బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కాకి మాధవరావు బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్: బెల్టు షాపుల నిషేధం, మద్యం అమ్మకాల నియంత్రణకు సంబంధించి అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ప్రక టించాలని మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ, ఎన్నికల నిఘా వేదిక డిమాండ్ చేశాయి. ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలు విడుదల చేసిన పార్టీలు ఈ అంశాన్ని అదనపు జోడింపుగా పేర్కొనాలని కోరాయి. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశాయి. సంస్థ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, వి.లక్ష్మణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, తదితరులతో కూడిన బృందం కిషన్‌రెడ్డితో భేటీ అయింది. మద్యం అమ్మకాల వల్ల జరుగుతున్న నష్టాలు, దాని నియంత్రణ అవశ్యకతను వారు వివరించారు. దీనికి తమ ఎన్నికల ప్రణాళికలో ప్రాధాన్యం ఇస్తామని కిషన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
బెల్టు షాపులు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాలి
Published Sat, Apr 5 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement