గడ్కరీకి షాక్‌ ఇచ్చిన బెంగాల్ సర్కార్ | Nitin Gadkari denied permission to hold rally in violence-hit Malda | Sakshi
Sakshi News home page

గడ్కరీకి షాక్‌ ఇచ్చిన బెంగాల్ సర్కార్

Published Wed, Jan 13 2016 6:08 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

గడ్కరీకి షాక్‌ ఇచ్చిన బెంగాల్ సర్కార్

గడ్కరీకి షాక్‌ ఇచ్చిన బెంగాల్ సర్కార్

కోల్ కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెంగాల్ సర్కార్ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు చోటుచేసుకున్న మాల్దా జిల్లాలోని కాళియచాక్ ప్రాంతంలో పర్యటించేందుకు నితిన్ గడ్కరీని అనుమతించలేదు. ఇప్పటికే బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం ఇక్కడ పర్యటించేందుకు విఫలయత్నం చేసింది. తాజాగా గడ్కరీకి స్థానిక అధికార యంత్రాంగం అనుమతి నిరాకరించింది.

ఈ నెల 18న నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనేందుకు గడ్కరీ అనుమతి కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానంతో జిల్లా అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 21న కాళియచాక్ లో జరగనున్న ర్యాలీలో పాల్గొననుండడం విశేషం. ఇక్కడ అనుమతించకపోవడంతో దక్షిణ దినాజ్ పూర్ లో ర్యాలీ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement