సాక్షి, సిరిసిల్ల: పల్లె నుంచి పార్లమెంట్ దాకా శాసిస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యానించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన బుధవారం సొంత నియోజకవర్గం సిరిసిల్లకు వచ్చారు. రోడ్‌షో నిర్వహించిన అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలంటే కేసీఆర్ చెప్పినట్లుగా తృతీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించానని, ప్రజలంతా అఖండ మెజార్టీతో అండగా నిలిచారని, వారి ఆశలను వమ్ము చేయబోమని స్ప ష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని తరతరాలుగా గుర్తుండిపోయేలా చేస్తామన్నారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు కేసీఆర్ నాయకత్వాన్ని గౌరవించాయని తెలి పారు. దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న తెలం గాణను చూసి ఇతర రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయ ని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల గురించి దేశమంతటా చర్చ జరుగుతోందని కేటీఆర్ వివరించారు.
చారాణే చేశా.. చేయాల్సింది చాలా ఉంది
‘గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్ ఆలస్యం కావడం తో బయటి నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఈసారి ముందుగానే సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్లు ఇవ్వడంతో నాణ్యమైన చీరలను రాష్ట్రంలోని ఆడబిడ్డలకు అందించబోతున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల నేతన్నల పనితనం రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డకు తెలుస్తున్నందుకు గర్వపడుతున్నాన ని చెప్పారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరి సిల్ల ప్రజలకు ఊహించిన దానికన్నా ఎక్కువే చేస్తానన్నారు. ఇప్పటిదాకా చేసింది చారాణా మాత్రమేనని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు.
జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేస్తా
సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పా టు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన స్థలం ఖరారు చేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను కోరారు. సిరిసిల్లకు రైల్వేలైను నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. రైల్వే ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిందన్నారు. రైల్వేట్రాక్ పనులు, భూసేకరణ పనులు ఏకకాలంలో సాగాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోడ్ కమ్ రైల్వేబ్రిడ్జి సిరిసిల్ల మధ్యమానేరుపై నిర్మించాలని సూచించారు. వేములవాడ ఆల య అభివృద్ధితో పాటు నాంపెల్లి గుట్ట నుంచి రోప్‌వే కార్ వసతిని ఏర్పాటు చేయాలని, మధ్యమానేరు బ్యాక్ వాటర్‌లో బోటింగ్ వసతి ఏర్పాటు చేయాలని అన్నారు. ధవళేశ్వరం తరహాలో మధ్యమానేరు వద్ద పర్యాటక రంగాన్ని విస్తృతం చేయాలన్నారు.
సిరిసిల్ల ఔటర్ రింగురోడ్డు పనులను పూర్తిచేయాలని కేటీఆర్ కోరారు. జాతీయ ప్రమాణాలతో ఇండోర్ స్టేడియా న్ని నిర్మించాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12ల ద్వారా మధ్యమానేరు నీటితో చెరువులను అనుసంధానం చేయాలన్నారు. ఆగస్టు నాటికి ఎత్తిపోతల ద్వారా 265 చెరువులను నింపాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి మంజూరైన 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అనువైన స్థలా న్ని గుర్తించాలన్నారు. వేములవాడ వంద పడకల ఆస్పత్రిని పూర్తిచేసి నిర్మాణానికి సిద్ధం చేయాలని చెప్పారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి, ఐటీడీఆర్ వ్యవసాయ కళాశాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు.
నేడు రెండు జిల్లాల్లో పర్యటన
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు గురువారం జనగామ, వరంగల్‌లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల కేంద్రాల్లోనూ టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నా రు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేలా వరంగల్‌లో నిర్వహించే ‘కృతజ్ఞత సభ’లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment