డిసెంబర్ 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
మోనికా సెలెస్ (మాజీ టెన్నిస్ క్రీడాకారిణి), కామత్ (వ్యాపారవేత్త)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో ఆస్తికి సంబంధించి నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. అయితే అదనపు బరువు బాధ్యతలు మీదపడి, మీరే నెరవ్చేవలసి వస్తుంది.
కొత్తగా కోర్టు వివాదాలలో తలదూర్చకుండా, వివాదాల జోలికి పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం విజయాలను తీసుకు వచ్చినా, శ్రమ తప్పదు. వీరు పుట్టిన తేదీ 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల జన్మతః మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం వస్తాయి. చేసే వృత్తిలో తెలివితేటలతోపాటు చొరవ చూపడం వల్ల ప్రమోషన్ రావడం లేదా ఉన్నతమైన ఉద్యోగావకాశం లభిస్తుంది. అనూహ్యంగా ఫారిన్ ఛాన్స్ వస్తుంది. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు.
లక్కీ నంబర్స్: 1,2, 2,4; లక్కీ డేస్: బ్లూ, వైట్, క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీడేస్: సోమ, గురు, శనివారాలు.
సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అనాథాశ్రమాలు/ దేవాలయాలు/ చర్చిలు/ మదరసాలకు బియ్యాన్ని విరాళంగా ఇవ్వడం, ఇంటికి వచ్చిన వారికి ప్రేమతో పాయసం తినిపించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్