోసుకుని యాసిడ్ పోసుకుంటారా..? కన్ను తీసుకుంటారా..? ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారు ఇప్పటివరకూ ఊరిలోనే లేరని అన్నారు. ఇవన్ని చూస్తుంటే మధుకర్‌ది హత్యే అని నిర్ధారణ అవుతుందన్నారు.
మధుకర్ ఉదంతంపై ఆఫీసర్స్ ఫోరం, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఫ్యాకల్టీ, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేసుకుని.. అక్కడ సేకరించిన విషయాలు మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రక టించారు. కమిటీ సభ్యులు భరత్‌భూషణ్, ప్రొఫెసర్లు కె.వై.రత్నం, విజయ్, సిద్దోజి, కరు ణాకర్‌లతో కలసి మాధవరావు మాట్లాడారు.
తమ కమిటీ ఘటన జరిగిన చోటును సంద ర్శించి అక్కడి స్థానికులతో, బాధితుని కుటుం బ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడిందని.. మధుకర్‌ది హత్యే అని చెప్పడానికి సాక్ష్యాలు లభించాయని వారు పేర్కొన్నారు. దళితుడైన మధుకర్ అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడ ని, అమ్మాయి బంధువులు, కుటుంబీకులకు విషయం తెలిసి బెదిరింపులకు దిగారన్నారు.
పోలీసులూ బెదిరించారు
కుటుంబసభ్యులు మధుకర్‌ది హత్యే అని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులూ బెదిరింపులకు పాల్పడ్డారని కమిటీ సభ్యులు చెప్పారు. కేవలం అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడన్న కోపంతోనే చంపేశారని, నిజాలు వెలికి తీసి నిందితులను శిక్షించాలన్నారు. దళితులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఆరోపణలు ఎదు ర్కొంటున్న ప్రజాప్రతినిధి ఆ కేసుతో తనకు సంబంధం లేదని.. ఆ అమ్మాయి తన బంధు వు కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఊరు వదిలి ఎందుకు వెళ్లిపోయారో కూడా చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
విషం తాగితే మర్మాంగాలు ఎందుకు కోసుకుంటాడు?
మధుకర్ చనిపోవడానికి 2 రోజుల ముందు స్థానిక ప్రజాప్రతినిధి, అమ్మాయి బంధువు మధుకర్‌కు ఫోన్ చేసి చంపుతా నని బెదిరించాడని, ఈ విషయం మధుకర్ తమకు చెప్పినట్లు ఆయన తల్లిదండ్రులు చెప్పారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు.
చనిపోయే ముందురోజు మధుక ర్‌ను ఓ అగ్రకుల యువకుడు తీసుకుని వెళ్లా డని, ఆ తర్వాతి రోజు ప్రేమించిన అమ్మా యే మధుకర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెట్లపొదల్లో మృతదేహం ఉందని చెప్పినట్లు వెల్లడించారు. విషం తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారని.. కాని విషం తాగిన వ్యక్తి మర్మాంగాలు ఎందుకు కోసు కుంటాడని, మృతదేహం వెనుక భాగం లోనూ యాసిడ్ పోశారని.. తనకు తానుగా ఎలా పోసుకుంటాడని వారు అడిగారు.