kalvakuntla tarakarama rao
-
నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు
రాంగోపాల్‌పేట్: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీస్తామన్నారని, విదేశాల్లో ఉన్న దాన్ని కూడా దేశంలోకి తెప్పిస్తామని చెప్పారని.. కానీ, అది రాకపోగా నల్లకుబేరులు దేశం వదలి పారిపోయేలా చేశారని ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి నీరవ్ మోదీ, చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదలి పారిపోతే బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. జీడీపీని పెంచుతామని చెప్పి అధికారం చేపట్టిన మోదీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం పెంచుతూపోయారని ఎద్దేవా చేశారు. మోదీ పాలన కంటే ముందు.. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదని, ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టుకుని వెళ్లాలని నాడు మోదీ అన్నారని చెప్పారు. నేడు అదే సిలిండర్ ధర రూ.870 అయిందని విమర్శించారు. ఇప్పుడు సెంచరీకి చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర చూసి ప్రజలు బంకులోకి వెళ్లి మోదీ ఫొటోకు దండం పెట్టుకుంటున్నారని ఎగతాళి చేశారు. వీటిపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దేశం కోసం, ధర్మం కోసం అంటూ విరుచుకుపడుతున్నారని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది దేశం కోసం.. ధర్మం కోసమా.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలెక్కడ..? జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని.. కానీ, దీనిపై తాను ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా తన ఖాతాలో 15 లక్షల తిట్లు బీజేపీ నేతల నుంచి పడ్డాయని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆరున్నర సంవత్సరాల కాలంలో తాము 1,32,799 ఉద్యోగాలు కల్పించామని.. మరి మోదీ చెప్పిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై మోదీని ప్రశ్నిస్తే.. రోడ్ల పక్కన పకోడీ, ఇడ్లీ బండి పెట్టుకుని సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందుతున్న వారిని కూడా తాను కల్పించిన ఉద్యోగుల జాబితాలో చూపిస్తున్నారని విమర్శించారు. అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు లక్ష కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని చెప్పారని.. ఆరున్నరేళ్లలో తామే కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో అందించామని గుర్తు చేశారు. ఇవన్నీ అడిగితే.. బీజేపీ నాయకులు హిందూ, ముస్లిం, పాకిస్తాన్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుక అంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు అంటున్నారని.. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ఎప్పుడైనా ప్రశ్నించారా.. అని అన్నారు. న్యాయవాదుల సంక్షే మ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తే.. తానే చేయించానని ఆ పెద్ద మనిషి చెబుతున్నారని అంత అభిమానం ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల నిధి ఎందుకు తీసుకుని రాలేకపోయారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లకు సాయం చేయాలని ఆలోచించినా సుమా రు 10–12 లక్షల మంది ఉండటంతో అది సాధ్యం కాక ఏమి చేయలేకపోయామన్నారు. విద్యావంతులంతా ఈ నెల 14న ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు కోరారు. -
చారాణే చేశా.. చేయాల్సింది చాలా ఉంది: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: పల్లె నుంచి పార్లమెంట్ దాకా శాసిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యానించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన బుధవారం సొంత నియోజకవర్గం సిరిసిల్లకు వచ్చారు. రోడ్‌షో నిర్వహించిన అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలంటే కేసీఆర్ చెప్పినట్లుగా తృతీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించానని, ప్రజలంతా అఖండ మెజార్టీతో అండగా నిలిచారని, వారి ఆశలను వమ్ము చేయబోమని స్ప ష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని తరతరాలుగా గుర్తుండిపోయేలా చేస్తామన్నారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు కేసీఆర్ నాయకత్వాన్ని గౌరవించాయని తెలి పారు. దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న తెలం గాణను చూసి ఇతర రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయ ని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల గురించి దేశమంతటా చర్చ జరుగుతోందని కేటీఆర్ వివరించారు. చారాణే చేశా.. చేయాల్సింది చాలా ఉంది ‘గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్ ఆలస్యం కావడం తో బయటి నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఈసారి ముందుగానే సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్లు ఇవ్వడంతో నాణ్యమైన చీరలను రాష్ట్రంలోని ఆడబిడ్డలకు అందించబోతున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల నేతన్నల పనితనం రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డకు తెలుస్తున్నందుకు గర్వపడుతున్నాన ని చెప్పారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరి సిల్ల ప్రజలకు ఊహించిన దానికన్నా ఎక్కువే చేస్తానన్నారు. ఇప్పటిదాకా చేసింది చారాణా మాత్రమేనని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేస్తా సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పా టు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన స్థలం ఖరారు చేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను కోరారు. సిరిసిల్లకు రైల్వేలైను నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. రైల్వే ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిందన్నారు. రైల్వేట్రాక్ పనులు, భూసేకరణ పనులు ఏకకాలంలో సాగాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోడ్ కమ్ రైల్వేబ్రిడ్జి సిరిసిల్ల మధ్యమానేరుపై నిర్మించాలని సూచించారు. వేములవాడ ఆల య అభివృద్ధితో పాటు నాంపెల్లి గుట్ట నుంచి రోప్‌వే కార్ వసతిని ఏర్పాటు చేయాలని, మధ్యమానేరు బ్యాక్ వాటర్‌లో బోటింగ్ వసతి ఏర్పాటు చేయాలని అన్నారు. ధవళేశ్వరం తరహాలో మధ్యమానేరు వద్ద పర్యాటక రంగాన్ని విస్తృతం చేయాలన్నారు. సిరిసిల్ల ఔటర్ రింగురోడ్డు పనులను పూర్తిచేయాలని కేటీఆర్ కోరారు. జాతీయ ప్రమాణాలతో ఇండోర్ స్టేడియా న్ని నిర్మించాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12ల ద్వారా మధ్యమానేరు నీటితో చెరువులను అనుసంధానం చేయాలన్నారు. ఆగస్టు నాటికి ఎత్తిపోతల ద్వారా 265 చెరువులను నింపాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి మంజూరైన 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అనువైన స్థలా న్ని గుర్తించాలన్నారు. వేములవాడ వంద పడకల ఆస్పత్రిని పూర్తిచేసి నిర్మాణానికి సిద్ధం చేయాలని చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి, ఐటీడీఆర్ వ్యవసాయ కళాశాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. నేడు రెండు జిల్లాల్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు గురువారం జనగామ, వరంగల్‌లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల కేంద్రాల్లోనూ టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నా రు. ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేలా వరంగల్‌లో నిర్వహించే ‘కృతజ్ఞత సభ’లో పాల్గొననున్నారు. -
నేడు జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పర్యటన
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ జి.వివేకానందతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, జోగు రామన్న, నల్లాల ఓదెలు, ఎస్.వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య తదితరులు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాలతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో వారు పర్యటించనున్నట్లు టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించే వారు ఇంద్రవెల్లి అమరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారని చెప్పారు. అనంతరం ఉట్నూరు ఏజెన్సీలోని గిరిజన తండాలను సందర్శించి దండారీ, గుస్సాడి ఉత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా అనంతరం వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతోపాటు, నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ప్రభుత్వం ఓదార్పు కరువు ఆత్యహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను వారు పరామర్శిస్తారు.