karhi
-
అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ
‘‘ఖైదీ’ సినిమాని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. ఇంతకు ముందు నన్ను ‘ఆవారా’ కార్తీ అనేవారు.. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా ‘ఖైదీ’ కార్తీ అని పిలుస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు కార్తీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ ఈ నెల 25న విడుదల చేశారు. బుధవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తమిళనాడు, కేరళలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘ఖైదీ’లో ఢిల్లీ (కార్తీ పాత్ర పేరు)లాంటి పాత్ర నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ రాసిన, తీసిన విధానం అద్భుతం. నాకు ఒక బామ్మ ఫోన్ చేసి, మంచి సినిమా, గొప్ప సినిమా చేశావని ప్రశంసించారు.. అదే నిజమైన సక్సెస్. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చిన ఎస్.ఆర్. ప్రభుకు థ్యాంక్స్. ‘ఖైదీ’ టైటిల్ పెడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అయ్యింది. రవితేజగారు ఫోన్ చేసి, ‘ఇటువంటి సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ‘ఖైదీ 2’ కూడా ఉంటుంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఈ దీపావళికి ‘ఖైదీ’ వెలుగులు నింపింది. మా సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించింది’’ అన్నారు. ‘‘ఖైదీ’కి భారీ సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎస్.ఆర్. ప్రభు. -
నల్ల హీరోలు!
ఇప్పుడు తమిళ సినిమా అభిమానులంతా సూర్యను ‘నల్లహీరో’ అనే పిలుస్తున్నారు. అదేంటీ సూర్య మంచి కలర్‌తో హ్యాండ్సమ్గా ఉంటాడు కదా. మరి నల్ల హీరో అని పిలవటం ఏంటీ? అని ఆశ్చర్యపోకండి. తమిళంలో ‘నల్ల’ అంటే మంచి అని. ఇలా పిలుచుకోవటానికి కారణం ఏంటంటే.. తమిళనాడులో థియేటర్స్ బంద్ కారణంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజినెస్ అనేదే జరగడం లేదు. వీటికి తోడు బడ్టెట్ అదుపు దాటడం, ఏదైనా స్ట్రైక్‌తో షూటింగ్ రద్దు కావడం, యూనిట్లో ఎవరితోనైనా మనస్పర్థలు ఏర్పడటం, ఇన్నీ చేసి రిలీజ్ టైమ్‌కి థియేటర్స్ దక్కించుకునే విషయంలో టెన్షన్.... ఇలా నిర్మాతలు బోలెడన్ని సమస్యలతో సతమతమౌతున్నారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చింది. అందుకే నిర్మాతలకు కొంచెం భారం తగ్గించే విధంగా ఓ నిర్ణయం తీసుకున్నారు సూర్య. జనరల్‌గా హీరో, హీరోయిన్ పర్సనల్ స్టాఫ్ శాలరీ కూడా నిర్మాతలే భరిస్తారు. ఇప్పుడు తన స్టాఫ్ అందరికీ తన సొంత డబ్బులనే చెల్లించదలిచారు హీరో సూర్య. ఈ విషయంపై సూర్య 2డీ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ మాట్లాడుతూ–‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఉద్యమం, నిర్మాతల కష్టాలను గమనించి బాధ్యతగల సీనియర్ నటుడిగా, షూటింగ్ సమయాల్లో తనతో ఉండే స్టాఫ్ జీతాలను తానే స్వయంగా చెల్లించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు సూర్య. ఈ ఖర్చు సుమారు 30–40 లక్షల మధ్య ఉంటుంది. షూటింగ్ డేస్‌ని బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు కూడా’’ అని పేర్కొన్నారు. నిర్మాతల కష్టాల గురించి ఆలోచించి, ఇలా వాళ్ల భారం తగ్గిస్తున్నారంటే సూర్య నిజంగా రొంబ (చాలా) నల్ల హీరోనే కదా. విశేషం ఏంటంటే.. సూర్య బాటను ఆయన తమ్ముడు, హీరో కార్తీ కూడా ఫాలో కానున్నారు. హీరో విశాల్ కూడా ఈ లిస్ట్‌లో జాయిన్ అయ్యారు. కోట్లు తీసుకునే హీరోలు ఇలా తమ స్టాఫ్‌కు జీతాలను పే చేస్తే నిర్మాతకు కొంచెం భారం తగ్గుతుంది. ఇది ఇండస్ట్రీకు శుభపరిణామమే. -
స్కూల్లో బన్నీ నా జూనియర్
సోమాజిగూడ: ప్రముఖ నటుడు కార్తీ బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో శుక్రవారం సందడి చేశారు. ప్రముఖ కాఫీ బ్రాండ్ ‘బ్రూ రోస్ట్ అండ్ గ్రౌండ్’ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించారు. తనకు అత్యంత ప్రియమైన బ్రూ కాఫీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నటుడు నాగార్జున సోదరుడిలాంటి వాడన్నారు. తనూ తమన్నా, కాజల్ మంచి ఫ్రెండ్స్, అందరం దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. 'సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్(బన్నీ) నాకు మంచి మిత్రుడు. అయితే నేను చదువుకున్న స్కూల్లోనే బన్నీ చదివాడు. బన్నీ నా జూనియర్ అని తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను' అని కార్తీ అన్నారు. తమ సొంత బ్యానర్లో బన్నీతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబంతో కలిసి నటించే ఉద్దేశం అయితే లేదు కానీ, అన్నయ్య సూర్యతో మాత్రం కలిసి నటిస్తానని తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.