karepalli mandal
-
మొన్న లక్ష, నిన్న రూ.70 వేలు ఇంటి ముందు పడేశారు!
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): మండలంలోని దుబ్బతండాలో ఇటీవల జరిగిన చోరీ కేసులో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటోంది. ఈ నెల 17న దుబ్బతండాకు చెందిన రైతు గుగులోతు లచ్చిరాం ఇంట్లో రూ.1.70 లక్షలు అపహరణకు గురయ్యాయి. 20వ తేదీన కారేపల్లి ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం వచ్చి విచారణ చేపట్టారు. దీంతో బెంబేలెత్తిన దొంగ 21వ తేదీన రూ.1 లక్ష నగదు బాధితుడు లచ్చిరాం ఇంటి ముందు పడేసి వెళ్లాడు. తాజాగా సోమవారం మిగిలిన మరో రూ.70 వేల నగదును లచ్చిరాం ఇంటి ముందు మరోసారి పడేసి వెళ్లాడు. దీంతో ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని స్థానికుల్లో జోరుగా చర్చసాగుతోంది. కారేపల్లి ఎస్ఐ సురేశ్ సోమవారం దుబ్బతండాకు వెళ్లి దొంగలు పడేసి వెళ్లిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మేం మేజర్లం, మాకు ప్రాణహాని ఉంది.. ప్లీజ్ రక్షించండి! -
ఖమ్మంలో కేరళ ఐజీపీ
కారేపల్లి: కేరళ రాష్ట్ర ఐజీపీ గుగులోతు లక్ష్మణ్‌నాయక్ శనివారం కారేపల్లి మండలంలోని భాగ్యనగర్‌తండా గ్రామాన్ని సందర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాంప్లాతండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్ మాట్లాడుతూ నేటి యువత బంజార సంస్కృతి సంప్రదాయాలను అవలంబిస్తూ పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్‌నాయక్‌ను ఘనంగా సన్మానించారు. -
కారు బోల్తా : ప్రయాణికులు క్షేమం
ఖమ్మం: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొమ్ముగూడెం వద్ద ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిపై బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఉన్న గేదెను తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులోని డ్రైవర్‌తోపాటు ప్రయాణికులు స్వల్పంగా గాయాపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.