Kapu ministers
-
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా శేషగిరిరావు ప్రమాణస్వీకారం
-
ముద్రగడను మట్టుబెట్టాలని చూశారు
► కాపులకు వరాలు ఇచ్చి, ► వంచన చేసింది చంద్రబాబే.. ► సెప్టెంబర్ వరకూ వేచి ఉంటాం ► రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా అమలాపురం టౌన్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని ఆమరణ దీక్ష పేరుతో ముట్టుబెట్టాలని చూశారని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆరోపించారు. తుని ఘటనలో అరెస్టరుు, సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన.. ముద్రగడతో కలిసి కిర్లంపూడికి వెళ్లారు. బుధవారం రాత్రి అమలాపురంలోని తన సోదరుడు దివంగత కాపు నేత నల్లా చంద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయనకు కాపులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విష్ణుమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడను రాజమండ్రి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్బంధించి, అన్ని రోజులు ఆమరణ దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదంటే, ఆయన ఏమైపోయినా ఫర్వాలేదన్న ధోరణితోనే ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో కాపులకు వరాలు ఇచ్చింది చంద్రబాబే, వాటిని అమలు చేయకుండా వంచన చేసిందీ ఆయనేనని విమర్శించారు. చంద్రబాబు ఏ రోజూ ముద్రగడతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయలేదని, అలాగే ముద్రగడ ఆయనను కలిసేందుకూ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడించిన చంద్రబాబు ఈ సమస్యను మరింత జటిలం చేశారని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబుతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తే ముద్రగడ, తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆగస్టు వరకూ ఆగమంటూ ప్రభుత్వం గతం నుంచి చెబుతోందని, సెప్టెంబర్ వరకూ వేచి ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. చంద్రరావు కుమారులు అజయ్, సంజయ్, రాష్ట్ర కాపు నాయకులు నల్లా పవన్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, అరిగెల నాని తదితరులు పాల్గొన్నారు. -
కాపు మంత్రులతో చంద్రబాబు అత్యవసర భేటీ
విశాఖపట్నం: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం విశాఖపట్నంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు. ముద్రగడ చేత బలవంతంగా దీక్ష విరమింపజేస్తే రాజకీయంగా దెబ్బతింటామని టీడీపీ కాపు నేతలు చంద్రబాబు వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా ముద్రగడ వద్దకు చర్చలకు వెళితే ఓ మెట్టు దిగినట్టు అవుతుందని కాపు నేతలతో చంద్రబాబు అన్నారు. ముద్రగడ దీక్ష కొనసాగిస్తే కాపుల రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రత్యామ్నాయ మార్గాలపై టీడీపీ కాపు నేతలతో మంతనాలు జరిపారు. -
దయచేసి మమ్మల్ని నమ్మండి
ఎస్ఎంఎస్లతో మంత్రుల వేడుకోలు అమలాపురం: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల హామీని నెరవేర్చి కాపులను బీసీల్లో చేరుస్తాం. ఎన్నో ఏళ్లుగా తెగని సమస్యకు చిత్తశుద్ధితో పరిష్కారం చెబుతాం. మాకు కాపుల మద్దతు ఎప్పుడూ ఉంది. రిజర్వేషన్లు కల్పించి కాపుల రుణం తీర్చుకోవడమే మా విద్యుక్తధర్మం. విపక్ష నేత కుట్రలో భాగం కావద్దు. ఆలోచించండి’ అంటూ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కాపు మంత్రులు ఎస్ఎంఎస్లతో వేడుకుంటున్నారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు పేర్లతో శుక్రవారం ఉదయం నుంచి ఎస్ఎంఎస్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. మరోవైపు బీసీల సంక్షేమానికి పాటుపడతామని, కాపుల రిజర్వేషన్లతో బీసీలకు ఎటువంటి ఇబ్బందీ లేదని ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు వంటివారి పేరిట ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. రిజర్వేషన్లు ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది చెప్పకుండా ఈ ప్రచారం గోలేమిటని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి.