
సాక్షి, అమరావతి : విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డి సర్వీసును మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2023 మార్చి 31 తేదీ వరకూ సాధారణ పరిపాలన శాఖలో ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శిగా సర్వీసును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన సర్వీసును మూడు దఫాలు ప్రభుత్వం పొడగించింది.