పడిగాపులు తప్పవా?  | problems for kandi farmers | Sakshi
Sakshi News home page

పడిగాపులు తప్పవా? 

Published Sat, Feb 10 2018 6:57 PM | Last Updated on Sat, Feb 10 2018 6:57 PM

problems for kandi farmers - Sakshi

అనంతగిరి(వికారాబాద్‌) : రైతులు ఏడాది పొడువునా పండించిన పంట విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా తమ వంతుకోసం పడిగాపులు పడుతున్నారు. వికారాబాద్‌లోని కందుల కొనుగోలు కేంద్రంలో కందులు అమ్ముకునేందుకు వచ్చి రెండు మూడు రో జులైనా ఇంకా తూకాలు వేయడంలేదు. ఉదయం 7 గంటలకు వచ్చి చిట్టీలు ఇస్తామన్న అధికారులు 10 దాటినా రాక పోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌లోని కొనుగోలు కేంద్రానికి వికారాబాద్, నవాబ్‌పేట, పూడూర్‌ మండలాలకు చెందిన రైతుల కందులు తీసుకొస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కందులు రావడంతో తెచ్చిన వాటిని ఇంటికి తిరిగి తీసుకుపోలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో వారు నెల రోజుల ముందే కందుల షాంపిల్‌ను తీసుకొచ్చి అధికారులకు చూయించారు. వారు అమ్మేందుకుగాను వారి పేర్లను రిజిస్టార్‌లో రాసుకుని 6వ తేదీ రావాలని ఇచ్చారని రైతులు తెలిపారు.

కాగా వారు భరోసాతో ట్రాక్టర్లలో, ఆటోలు తదితర వాహనాల్లో కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. తీరా అక్కడ అధికారులు లేదు. ఎవరైతే ముందు వచ్చారో వారివే తూకం చేస్తామనడంతో రైతులు చేసేదేమీ లేక ఎలాగోలా తాము తెచ్చిన కందులు విక్రయించాలనే ఉద్దేశంతో మళ్లీ తేదీలు మార్పించుకుని మరీ ఎదురుచూస్తున్నారు.  7వ తేదీన రిజిస్టార్‌లో నంబర్లు రాయించి అక్కడే ఉన్నారు. అలా రాయించిన వారు 8వ తేదీన తూకం జరిగాయి. అధికారులు రైతుల అవస్థలు చూసైనా మండలానికి ఒక కౌంటర్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండలానికి ఒకటి చొప్పున తూకం పెట్టినట్లయితే ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు.  

తాండూరు : కంది పండించడంలో తాండూరుకు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు కందుల బస్తాలతో మార్కెట్‌ కళకళలాడేది. కాని ఈ సారి మార్కెట్‌లో «మద్దతు ధర కరువైంది. దీంతో కేంద్ర ప్రభు త్వం మద్ధతు ధర అందించేందుకు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో డీసీఎంఎస్‌ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న మూడు కేంద్రాలు ఎత్తేయడంతో వారం రోజులుగా ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి తాండూరులోనే మద్దతు ధరకు కందుల కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు. 

ఇప్పటి వరకు 65వేల క్వింటాళ్ల కొనుగోలు 
ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన కంది దిగుబడులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలో 4 కేంద్రాలు నెల రోజుల కిందట ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు తాండూరు రైతు బజార్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంతో పాటు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్,బషీరాబాద్, లక్ష్మీణారాయణపూర్‌లలో ఏర్పాటు చేసిన మద్దతు ధర కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 65వేల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. దీంతో 35.42 కోట్ల వ్యాపారం జరిగింది. 

భారీగా పోటెత్తిన కందులు.. 
నియోజకవర్గంలో పెద్దేముల్, లక్ష్మినారాయణపూర్, బషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన కంది కొ నుగోలు కేంద్రాలను ఎత్తి వేశారు. దీంతో రై తులు, గ్రామాల నుంచి రైతులు భారీగా కం దులు తీసుకొన్నారు. మూడు రోజుల వ్యవధిలో నే ్ౖచరెతు బజార్‌ ప్రాంగణం, డీసీఎంఎస్‌ కార్యాలయ ప్రాంగణం, దాల్‌మిల్‌ గొదాం అన్ని చోట్ల కంది బస్తాల నిల్వలతో నిండిపోయింది. రై తులు గ్రామాల నుంచి కందులను తీసుకువస్తు న్న అధికారులు మాత్రం ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. గ్రామాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలు పూర్తిగా ఎత్తి వేశాకే తాండూరులో కొ నుగోళ్లను ప్రారంభించాలని డీసీఎంఎస్, మా ర్క్‌ఫెడ్‌ అధికారులు భావిస్తున్నారు. మరో రెం డు మూడు రోజుల్లో నిల్వ చేసుకునేందుకు వీలు లేకుండా రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అధికారులు నిల్వలు లేకుండా వెంట వెంటనే కందులను కొనుగోలు చేస్తే ఇబ్బందులు పోతాయని రైతులు అంటున్నారు. 

పేరు నమోదు చేసి నెలైంది 
గత నెల కిందట కందుల షాంపిల్‌ తెచ్చి చూయించాను. ఇక్కడ అధికారులు ఒక రిజిస్టర్‌లో పేర్లు రాసుకుని 6వ తేదీన రమ్మన్నారు. ఎలాగైన తూకం అవుతుంది కదా అని కందులు తీసుకుని 6న వచ్చాను. మరల చిట్టీ ఇచ్చి 8న తూకం చేశారు.      

– నర్సింహారెడ్డి, రైతు  

మండలానికి ఒక కాంటా పెట్టాలి 
రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు మండలానికి ఒక కాంటా పెట్టాలి. ఏ మండలం వారు ఆ కాంటవద్దకెళ్లి తూకాలు వేసుకోవాలి. రైతులు కందులు తీసుకొచ్చి 2–3 రోజులైనా తూకాలు చేయకపోవడంతో ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.   

– శ్రీనివాస్, రైతు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement