Kanmani
-
పెళ్లాలు ఉన్న ఇంట్లో దెయ్యాలా?
... ఉండనే ఉండవని తన భార్యతో చెబుతున్నారు పోసాని కృష్ణమురళి. ‘మేకప్ లేని ఆడదాన్ని, బిల్డప్ లేని మగాణ్ని ఈ సొసైటీ గుర్తించదు రాజా’ అంటూ పోసాని డైలాగ్‌తో ప్రారంభమయ్యే ‘దేశముదుర్స్’ ట్రైలర్ నవ్వులు పంచుతోంది. పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దేశ ముదుర్స్’. ‘ఇద్దరూ 420 గాళ్ళే’ అన్నది ఉప శీర్షిక. కన్మణి దర్శకత్వంలో పులిగుండ్ల సతీష్ కుమార్, వద్దినేని మాల్యాద్రి నాయుడు సమర్పణలో కుమార్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘ఏవండీ ఆ గదిలో దెయ్యం ఉందండీ’ అని భార్య రజిత భయపడుతుంటే.. ‘పెళ్లాలు ఉన్న ఇంట్లో దెయ్యాలు ఉండవే’ అంటున్నారు పోసాని. ‘రామ రామ.. మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అమ్మా’ అని రజిత చెబుతుంటే .. ‘మాదేమైనా సన్నీ లియోన్ ఫ్యామిలీయా’ అంటూ సెటైర్ వేస్తున్నారు పృథ్వీ. ‘‘ఈ నవ్వుల కహానీని చూడాలంటే ఈ నెల 22వరకూ ఓపిక పట్టాలి’’ అంటున్నారు దర్శక–నిర్మాతలు కన్మణి, కుమార్. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో రామానాయుడుగారిలా మహీందర్ కూడా పెద్ద నిర్మాత అవుతారు’’ అన్నారు. ‘‘దేశముదుర్స్’తో కన్మణి ఏంటో నిరూపించుకుంటారు’’ అన్నారు పృథ్వీ. సంగీత దర్శకుడు యాజమాన్య, డైలాగ్ రైటర్ భవాని ప్రసాద్ పాల్గొన్నారు. -
తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్
-
తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్
తమిళసినిమా(చెన్నై): ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తన తల్లి కన్మణికి ఆలయాన్ని నిర్మించారు. అంబత్తూర్ సమీపంలోని తిరుముల్ లైవాయిల్‌లో ఇంతకు ముందు శ్రీరాఘవేంద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన లారెన్స్ ఆ పక్కనే తల్లికి గుడి కట్టించారు. గాయత్రిదేవి విగ్రహాన్ని, శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు. మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం వెయ్యి మంది మహిళలకు చీరలు దానం చేశారు. తల్లి జీవించి ఉండగానే లారెన్స్ ఆమెకు ఆలయం నిర్మించడం విశేషం. -
‘ఓకే కన్మణి’ అంటున్న మణిరత్నం?
మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు. మౌనరాగం, ఇదయత్తైతిరుడాదే (తెలుగులో గీతాంజలి), రోజా, అలప్పాయిదే వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయి. తాజాగా అలాంటి అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ విని బల్క్ కాల్షీట్స్ను దుల్కర్ సల్మాన్ కేటాయించగా నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర కథను దర్శకుడు చెప్పగానే స్ఫెల్‌బౌండ్ అయిపోయానని నిత్యామీనన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో సెలైంట్‌గా జరుపుకుంటోం ది.