Kamath
-
పిన్న వయసులోనే రూ.110 కోట్లు విరాళం
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఆయన సోదరుడు కంపెనీ సీఈఓ నితిన్ కామత్ 2023 ఏడాదికి గాను రూ.110 కోట్లు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ 2023లో చోటు సంపాదించారు. అయితే ఈ లిస్ట్‌లో చోటు సాధించిన వారిలో నిఖిల్ కామత్ పిన్న వయస్కుడు. గడిచిన ఏడాదిలో ఇద్దరు సోదరులు సమిష్టిగా తమ విరాళాన్ని 300 శాతం పెంచి రూ.100 కోట్ల దాతృత్వాన్ని ప్రకటించినట్లు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 వెల్లడించింది. అయితే ఈ ఏడాది దేశంలో తొమ్మిదో అతిపెద్ద దాతగా వీరు వార్తల్లో నిలిచారు. అయితే 2021లో వీరిద్దరూ తమ వ్యక్తిగత సంపదలో నాలుగింట ఒక వంతు విరాళంగా ఇవ్వాలని ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో రూ.750 కోట్లను తిరిగి ఇచ్చే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు. వాతావరణ మార్పు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు తన సంపదలో 50 శాతం విరాళమిస్తానని గతంలో నిఖిల్ కామత్ ప్రకటించారు. వారెన్‌బఫెట్, మిలిందాగేట్స్, బిల్‌గేట్స్ స్థాపించిన గివింగ్ప్లెడ్జ్పై నిఖిల్కామత్ సంతకం చేశారు. ఇందులో చేరిన నాలుగో భారతీయుడు కామత్. విప్రో మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా, నందన్ నీలేకని తర్వాత నిఖిల్ గివింగ్‌ప్లెడ్జ్ కమ్యునిటీలో చేరారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం నిఖిల్ మొత్తం రూ.27వేల కోట్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. నిఖిల్ తన సొంత ఫౌండేషన్ యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (వైఐపీపీ) ద్వారా కొన్ని స్టార్టప్ కంపెనీలతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. -
యుద్ధ విమానం స్వదేశీ గర్జన!
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్‌లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అంకుర సంస్థలకు ప్రోత్సాహం రక్షణ రంగంలో స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు. 2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్సీఏ ఎంకే–2 ఇండక్షన్కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్‌తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ఎలైట్ క్లబ్లో చేరడం గర్వకారణం ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్‌లో చేరడం గర్వకారణం. యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది. -
డీఆర్డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
పెరుగుతున్న అప్పులపై ఆందోళన వద్దు, కేంద్రంపై ప్రశంసలు
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుకు సంబంధించి ధైర్యం ప్రదర్శించాల్సిన సమయం ఇదని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ పేర్కొన్నారు. వృద్ధికి అవసరం అనుకుంటే, బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికన్నా ఎక్కువగా ద్రవ్యలోటు లక్ష్యాలను మరింత పెంచాలని ఆయన సూచించారు. భారత్కోసం 25 సంవత్సరాల వృద్ధి రన్‌వే అవకాశం ఎదురుచూస్తోందని కూడా కామత్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి 8 శాతంలోపు వడ్డీరేట్లు, అపారమైన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) అవసరం అని సూచించారు. ద్రవ్యలోటుపై ప్రముఖ బ్యాంకర్‌గా కామత్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కామత్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే.. ద్రవ్యలోటు విషయంలో ఇప్పటికే కేంద్రం ధైర్యాన్ని ప్రదర్శించింది. దేశం నిరంతరాయంగా వృద్ధి బాటలో పయనిస్తుందని భావిస్తే, ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచడానికి సిద్ధమని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం సూచిస్తోంది. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోతోందని ఆందోళన అక్కర్లేదన్నది నా భావన. ఎందుకంటే ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు వివిధ వినూత్న ఫైనాన్షింగ్ అవకాశాలు ఉన్నాయి. నగదు ముద్రణ ఇందులో ఒకటి. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో తగిన స్థాయిలో ఉండడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. వడ్డీరేట్లు దిగువ స్థాయిలోనే కొనసాగుతాయని విశ్వసిస్తున్నాను మౌలిక రంగం పటిష్టతలో ఉన్న క్లిష్టతలను జాగ్రత్తగా ఎదుర్కొనాలి. వినూత్న, ఆధునిక ఫైనాన్షింగ్ విధానాలను ప్రభుత్వం ఇందుకు అనుసరించాల్సి ఉంటుంది.ఈ సమయంలో పన్ను రహిత మౌలిక సదుపాయాల బాండ్లను ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. అవసరమైతే ప్రభుత్వం మాత్రమే ఇటువంటివి జారీ చేయాలి. థర్డ్ పార్టీలను అనుమతించాల్సిన అవసరం లేదు. తయారీ విషయంలో భారత్ కంపెనీలకు గతం తరహాలో ఇప్పుడు పెద్దగా ఇబ్బంలు లేవు. తగిన నిధుల అందుబాటు ఇందుకు కారణం.