Kanipaka varasiddhi Vinayaka temple
-
కాణిపాకంలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు
-
కాణిపాక గణపయ్యను దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో సందడి.. తెల్లవారుజాము 3గంటల నుంచే అభిషేకాలు
-
వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం
యాదమరి(కాణిపాకం): దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కాణిపాక దేవస్థానం ఒకటి. సత్యప్రమాణాల దేవుడిగా కాణిపాక వినాయకుడికి పేరు. అలాంటి వరసిద్ధి వినాయకస్వామికి ఈనెల 31వ తేదీ (చవితి)నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. తొలి తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పదో రోజు నుంచి పన్నెండు రోజులపాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ చరిత్ర చిత్తూరు జిల్లాలో బాహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడైతే, మిగతా ఇద్దరు మూగ, చెవిటివారిగా పుట్టారు. కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు కమ్మేసింది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు. పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పారకమ్ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది. విగ్రహంలోనూ ఎదుగుదల బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహంలోనూ ఎదుగుదల ఉండడం విశేషం. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు. సత్యప్రమాణాల దేవుడిగా.. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్షపడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతోపాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. అసెంబ్లీలో నాయకులు సైతం ఆరోపణలు వచ్చిన సమయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాళ్లు విసురుకోవడం గమనార్హం. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఆలయంలో విద్యుత్ లైట్లు కటౌట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో ఆలయంలోని అలంకార మండపంలో దేవతా మూర్తులను అమర్చారు. ఆలయంలో అలంకార మండపంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల కటౌట్లు ఏర్పాటు చేయడానికి విద్యుత్ లైట్ల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. -
వైభవం..వరసిద్ధుని మహాకుంభాభిషేకం
సాక్షి చిత్తూరు: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా సాగింది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని విరాళదాతలు ఇచ్చిన రూ.10 కోట్లతో శిల్పకళా సౌందర్యంతో పునర్నిర్మించారు. ఇందులో భాగంగా ఆదివారం మహా కుంభాభిషేకం క్రతువును ఆగమ పండితులు వేదోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు చతుర్థకాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన నిర్వహించారు. 8 గంటలకు రాజగోపురం, పశ్చిమ ద్వార గోపురం, విమాన గోపురం, నూతన ధ్వజస్తంభానికి, 8.30 గంటలకు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులను స్వయంభు దర్శనానికి అనుమతించారు. సుమారు 5 నెలల తరువాత స్వయంభు దర్శనం తిరిగి ప్రారంభించడంతో భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పుష్పాలు, విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. తొలిరోజే సుమారు 20–30 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కుంభాభిషేకం క్రతువు సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వేలూరు శ్రీపురం స్వర్ణదేవాలయం వ్యవస్థాపకులు శక్తినారాయణి అమ్మవారు ఆవిష్కరించారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీ మిథున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఎంఎస్‌బాబు, ఆరణి శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్‌బాబు, విరాళ దాత కుటుంబ సభ్యులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
తెప్పపై వినాయకుడి విహారం
కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన తెప్పోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాల సమర్పణ జరిపారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని వేంచేపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య స్వామివారిని సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. జై గణేశ.. జై జై గణేశ నామస్మరణతో కాణిపాకం మారుమోగింది. తెప్పోత్సవానికి పుండరీకనాయుడు, శేషాద్రినాయుడు ఆయన సోదరులు, దామోదరనాయుడు, హనుమంతనాయుడు, రామకృష్ణారెడ్డి కుమారులు, కొత్తపల్లె దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, లంకిపల్లె మోహన్‌బాబు ఆయన సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ వెంకటనారాయణ, ఏసీ ఆదికేశవపిళ్లె, ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు. వినాయకుని మహాప్రసాదం వేలం వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఆదివారం రాత్రి బహిరంగ వేలం వేశారు. 21రోజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని మూలవిరాట్ వద్ద నైవేద్యంగా ఉంచి ఆస్థాన మండపంలో బహిరంగవేలం వేశారు. ఈ లడ్డూ ప్రసాదం కోసం భక్తులు పోటీ పడ్డారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి తెప్పోత్సవంతో విజయవంతంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు దేవస్థానం వారు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తదుపరి 11రోజులు ఉభయదారుల అధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారికి వాహనసేవలు నిర్వహించారు.