Kaliachak
-
గడ్కరీకి షాక్ ఇచ్చిన బెంగాల్ సర్కార్
కోల్ కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెంగాల్ సర్కార్ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు చోటుచేసుకున్న మాల్దా జిల్లాలోని కాళియచాక్ ప్రాంతంలో పర్యటించేందుకు నితిన్ గడ్కరీని అనుమతించలేదు. ఇప్పటికే బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం ఇక్కడ పర్యటించేందుకు విఫలయత్నం చేసింది. తాజాగా గడ్కరీకి స్థానిక అధికార యంత్రాంగం అనుమతి నిరాకరించింది. ఈ నెల 18న నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనేందుకు గడ్కరీ అనుమతి కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానంతో జిల్లా అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 21న కాళియచాక్ లో జరగనున్న ర్యాలీలో పాల్గొననుండడం విశేషం. ఇక్కడ అనుమతించకపోవడంతో దక్షిణ దినాజ్ పూర్ లో ర్యాలీ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. -
'స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టి రైలెక్కించారు'
-
'స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టి రైలెక్కించారు'
మాల్దా: మాల్దాలో జరిగిన మతపరమైన ఘర్షణలకు సంబంధించి పరిశీలనలు జరిపేందుకు బయలుదేరిన నిజనిర్ధారణ కమిటీని మాల్దా రైల్వే స్టేషన్లో జిల్లా అధికారులు అడ్డుకున్నారు. వారిని అక్కడే నిలిపి ఉంచారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో డిసెంబర్ 3న రెండు వర్గాల మధ్య మతపరమైన ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇవి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య చిచ్చుపెట్టాయి. ఈ రెండు పార్టీలు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఘర్షణల వెనుక నిజనిజాలను నిగ్గు తేల్చాలని బీజేపీ ముగ్గురు వ్యక్తులతో కూడిన నిజనిర్దారణ కమిటీ వేసింది. ఇందులో ఎంపీలు భూపేంద్రయాదవ్, రామ్ విలాస్ వేదాంతి, ఎస్ఎస్ అహ్లువాలియా ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి సోమవారం ఉదయం గౌర్ ఎక్స్ ప్రెస్ లో మల్దాకు వచ్చారు. అక్కడి నుంచి ఘటన చోటుచేసుకున్న కాలియాచాక్ వెళ్లాలనుకున్నారు. కానీ, పోలీసులు, స్థానికులు వారిని వెనక్కి వెళ్లాలని చెప్పారు. స్టేషన్ లోని వీఐపీ లాంజ్ లో కూర్చుని మూడు గంటలపాటు వారితో చర్చించారు. ప్రస్తుతం కాలియాచక్ లో 144 సెక్షన్ ఉందని, అక్కడికి ఎవరినీ అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని హౌరాకు చెందిన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో తిరిగి బలవంతంగా వెనక్కి పంపించారు. దీనిపట్ల ఎంపీ భూపేంద్ర యాదవ్ స్పందిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోందని, ఉద్దేశ పూర్వకంగా తమను వెనక్కి పంపించారని మండిపడ్డారు. -
వింతవ్యాధితో 9 శిశువుల మృతి
పశ్చిమ బెంగాల్ లో గుర్తుతెలియని వ్యాధి తొమ్మిది మంది పసిపిల్లల ప్రాణాలను హరించేసింది. మాల్దా జిల్లాలో ఉన్నట్టుండి వాంతులు, జ్వరం, వంకర్లు తిరిగిపోవడం వంటి లక్షణాలలో బాధపడుతున్న పిల్లలను ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే వారు చనిపోయారు. చనిపోయిన వారంతా ఒకటి నుంచి ఆరేళ్ల లోపు వయసున్న వారే. వీరంతా మాల్దా జిల్లాలోని కాలియాచక్ బ్లాక్ కి చెందిన వారు. 'ముందుగా జ్వరంతో మొదలై ఆ తరువాత పరిస్థితి విషమిస్తోంది. మేం చేయగలిగిందంతా చేస్తున్నాం. ఇప్పటికి తొమ్మది మంది చనిపోయారు.' అన్నారు మాల్డా మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్. కోల్ కతా నుంచి నిపుణుల వైద్య బృందం పరీక్షల నిమిత్తం మాల్దాకు చేరుకుంది.