
నటుడు సుదీప్‌తో లవ్వా?
నటి నిత్యామీనన్ కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ మధ్య ప్రేమాయణం సాగుతోందని శాండిల్‌వుడ్ చెవులు కొరుకుంటోంది. నటి నిత్యామీనన్ దక్షిణాది భాషల్లో మంచి క్రేజ్ ఉన్న నటి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం మొదలగు నాలుగు భాషల్లోనూ నటిస్తున్నారు. ఈ మలయాళీ బ్యూటీ ఇటీవల తమిళంలో నటించిన ఓ కాదల్ కణ్మణి, కాంచనా-2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. మరో సారి మణిరత్నం చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది కూడా.
అయితే ఆ చిత్రం ఇతర కారణాల వల్ల డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం సుదీప్ తమిళం, తెలుగు భాషలలో ముడింజా ఇవనై పీడీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి నిర్మాత కూడా ఆయనే. కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్ర షూటింగ్‌లోనే సుదీప్, నిత్యామీనన్ పరిచయం స్నేహంగా మొదలై అది ప్రేమకు దారి తీసిందని చిత్ర వర్గాల టాక్.
నాన్ ఈ చిత్రంలో విలన్‌గా నటించిన సుదీప్ కన్నడంలో సూపర్‌స్టార్ అన్నది గమనార్హం. కాగా ఆయనకు పెళ్లి అయ్యింది. అయితే మనస్పర్థల కారణంగా ఇటీవల భార్య ప్రియకు విడాకులిచ్చారు. ఇప్పుడు నిత్యామీనన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నారని కన్నడ చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది.