
రూ.70 వేలను ఇంటి ముందు పడేసిన దృశ్యం
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): మండలంలోని దుబ్బతండాలో ఇటీవల జరిగిన చోరీ కేసులో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటోంది. ఈ నెల 17న దుబ్బతండాకు చెందిన రైతు గుగులోతు లచ్చిరాం ఇంట్లో రూ.1.70 లక్షలు అపహరణకు గురయ్యాయి. 20వ తేదీన కారేపల్లి ఎస్‌ఐ సురేశ్ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం వచ్చి విచారణ చేపట్టారు.
దీంతో బెంబేలెత్తిన దొంగ 21వ తేదీన రూ.1 లక్ష నగదు బాధితుడు లచ్చిరాం ఇంటి ముందు పడేసి వెళ్లాడు. తాజాగా సోమవారం మిగిలిన మరో రూ.70 వేల నగదును లచ్చిరాం ఇంటి ముందు మరోసారి పడేసి వెళ్లాడు. దీంతో ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని స్థానికుల్లో జోరుగా చర్చసాగుతోంది. కారేపల్లి ఎస్‌ఐ సురేశ్ సోమవారం దుబ్బతండాకు వెళ్లి దొంగలు పడేసి వెళ్లిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: మేం మేజర్లం, మాకు ప్రాణహాని ఉంది.. ప్లీజ్ రక్షించండి!
Comments
Please login to add a commentAdd a comment