Kannada superstar Sudeep
-
ఆ హీరో పయనమెటు.. అభిమానుల్లో ఉత్కంఠ!
నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారలు ఇటీవల కాలంలో రాజకీయాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నెలలో కర్ణాటకలో జరిగే శాసనసభ ఎన్నికల ప్రచారంలో సినీతారలు సందడి చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ శాండల్‌వుడ్ స్టార్ కిచ్చ సుదీప్ రాజకీయ అరంగ్రేటం చేస్తారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆయన నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. సాక్షి, బెంగళూరు: కన్నడ సినీనటుడు సుదీప్ అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరుతారా? లేక జేడీఎస్ తీర్థం పుచ్చుకుంటారా అనే అంశంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు తారలు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటారనే పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలతో సినీ తారలు చర్చలు జరుపుతున్నారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మూడురోజుల క్రితం సుదీప్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. తాజాగా గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటికి సుదీప్ వెళ్లి చర్యలు జరిపారు. కాగా గతంలో జేడీఎస్ ప్రచారానికి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎంతో సుదీప్ చర్చల అనంతరం అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సుదీప్ జేడీఎస్‌లో చేరుతారా లేక కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారా? అనే దానిపై గందరగోళం నెలకొంది. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుదీప్ రాజకీయ అరంగేట్రం చేస్తారనే వార్తలు చక్కార్లు కొట్టిన విషయం విదితమే. అంతేకాక 2011 ఉప ఎన్నికల్లో దావణగెరె నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. -
నటుడు సుదీప్తో లవ్వా?
నటి నిత్యామీనన్ కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ మధ్య ప్రేమాయణం సాగుతోందని శాండిల్‌వుడ్ చెవులు కొరుకుంటోంది. నటి నిత్యామీనన్ దక్షిణాది భాషల్లో మంచి క్రేజ్ ఉన్న నటి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం మొదలగు నాలుగు భాషల్లోనూ నటిస్తున్నారు. ఈ మలయాళీ బ్యూటీ ఇటీవల తమిళంలో నటించిన ఓ కాదల్ కణ్మణి, కాంచనా-2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. మరో సారి మణిరత్నం చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది కూడా. అయితే ఆ చిత్రం ఇతర కారణాల వల్ల డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం సుదీప్ తమిళం, తెలుగు భాషలలో ముడింజా ఇవనై పీడీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి నిర్మాత కూడా ఆయనే. కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్ర షూటింగ్‌లోనే సుదీప్, నిత్యామీనన్ పరిచయం స్నేహంగా మొదలై అది ప్రేమకు దారి తీసిందని చిత్ర వర్గాల టాక్. నాన్ ఈ చిత్రంలో విలన్‌గా నటించిన సుదీప్ కన్నడంలో సూపర్‌స్టార్ అన్నది గమనార్హం. కాగా ఆయనకు పెళ్లి అయ్యింది. అయితే మనస్పర్థల కారణంగా ఇటీవల భార్య ప్రియకు విడాకులిచ్చారు. ఇప్పుడు నిత్యామీనన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నారని కన్నడ చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది. -
కేఎస్ దర్శకత్వంలో సుదీప్
కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ హీరోగా నటించనున్న తమిళ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఈ చిత్రం ఇంతకుముందే ప్రారంభం కావలసింది. కేఎస్ రవికుమార్ ఈ చిత్ర కాల్షీట్స్ను రజనికాంత్ లింగ చిత్రానికివాడుకోవడంతో సుదీప్ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. లింగ చిత్రా న్ని వేగంగా పూర్తి చేయాలని భావించిన రజనీకాంత్ అందుకు సమర్థుడైన దర్శకుడు కేఎస్ రవికుమార్ అని భావించి ఆయనతో చర్చించి సుదీప్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా సుదీప్ తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో రజనీకాంత్ చిత్రం లింగ ప్రస్తుతం పూర్తి అయ్యింది. దీంతో సుదీప్, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. దీని గురించి సుదీప్ తెలుపుతూ రజనీకాంత్ అభిమానుల్లో తాను ఒకరినని ఆయన త్వరగా చిత్రం చేయాలని తాను ఆశిస్తున్నానన్నారు. అందువలనే రజనీకాంతే స్వయంగా ఫోన్ చేసి కేఎస్ రవికుమార్‌కు ఇచ్చిన కాల్షీట్స్ అడగడంతో మరుమాట లేకుండా ముందు అలాగే అన్నానని చెప్పారు. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తాను నటించనున్న చిత్రం గురించి ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అయితే ఇదో థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఏడాది క్రితమే రవికుమార్ ఈ కథతో తనను కలిశారని తానైతే ఈ కథలో హీరో పాత్రకు బాగుంటానని ఆయన భావించారన్నారు. నాన్ ఈ చిత్రంలో తమిళ ప్రేక్షకులకు కాస్త దగ్గరయ్యానని ఈ చిత్రంతో వారి ప్రేమాభిమానాన్ని మరింతగా పొందుతాననే నమ్మకం ఉందన్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వ నైపుణ్యం గురించి బాగా తెలుసని ఆయన దర్శకత్వంలో నటించడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని సుదీప్ పేర్కొన్నారు.