కొత్త తరం కంపెనీలకు ప్రస్తుతం లభించిన ఒక పెద్ద అవకాశం ‘డిజిటల్ సూపర్‌సైకిల్’. తద్వారా ఉపాధి అవకాశాలను కొత్త తరం కంపెనీలు సృష్టించవచ్చు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడవచ్చు. భారత్‌కు సువిశాల తీరప్రాంతం ఉంది. దీనిని దేశం సద్వినియోగ పరచుకోవాలి. తీరప్రాంత ఆర్థిక మండళ్ల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించాలి. అలాంటి మండళ్లను స్వయంగా ప్రారంభించాలి. 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. 2020–21లో ద్రవ్యలోటును 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్న కేంద్రం లక్ష్యాలన్ని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఇది ఏకంగా 9.3 శాతానికి ఎగసింది. విలువలో ఇది రూ.18,21,461 కోట్లు. 2022 మార్చితో ము గిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి కట్టడి చేయాలని 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేర్కొంది. అయితే కరోనా సెకండ్‌వేవ్ సవాళ్ల వల్ల ఈ లక్ష్యం 8 శాతం దాటిపోతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి నెల– ఏప్రిల్ ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 5.2 శాతానికి చేరింది. విలువలో రూ.78,699 కోట్లు. 2021–22లో 6.8 శాతం లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో రూ.15,06,812 కోట్లు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. -
డిసెంబర్ 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు మోనికా సెలెస్ (మాజీ టెన్నిస్ క్రీడాకారిణి), కామత్ (వ్యాపారవేత్త) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఆస్తికి సంబంధించి నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. అయితే అదనపు బరువు బాధ్యతలు మీదపడి, మీరే నెరవ్చేవలసి వస్తుంది. కొత్తగా కోర్టు వివాదాలలో తలదూర్చకుండా, వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం విజయాలను తీసుకు వచ్చినా, శ్రమ తప్పదు. వీరు పుట్టిన తేదీ 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల జన్మతః మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం వస్తాయి. చేసే వృత్తిలో తెలివితేటలతోపాటు చొరవ చూపడం వల్ల ప్రమోషన్ రావడం లేదా ఉన్నతమైన ఉద్యోగావకాశం లభిస్తుంది. అనూహ్యంగా ఫారిన్ ఛాన్స్ వస్తుంది. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. లక్కీ నంబర్స్: 1,2, 2,4; లక్కీ డేస్: బ్లూ, వైట్, క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీడేస్: సోమ, గురు, శనివారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అనాథాశ్రమాలు/ దేవాలయాలు/ చర్చిలు/ మదరసాలకు బియ్యాన్ని విరాళంగా ఇవ్వడం, ఇంటికి వచ్చిన వారికి ప్రేమతో పాయసం తినిపించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
బ్రిక్స్ నిధికి భారత్.. 18 బిలియన్ డాలర్లు
మాస్కో : బ్రిక్స్ దేశాలు 100 బిలియన్ డాలర్లతో నెలకొల్పనున్న విదేశీమారక ద్రవ్య నిల్వల నిధి(ఫారెక్స్ రిజర్వ్స్ పూల్)కి భారత్ తనవంతుగా 18 బిలియన్ డాలర్లను సమకూర్చనుంది. డాలర్ లిక్విడిటీలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి ఈ నిధి తోడ్పాటును అందిస్తుంది. బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఫారెక్స్ రిజర్వ్స్ పూల్‌కు సంబంధించిన నిర్వహణ ఒప్పందంపై సభ్య దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాం కులు సంతకాలు చేశాయి. అంతకుముందు బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల చీఫ్‌ల సమావేశం జరిగింది. ఈ నిధికి అత్యధికంగా చైనా నుంచి 41 బిలియన్ డాలర్లు సమకూరనున్నాయి. ఈ నిధిని సభ్యదేశాలు ఒక బీమా సాధనంగా ఉపయోగించుకోనున్నాయని.. చెల్లింపుల సమతౌల్యత(బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్)లో ఇబ్బందులు ఎదురైతే దీని నుంచి నిధులను తీసుకోవచ్చని రష్యా సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 30 నుంచి ఈ సదుపాయం అమల్లోకిరానుంది. కాగా, బుధ, గురువారాల్లో జరిగే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడం గమనార్హం. