తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్‌ | Lawrence's temple for his mom! | Sakshi
Sakshi News home page

తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్‌

Published Mon, May 15 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్‌

తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్‌

తమిళసినిమా(చెన్నై): ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ తన తల్లి కన్మణికి ఆలయాన్ని నిర్మించారు. అంబత్తూర్‌ సమీపంలోని తిరుముల్‌ లైవాయిల్‌లో ఇంతకు ముందు శ్రీరాఘవేంద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన లారెన్స్‌ ఆ పక్కనే తల్లికి గుడి కట్టించారు.

గాయత్రిదేవి విగ్రహాన్ని, శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు. మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం వెయ్యి మంది మహిళలకు చీరలు దానం చేశారు. తల్లి జీవించి ఉండగానే లారెన్స్‌ ఆమెకు ఆలయం నిర్మించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement