వింతవ్యాధితో 9 శిశువుల మృతి
Published Sat, Jun 7 2014 7:01 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM
పశ్చిమ బెంగాల్ లో గుర్తుతెలియని వ్యాధి తొమ్మిది మంది పసిపిల్లల ప్రాణాలను హరించేసింది. మాల్దా జిల్లాలో ఉన్నట్టుండి వాంతులు, జ్వరం, వంకర్లు తిరిగిపోవడం వంటి లక్షణాలలో బాధపడుతున్న పిల్లలను ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే వారు చనిపోయారు. చనిపోయిన వారంతా ఒకటి నుంచి ఆరేళ్ల లోపు వయసున్న వారే. వీరంతా మాల్దా జిల్లాలోని కాలియాచక్ బ్లాక్ కి చెందిన వారు.
'ముందుగా జ్వరంతో మొదలై ఆ తరువాత పరిస్థితి విషమిస్తోంది. మేం చేయగలిగిందంతా చేస్తున్నాం. ఇప్పటికి తొమ్మది మంది చనిపోయారు.' అన్నారు మాల్డా మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్. కోల్ కతా నుంచి నిపుణుల వైద్య బృందం పరీక్షల నిమిత్తం మాల్దాకు చేరుకుంది.
Advertisement