kartheeka maasam
-
కార్తీక మాసం చివరి సోమవారం..
-
తూర్పుగోదావరి జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
-
దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): చాలాకాలం తరువాత చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు లొట్టలేసుకుంటున్నారు. ఒక సమయంలో దాదాపు మూడొందల వరకు వెళ్లిన కిలో చికెన్ రేటు ఇప్పుడు సగానికి పడిపోయింది. నాన్‌వెజ్ ఐటమ్స్‌లో మటన్, ఫిష్‌తో పోలిస్తే చికెన్ రేటు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం చికెన్‌కు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు, కార్తీక మాసం కావడంతో ఇటీవల చికెన్ రేటు 170 (స్కిన్), 180 (స్కిన్లెస్)కి పడిపోయింది. తాటిచెట్లపాలెంలో మాత్రం ఈ ధర 160/ 170గా ఉంది. కార్తీకమాసం కారణంగా సుమారు 40 శాతం అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా బ్రాయిలర్ కోడి పెరగగానే చికెన్ సెంటర్లకు తరలించి అమ్మకాలు చేపడుతుంటారు. అంతకుమించి పెరిగిన కోడిని ఉంచడం వల్ల వాటికి అదనపు మేత అవసరమై, కోళ్ల రైతులకు నష్టాలు వస్తాయి. ప్రస్తుతం ఇలా అందుబాటులోకి వచ్చిన కోళ్లు కూడా అధికంగా ఉండడంతో చికెన్ రేటు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. చదవండి: (థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్) -
భీమవరం పంచారామక్షేత్రంలో కార్తీకమాసం సందడి
-
విహారంలో ఘోర విషాదం
-
విహారంలో ఘోర విషాదం
గంగావతి: సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్ (15)లుగా గుర్తించారు. గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు... ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా గంగావతి నగరంలో వారి సమీప బంధువులైన మాజీ కౌన్సిలర్ సీ.మోహన్‌రావు నివాసానికి వస్తుంటారు. మృతులందరూ మోహన్‌రావు సోదరుడు, సోదరిల పిల్లలు. ఏటా కార్తీకంలో కుటుంబ సభ్యులతో కలసి హేమగుడ్డ దుర్గమ్మ దేవస్థానానికి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం బంధువులు ఇంట్లో వంటలు చేసేపనిలో నిమగ్నమై ఉండగా, వారికి చెప్పకుండా చెరువుకు స్నానా నికని వెళ్లారు. నీటిలో ఆడుకుంటుండగా లోతైన ప్రాంతంలో మునిగిపోయారు. మధ్యాహ్నమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో బంధువులు చెరువు వద్దకు వెళ్లి వెతగ్గా మృతదేహాలు కనిపించాయి. బాధితుల బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీరని విషాదం కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు బాలలతో పాటు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి కార్తీక ఉత్సవాల కోసం బంధువుల ఇంటికి వచ్చి జలసమాధి అయ్యారు. ఒడిలో మృతదేహాలతో విలపిస్తున్న మహిళ. -
ఉపవాసం అంటే ఆకలి బాధ తెలుసుకోవడం..!
హరిహరప్రీతికరమైన కార్తికమాసంలో ఉన్నాం మనం. ఈ మాసంలోని రోజులన్నీ పర్వదినాలే. అయితే కార్తీకంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటిస్తే సిరిసంపదలు, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. ఇక్కడ ఉపవాసం అంటే కేవలం కడుపు మాడ్చుకోవడమే కాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు, పాపపు ఆలోచనలు చేయరాదు, దైవదూషణ తగదు. అశ్లీల సంభాషణలలో పాలు పంచుకోరాదు. ఇతరులను ముఖ్యంగా గురువులు, పెద్దలు, పండితులను గేలి చేయరాదు. పరనింద పనికి రాదు. ఆకలి వేస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని సూర్యాస్తమయం కోసం ఎదురు చూడటం కంటే హాయిగా భోజనం చేసి, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ప్రయోజనకరం. ఉపవాసం ఉండలేని వారు, ఉండలేకపోయానే అని బాధపడుతూ కూర్చునేకంటే, మనసులోకి చెడు ఆలోచనలు, ఇతరులకు కీడు తలపెట్టే తలంపులు రానివ్వకుండా చూసుకోవడం ఇంకా మంచిది. మనం ఉపవాసం ఉన్నామంటే, ఇతరుల ఆకలి బాధ తెలుసుకోవడం కోసమే. మన భోజనానికి అయ్యే ఖర్చుతో పేదవాడికి కడుపు నింపడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించడం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి. -
‘కార్తీకం... దేదీప్యం
కార్తీక దీపాలు.. సామూహిక వ్రతాలు.. భగవన్నామస్మరణలతో మెతుకుసీమ ఆధ్యాత్మిక సీమగా శోభిల్లింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాలోని ప్రధాన ఆలయాలైన ఏడుపాయల, నాచగిరి, కేతకీ తదితర ఆలయాలకు తెల్లవారుజామునుంచే భక్తుల తాకిడి మొదలైంది. రాత్రి వేళ కార్తీక దీపోత్సవం.. నేత్ర పర్వమైంది. వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో తన్మయత్వం పొందారు.