పార్టీ ఖాయం!
సాక్షి, చెన్నై : తలైవా కొత్త పార్టీ ఖాయం అని, అయితే, ఎన్నికల ముందుగా ఆ ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ నేత కరాటే త్యాగరాజన్ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ నేత చిదంబరం మద్దతుదారుడిగా ఉన్న కరాటే రజనీ కాంత్‌తో భేటీ కావడం చర్చకు దారితీసింది. అదే సమయంలో రజనీ రాజకీయ ప్రవేశంపై విమర్శలు వద్దు అని రాజకీయ పక్షాలకు ఆయన హితవు పలకడం గమనార్హం.రాజకీయ ప్రకటన చేసిన ఐదు నెలలు పూర్తి అయినా, ఇంతవరకు పార్టీ ఊసెత్తకుండా ఆధ్యాత్మిక, విదేశీ పర్యటనలు, సినిమా షూటింగ్‌ల్లో తలైవా రజనీకాంత్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడలా సంచలన వ్యాఖ్యలు చేసి వెళ్తున్నా, ఆయన పార్టీ రూపు రేఖలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం రజనీ కాంత్‌తో దక్షిణ చెన్నై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చిదంబరం మద్దతు నేతగా ముద్రపడ్డ కరాటే త్యా గరాజన్ భేటీ అయ్యారు. దీంతో రజనీ పార్టీలో ఆయన చేరుతారా..? అన్న ప్రచారం ఓ వైపు ఉంటే, మరోవైపు కాంగ్రెస్ వర్గాలతోనూ రజనీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని చాటుకునే ప్రయత్నాలు జరుగుతున్నా యా..? అన్న ప్రశ్న బయలు దేరింది. అయితే, భేటీలో రాజకీయాలూ ఉన్నాయని, తమ సంప్రదింపులు కొత్తేమీ కాదు అని కరాటే త్యాగరాజన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
సరికొత్తగా రావడం ఖాయం
ఉదయం పోయెస్ గార్డెన్లో గంటపాటు రజనీ కాంత్‌తో కరాటే త్యాగరాజన్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రజనీకాంత్‌ను తా నేమీ కొత్తగా సంప్రదించలేదన్నారు. పదేపదే ఆయ న్ను కలుస్తున్నానని, రాజకీయాలు చర్చించుకుంటా మని వివరించారు. ముఫ్పై సంవత్సరాలుగా తనకు రజనీకాంత్ తెలుసు అని వ్యాఖ్యానించారు. ఆయన 1996లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉండాలన్నారు. అయితే, ఆలస్యంగానైనా ఈ సమయంలో రావడం ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నారు. గతంలో చిదంబరం పుస్తకావిష్కరణ సమయంలో రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కరుణానిధి వంటి నాయకుడు ఆహ్వానించారన్నారు. దివంగత సీఎం జయలలిత సైతం రజనీకాంత్ సమర్థవంతంగా రాణించగలరని అంగీకరించారని వ్యాఖ్యానించారు.
తెలియనివారే విమర్శిస్తారు
రజనీకాంత్ గురించి, రాజకీయాల గురించి తెలియ ని వాళ్లంతా ఆయన్ను విమర్శిస్తారని కరాటే త్యాగరాజన్ అన్నారు. జయలలిత మరణం, శశికళ జైలు జీవితం అనంతరమే దినకరన్ లాంటి వాళ్లు రాజకీయాలు చేయడం మొదలెట్టారని ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి రాజకీయాలను నిశితంగా పరిశీ లిస్తున్న రజనీకాంత్ ఇక, మున్ముందు రాణిస్తారనే న మ్మకం ఉందన్నారు. సరికొత్త పార్టీతో ఆయన రావ డం ఖాయం అని, అయితే, అది ఎన్నికలకు ఆరు నెలలకు ముందే ప్రకటిస్తారన్నారు. అంతవరకు వేచి చూడాల్సిందేనని త్యాగరాజన్ వ్యాఖ్యానించారు.