karobar
-
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
సాక్షి, మంగపేట: మండలంలోని రాజుపేట పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని కారోబార్ ఫోర్జరీ చేసి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. రాజుపేట పంచాయతీ సెక్రటరీ మానస 2020 జూలై 4 నుంచి 15 రోజుల పాటు సెలవులో ఉండగా కారోబార్ గడ్డిపాటి మహేష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రాజుపేట పంచాయతీ పరిధిలోని ముప్పనేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జులై 29న మృతి చెందినట్లు ధ్రువీకరిస్తూ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశాడు. తన విధులను తప్పుదోవ పట్టించిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదే కారోబార్ గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న ఖాళీ స్థలానికి ఇంటి యజమానిగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గ్రామంలో ఖాళీ స్థలాల్లో ఇల్లు ఉన్నట్లుగా తప్పుడు ఇంటి నంబర్లు ఇచ్చి దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరించాడనే అభియోగాలు ఉన్నాయి. దీంతో కోర్టు వివాదంలో ఉన్న ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు ఉన్నట్లుగా ఇంటి యజమాని పత్రాలు జారీ చేసి దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్న కారోబార్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా పంచాయతీ అధికారులు సైతం కారోబార్ నుంచి రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విషయంపై ఎంపీఓ శ్రీకాంత్ నాయుడిని వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వాస్తమేనన్నారు. ఆయనపై ఖాళీ స్థలాలకు ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన విషయంపై ఫిర్యాదు కూడా అందిందన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
బోథ్ ఎమ్మెల్యే తిట్లపురాణం
సాక్షి, ఆదిలాబాద్: తన కారు వెళ్లే దారిలోనే ట్రాక్టర్ అడ్డుపెడుతారా? అంటూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మావల మండలం బట్టిసావర్గాం గ్రామ పంచాయతీ కారోబార్‌పై తిట్ల పురాణం అందుకున్నారు. శనివారం ఆదిలాబాద్ నుంచి పొన్నారి శివారులోని తన వ్యవసాయ క్షేత్రానికి కారులో ఎమ్మెల్యే బయలుదేరారు. కాగా బట్టిసావర్గాం గ్రామంలో డీజిల్ అయిపోయిందని రోడ్డుపైనే పంచాయతీ ట్రాక్టర్‌ను నిలిపివేశారు. దీంతో తన కారుకే అడ్డుగా ట్రాక్టర్‌ను నిలుపుతారా..? అంటూ గ్రామ కారోబార్‌పై మండిపడ్డారు. ట్రాక్టర్ నిలపడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కారోబార్ సమాధానం ఇచ్చినా శాంతించని ఎమ్మెల్యే ఉద్యోగంలో ఎలా కొనసాగుతావో, ఆదిలాబాద్‌కు ఎలా వస్తోవో చూస్తానని కారోబార్‌ను హెచ్చరించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
పక్కా భవనాల నిర్మాణమెప్పుడో..?
కొడిమ్యాల: 500 జనాభా ఉన్న గ్రామాలు, గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇక తమ సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కరించుకోవచ్చని నూతన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సంతోషించారు. ఐతే వారి ఆశలు నిజం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. నూతన పంచాయతీలు 21 కొడిమ్యాల మండలంలో హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, దమ్మయ్యపేట, చింతలపల్లి, గంగారాంతండా, అప్పారావుపేట, కొండాపూర్, తుర్కకాశీనగర్ గ్రామాలు, గంగాధర మండలంలో చిన్న ఆకంపెల్లి, ఇస్లాంపూర్, మంగపేట, చెర్లపల్లి, లింగంపల్లి, నర్సింహులపల్లి, మధురానగర్, ముప్పిడిపల్లి, వెంకంపల్లి, మల్యాల మండలంలో గొర్రెగుండం, గుడిపేట గ్రామాలు, రామడుగు మండలంలో పందికుంటపల్లి, చొప్పదండి మండలంలో సాంబయ్యపల్లి గ్రామం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అద్దె భవనాల్లోనే పాలన పాలనాధికారాల వికేంద్రీకరణతో అభివృద్ధి వేగవంతం కానుందని ఆనందపడ్డారు. ఐతే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పరిపాలనా నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు గ్రామాల్లో కుల సంఘ భవనాలు, పాఠశాలల్లోని అదనపు గదులు, నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ భవనాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటున్నారు. అధిక గ్రామాల్లో అద్దె భవనాలనే పంచాయతీలకు పరిపాలనా భవనాలుగా ఉపయోగిస్తున్నారు. కొత్త జీపీల నిర్వహణకు నిధుల లేమి కారణంగా అద్దె భవనాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి. కానరాని కారోబార్లు.. కార్మికులు నూతన గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు కారోబార్లు, పారిశుధ్య కార్మికులు, వాటర్ పంప్మెన్లు, ఎలక్ట్రీషియన్లను నియమించలేదు. నిధులు లేకపోవడంతో తాత్కాలికంగా పని చేసేవారిని నియమించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా పంచాయతీల్లోని ప్రజలు అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికులు లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు వారి డబ్బులతోనే పనులు చేపడుతున్నారు. నిధులు మంజూరయ్యే దాకా కొత్త పాలకవర్గాలు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కార్యదర్శుల నియామకంలో ఆలస్యం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా.. