kandi farmers
-
పడిగాపులు తప్పవా?
అనంతగిరి(వికారాబాద్) : రైతులు ఏడాది పొడువునా పండించిన పంట విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా తమ వంతుకోసం పడిగాపులు పడుతున్నారు. వికారాబాద్‌లోని కందుల కొనుగోలు కేంద్రంలో కందులు అమ్ముకునేందుకు వచ్చి రెండు మూడు రో జులైనా ఇంకా తూకాలు వేయడంలేదు. ఉదయం 7 గంటలకు వచ్చి చిట్టీలు ఇస్తామన్న అధికారులు 10 దాటినా రాక పోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌లోని కొనుగోలు కేంద్రానికి వికారాబాద్, నవాబ్‌పేట, పూడూర్ మండలాలకు చెందిన రైతుల కందులు తీసుకొస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కందులు రావడంతో తెచ్చిన వాటిని ఇంటికి తిరిగి తీసుకుపోలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో వారు నెల రోజుల ముందే కందుల షాంపిల్‌ను తీసుకొచ్చి అధికారులకు చూయించారు. వారు అమ్మేందుకుగాను వారి పేర్లను రిజిస్టార్లో రాసుకుని 6వ తేదీ రావాలని ఇచ్చారని రైతులు తెలిపారు. కాగా వారు భరోసాతో ట్రాక్టర్లలో, ఆటోలు తదితర వాహనాల్లో కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. తీరా అక్కడ అధికారులు లేదు. ఎవరైతే ముందు వచ్చారో వారివే తూకం చేస్తామనడంతో రైతులు చేసేదేమీ లేక ఎలాగోలా తాము తెచ్చిన కందులు విక్రయించాలనే ఉద్దేశంతో మళ్లీ తేదీలు మార్పించుకుని మరీ ఎదురుచూస్తున్నారు. 7వ తేదీన రిజిస్టార్లో నంబర్లు రాయించి అక్కడే ఉన్నారు. అలా రాయించిన వారు 8వ తేదీన తూకం జరిగాయి. అధికారులు రైతుల అవస్థలు చూసైనా మండలానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండలానికి ఒకటి చొప్పున తూకం పెట్టినట్లయితే ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. తాండూరు : కంది పండించడంలో తాండూరుకు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కందుల బస్తాలతో మార్కెట్ కళకళలాడేది. కాని ఈ సారి మార్కెట్లో «మద్దతు ధర కరువైంది. దీంతో కేంద్ర ప్రభు త్వం మద్ధతు ధర అందించేందుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న మూడు కేంద్రాలు ఎత్తేయడంతో వారం రోజులుగా ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి తాండూరులోనే మద్దతు ధరకు కందుల కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 65వేల క్వింటాళ్ల కొనుగోలు ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన కంది దిగుబడులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలో 4 కేంద్రాలు నెల రోజుల కిందట ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు తాండూరు రైతు బజార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంతో పాటు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్,బషీరాబాద్, లక్ష్మీణారాయణపూర్లలో ఏర్పాటు చేసిన మద్దతు ధర కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 65వేల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. దీంతో 35.42 కోట్ల వ్యాపారం జరిగింది. భారీగా పోటెత్తిన కందులు.. నియోజకవర్గంలో పెద్దేముల్, లక్ష్మినారాయణపూర్, బషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన కంది కొ నుగోలు కేంద్రాలను ఎత్తి వేశారు. దీంతో రై తులు, గ్రామాల నుంచి రైతులు భారీగా కం దులు తీసుకొన్నారు. మూడు రోజుల వ్యవధిలో నే ్ౖచరెతు బజార్ ప్రాంగణం, డీసీఎంఎస్ కార్యాలయ ప్రాంగణం, దాల్మిల్ గొదాం