karnataka budget
-
నటుడు ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, యశవంతపుర : రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావిస్తున్న ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు, నటుడు ఉపేంద్ర రాష్ట్ర బడ్జెట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యుత్, పెట్రోల్ వంటి వాటిపై పన్నులు వేసి సీఎం కుమారస్వామి ప్రభుత్వం పేదలపై నేరుగా భారం మోపిందని విమర్శించారు. కొత్త బడ్జెట్‌తో సామాన్యులకు ప్రభుత్వం పంగనామాలు పెట్టిందంటూ కామెంట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు చేశారు. 20 శాతం బుద్ధిఉన్న మూర్కులు మాత్రమే బడ్జెట్‌పై మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి సమస్యలపై నోరు విప్పడం లేదని అభిప్రాయపడ్డారు. ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ అనేది రాజకీయ పార్టీనే. మార్పును కోరుకునే ఎవరైనా ఇందులో చేరవచ్చు. ప్రజాకీయ పార్టీ కోసం విలువైన సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తానని’ ఉపేంద్ర ట్వీట్ చేశారు. ఆయన చేసిన మరిన్ని ట్వీట్లు వైరల్‌గా మారాయి. ఓవైపు రాజకీయ అరంగేట్రం అంటూనే మరోవైపు ఉపేంద్ర మళ్లీ సినిమాల్లో తలమునకలయ్యారు. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలని, డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలని ఉపేంద్ర ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాని వ్యక్తులు ఇలా అవగాహనా లేని ఆరోపణలు, విమర్శలు చేస్తారని కూటమి నేతలు అంటున్నారు. ఉపేంద్ర వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అధికార నేతలు సూచిస్తున్నారు. Please don’t think that UPP UTTAMA PRAJAAKEEYA PARTY is one more political party. This is your platform. Anybody wants to bring complete change use this. Give your valuable suggestions for PRAJAAKEEYA. — Upendra (@nimmaupendra) 6 July 2018 -
చితి పేర్చుకుని.. రైతన్న సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు రుణమాఫీ అంశం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చెలువేగౌడ(68) అనే రైతు సజీవ దహనం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకా నాటనహళ్లిలో ఈ ఘటన జరిగింది. చెలువేగౌడకు గ్రామంలో సుమారు మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో పంటల సాగు కోసం బ్యాంకులో రూ. 1 లక్ష వరకు అప్పు చేశాడు. కరువు వల్ల నీరు లేక పంటలు పండకపోవడంతో నష్టాలకు తోడు రుణభారం పెరిగింది. ప్రస్తుతం నెలకొన్న కరువు నేపథ్యంలో బుధవారం సీఎం ప్రకటించే బడ్జెట్లో రైతుల రుణాలను మాఫీ చేస్తుందని చెలువేగౌడ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి రుణమాఫీ చేయలేకపోతున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం గమనార్హం. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చెలువేగౌడ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న చెత్తను చితిగా మార్చి.. నిప్పు పెట్టి ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత రైతు భార్య పార్వతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
మద్యంపై వ్యాట్ ఎత్తివేత!
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలావరకు మద్యం ఉత్పత్తుల మీద వ్యాట్ ఎత్తేసింది. వైన్, బీర్, హార్డ్ లిక్కర్ మీద ఈ పన్నును తీసేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక శాఖను కూడా తనవద్దే ఉంచుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులోనే ఆయన ఈ చర్యల గురించి చెప్పారు. మద్యం మీద విలువ ఆధారిత పన్ను ఎత్తేయడంతో పాటు తమిళనాడులోని 'అమ్మ క్యాంటీన్ల' తరహాలో 'నమ్మ క్యాంటీన్లు' ఏర్పాటు చేయనున్నట్లు కూడా సిద్దరామయ్య చెప్పారు. వీటిలో పేదలకు ఉదయం అల్పాహారం 5 రూపాయలకు, మధ్యాహ్న భోజనాన్ని 10 రూపాయలకు అందించనున్నారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ. 5080 కోట్లు కేటాయించారు. అన్నభాగ్య పథకం కింద రాష్ట్రంలో పేద కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న 5 కిలోల బియ్యం కోటాను 7 కిలోలకు పెంచారు. బడ్జెట్లో మొత్తం ఖర్చును రూ. 1.86 లక్షల కోట్లుగా అంచనా వేశారు.