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు ఆయా దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ప్రధానంగా బ్రిక్స్ బ్యాంక్‌కు ప్రారంభ నిధులను సమకూర్చడంపై సదస్సులో చర్చించనున్నారు. హైడ్రో ప్రాజెక్టులపై భారత్, రష్యా ఎంఓయూ.... జల విద్యుత్ రంగంలో ప్రాజెక్టులకు నిధులందించేందుకు భారత్, రష్యా సహకరించుకోనున్నాయి. దీనిలో భాగంగా రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్), ఇండియా ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ(ఐడీఎఫ్సీ)లు ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. అదేవిధంగా బ్రిక్స్ దేశాల్లోని ఇతర సభ్య దేశాలకు చెందిన ఇతర సంస్థలతో కూడా మౌలిక ప్రాజెక్టులకు నిధుల కల్పనకు సబంధిందించి తాము ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్డీఐఎఫ్ డెరైక్టర్ జనరల్ కిరిల్ దిమిత్రీవ్ చెప్పారు. సమున్నత లక్ష్యాల సాధనకు కృషి బ్రిక్స్ బ్యాంక్‌పై ‘తొలి ప్రెసిడెంట్’ కామత్ వ్యాఖ్య ఉఫా (రష్యా): కొత్తగా ఏర్పాటవుతున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సొంత ప్రమాణాలకు అనుగుణంగా- అత్యున్నత లక్ష్యాల సాధనకు కృషి చేస్తుందని ఈ బ్యాంక్ చీఫ్‌గా నియమితులైన కేవీ కామత్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వంటి తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు ఉండబోదని స్పష్టం చేశారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి గత ఏడాది 100 బిలియన్ డాలర్ల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తోటి బహుళజాతి బ్యాంకులతో ఎటువంటి పోరు పరిస్థితీ ఉండనప్పటికీ, ఈ బ్యాంకుల కార్యకలాపాల్లో ఒక కొత్త మార్పు తీసుకువచ్చే రీతిలో ఎన్డీబీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. భారత్‌లో మౌలిక రంగానికి సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, బ్రిక్స్ దేశాలన్నింటి విషయంలో మౌలిక రంగంలో పురోగతి సాధించాల్సి ఉందని అన్నారు. ఏ ఒక్క బ్యాంకో ఈ అవసరాలను ఒక్కటిగా తీర్చలేదని వివరించారు. 20న బాధ్యతలు...: షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న బ్యాంక్ గవర్నర్ల బోర్డ్ సమావేశం మంగళవారం మాస్కోలో జరిగింది. బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. బ్రిక్స్ దేశాల ఏడవ సదస్సుకు ఒక రోజు ముందు ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘‘బ్యాంక్ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక నేను జూలై 20న షాంఘైలో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నాను’’ అని కూడా కామత్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
బ్రిక్స్ బ్యాంక్ సారథి కామత్
గత వారం బిజినెస్ మూడోసారి వడ్డీరేట్లు తగ్గించిన చైనా 10/05/15: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆరు నెలల సమయంలో మూడు సార్లు వడ్డీరేట్లను తగ్గించింది. చైనా పబ్లిక్ బ్యాంక్ వడ్డీ రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. బ్రిక్స్ బ్యాంక్ సారథి... కామత్ 11/05/15: ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి పోటీగా వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులందించడమే లక్ష్యం గా 100 బిలియన్ డాలర్ల మూలధనంతో షాంఘై కేంద్రంగా ఏర్పాటుకానున్న బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రెసిడెంట్‌గా కేవీ కామత్ పేరు ఖరారైంది. రెండంకెల వృద్ధే లక్ష్యంగా.. లగ్జరీ కార్ల కంపెనీలు మెర్సిడస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కం పెనీలు రెండంకెల వృద్ధిపై కన్నేశాయి. ఈ ఏడాది తొలి 5 నెలల్లో బీఎండబ్ల్యూ 10 మోడళ్లను, మెర్సిడస్ 5 మోడళ్లను, ఆడి 4 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అలాగే ఈ 3 కంపెనీలు డిసెంబర్ చివరికి 30 మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయి. టోకు ధరలు మరింత తగ్గాయ్ 12/05/15: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్‌లో -2.65 శాతానికి క్షీణించింది. 2014 ఏప్రిల్‌తో పోలిస్తే మొత్తం టోకు వస్తువుల ధరలు -2.65 శాతానికి తగ్గాయన్నమాట. గతేడాది జీరో స్థాయిలో కదలాడుతున్న ద్రవ్యోల్బణ రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్లలోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్ లేకపోవడానికి ప్రతిబింబమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 5 నెలల కనిష్టానికి పారిశ్రామికాభివృద్ధి తయారీ రంగం కాస్త పుంజుకున్నప్పటికీ పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు (ఐఐపీ) 2.1 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.86 శాతంగా (సవరణకు ముందు 5 శాతం) నమోదైంది. గతేడాది ఐఐపీ మైనస్‌లలో (-0.5 శాతం) కొనసాగింది. గతేడాది అక్టోబర్‌లో -2.7 శాతంగా ఉన్న ఐఐపీ నవంబర్‌లో 5.2 శాతం, డిసెంబర్ 3.56 శాతం, జనవరి 2.77 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వచ్చింది. రిటైల్ ధరలు కూల్ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ నెలలో 4.87 శాతంగా నమోదైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే 2014 ఏప్రిల్ ధరలతో పోలిస్తే ఆయా వినియోగ వస్తువుల ధరలు 4.87 శాతం పెరిగాయన్నమాట. ఇక మార్చి నెలలోలో రిటైల్ ద్రవ్యోల్చణం రేటు 5.25 శాతంగా నమోదైంది.