అన్ని చోట్ల కంది బస్తాల నిల్వలతో నిండిపోయింది. రై తులు గ్రామాల నుంచి కందులను తీసుకువస్తు న్న అధికారులు మాత్రం ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. గ్రామాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలు పూర్తిగా ఎత్తి వేశాకే తాండూరులో కొ నుగోళ్లను ప్రారంభించాలని డీసీఎంఎస్, మా ర్క్‌ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. మరో రెం డు మూడు రోజుల్లో నిల్వ చేసుకునేందుకు వీలు లేకుండా రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అధికారులు నిల్వలు లేకుండా వెంట వెంటనే కందులను కొనుగోలు చేస్తే ఇబ్బందులు పోతాయని రైతులు అంటున్నారు. పేరు నమోదు చేసి నెలైంది గత నెల కిందట కందుల షాంపిల్ తెచ్చి చూయించాను. ఇక్కడ అధికారులు ఒక రిజిస్టర్లో పేర్లు రాసుకుని 6వ తేదీన రమ్మన్నారు. ఎలాగైన తూకం అవుతుంది కదా అని కందులు తీసుకుని 6న వచ్చాను. మరల చిట్టీ ఇచ్చి 8న తూకం చేశారు. – నర్సింహారెడ్డి, రైతు మండలానికి ఒక కాంటా పెట్టాలి రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు మండలానికి ఒక కాంటా పెట్టాలి. ఏ మండలం వారు ఆ కాంటవద్దకెళ్లి తూకాలు వేసుకోవాలి. రైతులు కందులు తీసుకొచ్చి 2–3 రోజులైనా తూకాలు చేయకపోవడంతో ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – శ్రీనివాస్, రైతు -
'కంది' పోతున్న రైతులు
మార్కెట్‌యార్డులో పేరుకుపోయిన నిల్వలు రోజుల తరబడి నిరీక్షణ.. ఆలస్యంగా పంట దిగుబడి.. రేపటి నుంచి కందుల కొనుగోళ్లు బంద్ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట దిగుబడి కోసం రేయింబవళ్లు కష్టపడిన రైతులు చేతికొచ్చిన పంటను విక్రయించాలన్నా మార్కెట్యూర్డులో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ‘మార్కెట్యూర్డులోనే పంట దిగుబడికి గిట్టుబాటు ధర లభిస్తుంది.. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు.. ప్రభుత్వ రంగ సంస్థలే రోజువారీగా కొనుగోలు చేస్తారు. అమ్మిన వాటికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తాం..’ అంటూ చెబుతున్న ప్రభుత్వం, అధికారులు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్యూర్డుకు కందులను తీసుకొచ్చిన రైతులు కొనుగోళ్లు.. డబ్బుల చెల్లింపులు లేక రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 46 వేల హెక్టార్లలో కంది పంట సాగు చేశారు. జిల్లాలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం కొనుగోళ్లు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆలస్యంగా సాగు చేయగా ఇప్పుడిప్పుడే దిగుబడి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయిస్తే గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో మార్కెట్‌కు భారీగా కందులు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్లో రెండు మూడు రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు యూర్డులోనే పడిగాపులు కాస్తున్నారు. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక.. తీసుకొచ్చిన ధాన్యాన్ని తీసుకెళ్లలేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో పదిహేను రోజుల క్రితం ఆరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా కొద్ది రోజులుగా రెండు చోట్ల కొనుగోళ్లు నిలిపి వేశారు. దీంతో భారీగా జిల్లా కేంద్రంలోని మార్కెట్‌కే తరలిస్తున్నారు. కందులకు సరిపడా గన్ని బ్యాగులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తున్నట్లు ఆదిలాబాద్ మార్కెట్ ఉన్నత కార్యదర్శి అన్నెల అడెల్లు బుధవారం ప్రకటించారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యార్డులో నాలుగు ప్లాట్‌ఫాంలు నిండిపోగా.. యార్డులోని ఖాళీ స్థలం కూడా కందుల కుప్పలు పేరుకపోయాయి. సరిపడా గన్ని బ్యాగులు ముందుస్తుగా తెప్పించక పోవడం వల్లే నిల్వలు పేరుకుపోయాయి. దళారులకే పెద్దపీట కంది పప్పుకు ఉన్న డిమాండ్‌తో ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలే కందులను మద్దతు ధర కంటే రూ.2 వేల నుంచి రూ.4వేలు వరకు అదనంగా చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో రైతులు పెద్ద ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్‌కే విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 86,864 క్వింటాళ్ల కందులను కొనుగో లు చేశారు. ఏటా వ్యాపారులు జిమ్మిక్కులతో మద్దతు ధర కంటే తక్కువగా చెల్లిస్తూ కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సం స్థలు ముందుకు రావడం వ్యాపారులకు మిం గుడు పడడం లేదు. దీంతో కొన్ని రోజులుగా వ్యాపారులు అధికారులను తమ జిమ్మిక్కులకు అనుగుణంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలున్నారు. రైతులు తీసుకొచ్చిన కందులను కోనడంలో ఆలస్యం చేస్తూ.. దళారులు తెచ్చిన కందులకు గంటల్లోనే టోకెన్లు, గన్ని సంచులు అందజేసి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎఫ్‌సీఐ క్వింటాల్‌కు రూ.8000 చెల్లిస్తుండగా.. దళారులు మార్కె ట్ యార్డులోనే క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7500 వరకు చెల్లిస్తూ.. వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. రైతుల దృష్టిని ఆ వైపు మరల్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నారు. ఈ కారణంగా రైతులు క్వింటాల్‌కు రూ. 500 నుంచి 1000 వరకు నష్టపోతున్నారు. ఎప్పటికప్పడు కొనుగోళ్లు చేయాల్సిన అధికారులు ఆలస్యం చేస్తుండడం వ్యాపారుల వ్యూహంలో భాగమేనని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు చేయూలని రైతులు కోరుతున్నారు. నిన్న పొద్దున వచ్చినా.. అందుబాటులో మార్కెట్‌యార్డు లేకపోవడంతో ధర ఎక్కువగా లభిస్తుందని ఆదిలాబాద్ మార్కెట్‌కు కందులను తీసుకొని వచ్చిన. గన్ని సంచులు లేవని నిన్నటి నుంచి కొనలేదు. రెండు రోజులు ఇక్కడ ఉండడంతో మా ఇంటోళ్లు ఆందోళన చెందుతున్నారు. - పున్నం బజ్జన్న, గ్రామం : లక్సెట్టిపేట, మం : ఉట్నూర్ సంచులు లేవని ఆలస్యం.. కందుల కుప్పకాడికి ఎవరు వచ్చి అడిగినోల్లే లేరు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ అధికారి రాలేదు. ముందుగా దళారులయే కొంటున్నారు. రైతుల తె చ్చినవి సంచులు లేవని ఆలస్యం చేస్తున్నరు. రోజుల తరబడి ఉంచకుండా వెంటనే కొనుగోళ్లు చేయాలి - రామ్‌రెడ్డి, గ్రామం : కోడద్, మం : తాంసి తిండి లేకుండా యార్డులోనే.. పంట చేను వద్ద రాత్రనకా పగలనకా కష్టపడితే.. పంట అమ్ముకోవాలన్న మార్కెట్‌యార్డులో రోజుల కొద్దీ రాత్రీ, పగలు తేడా లేకుండా తిండి తిప్పలు లేకుండా ఉండాల్సి వస్తంది. ధర ఎక్కువగా వస్తుందని 60 కిలోమీటర్ల దూరం నుంచి కందులను తీసుకొచ్చిన. కొనకపోవడంతో ఇంటికి తీసుకెళ్లే కిరాయి ఎక్కువగా అవుతుందని యార్డులనే నిన్నటి నుంచి ఉంటున్న. వెంటనే కొనుగోలు చేయాలి. - గంగరాం, గ్రామం : అల్లిగూడ, మం : ఉట్నూర్