హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా అమల్లోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారిమళ్లుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు ఆరోపించారు. దళిత, గిరిజనుల అభివృద్ధికోసం ఖర్చు చేయాల్సిన నిధులను ప్రభుత్వం వైద్యం, నీటిపారుదల శాఖలకు మళ్లించిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై ప్రజల్లో అవగాహన తెచ్చేం దుకు దళిత స్త్రీ శక్తి సంస్థ అధ్యక్షురాలు గడ్డం ఝాన్సీ నేతృత్వంలో ఈ నెల 18న విశాఖపట్నంలో ప్రారంభించిన ప్రచార కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో మాధవరావు ఈ విమర్శలు చేశారు.
ఎస్టీల అభివృద్ధికి రూ.882 కోట్ల నిధులు, ఎస్సీల కోసం రూ. 2,272 కోట్ల నిధులు ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఆధారాలు చూపడంలేదని ఆయన ఆరోపించారు. ఈ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు దళిత సంఘాలు, మేధావులు పోరాడాలని పిలుపునిచ్చారు
దారిమళ్లుతున్న నిధులు: కాకి మాధవరావు
Published Thu, Nov 28 2013 2:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement