karthika bramhostavalu
-
తిరుమల : నవంబర్ 11నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల : ప్రపంచమానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం, గీతాపారాయణం కార్యక్రమాలకు భక్తుల ప్రశంసలు అందుతున్నాయని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు..