kalyana durgam division
-
చిన్నారితో ముచ్చటించిన ఉషశ్రీ చరణ్
-
షాడో ఎమ్మెల్యేదే పెత్తనం
తెలుగుదేశం పార్టీతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ‘పెద్దాయన’ అనే మంచి పేరున్న ఉన్నం హనుమంతరాయచౌదరికి ఎమ్మెల్యే అయిన తర్వాత పరపతి పూర్తిగా మసకబారింది. ఇందుకు కారణం ఆయన కుమారుడు, యువనేత మారుతీచౌదరి వ్యవహార శైలి. రెండో కుమారుడు ఉదయ్‌కుమార్ చౌదరి కూడా భూ వివాదాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ‘షాడో’ ఎమ్మెల్యేగా పేరొందిన మారుతిచౌదరి శుక్రవారం అనంతపురంలోని హంద్రీనీవా కార్యాలయంలో ఇంజినీర్లపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడిన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ ఘటన జిల్లాలో రచ్చరచ్చగా మారింది. యువనేత వైఖరిని అటు టీడీపీ, ఇటు అధికార వర్గాలు చీదరించుకుంటున్నాయి. – కళ్యాణదుర్గం తండ్రిపదవి.. తనయుడి పెత్తనం 2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారం చేపట్టగానే యువనేత మారుతీ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే అయిన తండ్రి ఉన్నం హనుమంతరాయ చౌదరిని డమ్మీ చేసేశారు. అధికార యంత్రాంగంతో పాటు పార్టీని కూడా తన కనుసన్నల్లోనే నడుచుకునేలా ఆంక్షలు విధించారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టు పనులు ఎవరితో చేయించాలి..? అధికారులను ఎవరిని వేయించుకోవాలి? వారు వినకపోతే బదిలీ చేసి ఎవరిని నియమించుకోవాలనేదే ఆ యువనేత నిత్యకృత్యం. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. ఆయన చెప్పిందే వేదం.. నియోజకవర్గంలో మారుతీచౌదరి చెప్పిందే వేదం. రెండేళ్ల క్రితం మడకశిర ప్రాంతంలో టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా అనారోగ్యం పాలై తిరిగి కంబదూరు తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన అధికారిని సీట్లో కూర్చోకుండా పార్టీ యంత్రాంగంతో నడిపిన తతంగం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బ్రహ్మసముద్రం మండలంలో నిజాయతీగా పనిచేసిన ఓ ఎస్ఐ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోగా ఆ మండల తెలుగు తమ్ముళ్లు రుబాబు చేశారు. చివరకు అందరూ నాన్‌బెయిలబుల్ కేసులో ఇరుక్కుపోయారు. వీరిని కాపాడేందుకు సదరు ఎస్ఐను ఇక్కడి నుంచి పంపించేశారు. ఆ ఎస్ఐనే కాదు నిజాయతీగా పనిచేస్తున్న యువ డీఎస్పీని కూడా బదిలీ చేయించారు. నియోజకవర్గ కేంద్రానికి ముఖద్వారమైన మండల కేంద్రంలో పనిచేసిన ఓ తహసీల్దార్ వీరు చెప్పినట్లు నడుచుకోలేక విసుగెత్తి బదిలీచేయించుకున్నారు. చెప్పినట్టు వినలేదని ఇటీవల ఒక సీఐను వీఆర్‌కు పంపారు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ యువనేత జోక్యం పెరిగిపోతోంది. నియోజకవర్గంలో ఏ స్థాయి అధికారి బదిలీపై రావాలన్నా..కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవాలన్నా యువనేతను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వ్యతిరేకిస్తే ‘అధికారాలు’ కత్తిరింపు నియోజకవర్గంలో ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా యువనేత చెప్పినట్లు నడుచుకోకుంటే వారికి అధికారాలు కత్తిరించేస్తున్నారు. కళ్యాణదుర్గం ఎంపీపీ మంజులా కొల్లప్ప, బ్రహ్మసముద్రం ఎంపీపీ మంజులతో పాటు దుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ రామలక్ష్మిలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని పాలన సాగించకుండా అడ్డంకులు సృష్టించాడు. ఇద్దరు దళిత ఎంపీపీలకు అధికారాలు కత్తిరింపు చేయడంతో చివరకు వారు యువనేత వద్ద తలొగ్గి పనులు చేయించుకోక తప్పలేదు. రోడ్ల విస్తరణ విషయంలో చైర్పర్సన్ బీకే రామలక్ష్మికీ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. యువనేత వ్యవహర శైలిపై అధికారులు, ప్రజల్లోనే కాదు.. టీడీపీలోని నాయకుల్లోనూ అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. వినకుంటే దౌర్జన్యం శెట్టూరు, కళ్యాణదుర్గం మండల సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న గాలిమరల పనులను మారుతీచౌదరి అడ్డుకుని కాంట్రాక్టర్లను వెనక్కుపంపారు. చివరకు యాక్సిస్, ఎకోరియన్, గ్రీన్కో, హీరో, సుజలాన్, విండ్ పవర్ కంపెనీలు ఏ పని చేయాలన్నా ఆయన్ను సంప్రదించే చేస్తున్నాయి. గాలిమరల బిడ్డింగ్‌లను వేయడం మొదలుకుని మట్టిరోడ్లు, విద్యుత్ లైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు ఆయన చెప్పిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారు. ఈ విషయంలో కిందిస్థాయి టీడీపీ నేతలకు ఒక్క పనికూడా ఇవ్వకపోవడంతో యువనేతపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. 2014 డిసెంబర్లో బోయలపల్లి గ్రామ సమీపాన రైల్వే పనులు చేస్తుండగా కాంట్రాక్టర్ కమీషన్లు ఇవ్వలేదని ఏకంగా జేసీబీలు ధ్వంసం చేసి హంగామా సృష్టించారు. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి, చెలిమేపల్లి వద్ద వేదావతి నదిలో ఇసుక దందాకు పాల్పడ్డారు. -