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పుతోంది. ప్రస్తుతమున్న కార్యదర్శులను నాలుగు నుంచి ఐదు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. దీంతో ఏ ఒక్క గ్రామానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వారంలో రెండు రోజుల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. ప్రజలు వివిధ రకాల ధ్రువపత్రాలు పొందడంలో ఆలస్యమవుతోంది. పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కోర్టు సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని, కార్యదర్శుల నియామకాలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్‌కు వినతి నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ కొడిమ్యాల మండలంలోని 21 గ్రామాల సర్పంచ్‌లు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు వారు విన్నవించారు. జేబులో నుంచే.. ఇప్పటివరకు మా తండాకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తండాలో పారిశుధ్యం, రోజూవారీ ఇతర పనుల నిర్వహణకు ప్రస్తుతానికి జేబులో నుంచే ఖర్చు చేస్తున్నా. – భూక్యా భోజ్యనాయక్, సర్పంచ్, గంగారాంతండా నిధులు మంజూరు చేయాలి కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ముందుగా గ్రామ పంచాయతీ భవనాలకు నిధులందించాలి. తర్వాత ఇతర పనులపై దృష్టి సారించాలి. నిధులు లేక ఏ పని చేపట్టలేకపోతున్నాం. – గరిగంటి మల్లేశం, సర్పంచ్, అప్పారావుపేట -
రాజకీయాలవైపు తొంగిచూడని వ్యక్తి శేషగిరిరావు
చిన్నపెండ్యాల(స్టేషన్‌ఘన్‌పూర్) : మొదటి నుంచి రాజకీయాల వైపు తొంగి చూడకుండా ప్రజాసేవ కోసమే తపనపడిన వ్యక్తి శేషగిరిరా వు అని విరసం నేత వరవరరావు అన్నారు. చిన్నపెండ్యాలలో స్వాతంత్య్ర సమరయోధు డు పెండ్యాల శేషగిరిరావు సంస్మరణ సభ సా హితీసుధ ఘన్పూర్స్టేషన్ అధ్యక్షుడు పార్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి బస్వరాజు సార య్య, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్క ర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వరవరరా వు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై ఎన్నో మాట్లాడాని ఉందని, అయితే తనపై నిర్బంధాన్ని విధించడంతో మాట్లాడలేక పోతున్నానన్నారు. తన అన్న శేషగిరిరావు మొదట టీచర్‌గా, కారోబార్, పోస్టుమన్‌గా గ్రామానికి ఎన్నో సేవలు అందించారని అన్నా రు. తమ కుటుంబం మొదటి నుంచి ప్రజాసే వ కోసమే పరితపించిందని, అందులో మొట్టమొదట ఎంపీగా ఎన్నికైన పెద్ద రాఘవరావుతోపాటు తమ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు ఆస్తులు సంపాదించుకోలేదన్నారు. సీనియర్ జర్నలిస్టు నేరుట్ల వేణుగోపాలరావు మాట్లాడు తూ తమకున్న ఆస్తులను ప్రజలకు ఉపయోగపడేలా చేసేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రీ య విద్యాలయ లెక్చరర్ పెండ్యాల హరి మా ట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన ఇంటిస్థలాన్ని గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు పెండ్యాల కొండల్రావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో కుటుంబాలకు కుటుంబాలే పాలుపంచుకున్నాయన్నారు. అందులో పెండ్యాల రామానుజరావు కుటుంబం ఒకటని, రామానుజరావు సోదరుడు శేషగిరిరావు ఉద్యమంలో కీలక భాగస్వామి అని ఆయన గుర్తు చేశారు. ‘అలనాటి జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ ‘అలనాటి జ్ఞాపకాలు’ పుస్తకాన్ని శేషగిరిరావు భార్య సుగుణ, పెండ్యాల దామోదర్‌రావు భార్య సరస్వతి, పెండ్యాల వరవరరావు, రాంచందర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం టీఎమ్మార్పీఎస్ నాయకులు వరవరరావును కలిశారు. సమావేశంలో భాష్యం వరదాచారి, రాజారపు ప్రతాప్, రాంచందర్‌రావు, ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, సర్పంచ్ సమ్మయ్య, రామస్వామి, ఎంపీటీసీ సభ్యుడు సంపత్‌కుమార్, ఎల్ఐసీ బుచ్చయ్య, పేరాల రాజమౌళి, పెండ్యాల ఉపేందర్‌రావు, టి.వెంకటయ్య, ఉప సర్పంచ్ గుంపుల రవీందర్‌రెడ్డి, తాళ్లపెల్లి రాజ్‌కుమార్‌గౌడ్, రవిగౌడ్, బాబుగౌడ్, ఈఎన్.స్వామి పాల్గొన్నారు.