చిట్‌ఫండ్ కార్యాలయంలో కరాటే కళ్యాణి హల్చల్
హైదరాబాద్ : సినీనటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఆమె ఈసారి నగరంలోని ఓ ప్రముఖ చిట్‌ఫండ్స్ కార్యాలయంలో హల్చల్ చేసింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ కరాటే కళ్యాణి శనివారం అబిడ్స్‌లోని చిట్‌ఫండ్స్ ఆఫీస్‌లో నిరసన చేపట్టింది.
తనకు రావాల్సిన 1.20వేల రూపాయలు చెల్లించాలని ఆమె కార్యాలయంలో ఆందోళనకు దిగింది. అయితే చిట్‌ఫండ్ కంపెనీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కరాటే కళ్యాణి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.