ట‘మోత’
సాక్షి, అనంతపురం/కళ్యాణదుర్గం : నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత టమాట రైతులకు మంచి రోజులొచ్చాయి. ధర బాగా పలుకుతుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ఇదే తరుణంలో వినియోగదారులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోనే కళ్యాణదుర్గం డివిజన్లో టమాటను ఎక్కువగా పండిస్తారు. అక్కడి రైతులు రెండేళ్లుగా తీరని నష్టా లను చవిచూశారు. 25 రోజుల క్రితం వరకూ గిట్టుబాటు ధర లభించలేదు. దీనివల్ల వేలాది ఎకరాల్లో పంటను తొలగించారు. జూన్ చివరి నుంచి ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.60కి చేరింది. ఈ ధరను చూసి కళ్యాణదుర్గం డివిజన్ రైతులు మళ్లీ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ధర ఇప్పుడున్న దాంట్లో సగం ఉన్నా గిట్టుబాటు అవుతుందన్న నమ్మకంతో పంట వేస్తున్నారు. నాలుగు వేల ఎకరాలకు పైగా సేద్యం చేసి.. మదనపల్లి నుంచి నారు తెప్పిస్తున్నారు. ఇదే తరుణంలో నర్సరీలలో టమాట మొక్కల ధర కూడా పెరిగింది. జిల్లాలో ఉన్న 100 వరకు నర్సరీలలో టమాట మొక్కలు అందుబాటులో లేవు. 7 వేల ఎకరాలకు తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడాది టమాట సాగు విస్తీర్ణం ఊహించని విధంగా తగ్గింది. వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పడిపోవడం, గాలీవానకు పంటలు దెబ్బ తినడం, జూలై మొదటి వారం వరకు ఎండవేడిమి ఎక్కువగా ఉండటంతో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే జిల్లాలో పది వేల ఎకరాలకు పైగా టమాట వేసేవారు. ఈసారి మాత్రం ఏడు వేల ఎకరాలకే పరిమితమైంది. ఇందులోనూ ఒక్క కళ్యాణదుర్గం డివిజన్‌లోనే ఐదు వేల ఎకరాలలో సాగు చేశారు. ప్రస్తుతం మరో నాలుగు వేల ఎకరాలలో మొక్కలు నాటుతున్నారు. గతమంతా నష్టాలమయం జిల్లాలోని టమాట రైతులు 2009లో జల్, లైలా తుపానులు, 2010లో తెగుళ్లు, 2011లో అమ్మకాలు లేక పంట కుళ్లిపోవడం, 2012లో నీలం తుపాను, 2013లో వర్షాభావం వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సాధారణంగా జిల్లాలో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో టమాట సాగు చేస్తారు. ఈ మాసాల్లో సాగు చేస్తే వేసవికి ముందే అంటే ఏప్రిల్, మే నాటికే పూర్తి స్థాయిలో దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో తీవ్ర వర్షాభావం కారణంగా వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. దీంతో టమాట సాగు చేయలేదు. మే రెండవ వారం తొలకరి వర్షాలు ఊరించడంతో పంట వేశారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏడాది పొడవునా టమాట సాగు చేసే చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ప్రాంతంలో కూడా సాగు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ధరకు రెక్కలొస్తున్నాయి. వినియోగం, దిగుబడికి మధ్య వ్యత్యాసం రాష్ట్రంలోనే అతిపెద్ద టమాట మార్కెట్ మదనపల్లెలో ఉంది. ఈ మార్కెట్‌కు చిత్తూరు జిల్లా నుంచే కాకుండా, కర్ణాటక రాష్ట్రంతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, ప్యాపిలి ప్రాంతాల నుంచి టమాట తీసుకెళుతుంటారు. రోజూ మదనపల్లె మార్కెట్‌కు 550 నుంచి 600 టన్నుల వరకు టమాట వస్తుంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుతో పాటు తమిళ నాడు, పాండిచ్చేరి, గోవా, ఢిల్లీ, ముంబాయి, నాగపూర్, చత్తీస్‌ఘడ్‌కు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా టమాట దిగుబడి తగ్గిపోయి మదనపల్లె మార్కెట్‌కు 200-220 టన్నుల మధ్యలో వస్తోంది. దీంతో మదనపల్లె మార్కెట్లో వేలం పాటల్లో పోటీ పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి. దీన్ని పసిగట్టిన జిల్లాకు చెందిన రైతులు ఒక్క టన్ను కూడా ఇక్కడ విక్రయించకుండా పూర్తిగా దిగుబడిని మదనపల్లెకు తరలిస్తున్నారు. తిరిగి అక్కడి నుంచే జిల్లాకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. శనివారం మదనపల్లె మార్కెట్లో కిలో టమాట మొదటి రకం రూ.50, రెండో రకం రూ.45 పలికాయి. మొదటి రకం టమాట విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. రెండో రకం స్థానిక వ్యాపారులు కొనుగోలు చేస్తారు. హోల్‌సేల్‌గానే కిలో రూ.45 పలకడంతో రవాణా ఖర్చులు, ఇతర వాటిని కలుపుకుని జిల్లాలో రూ.60కి పైగానే విక్రయిస్తున్నారు.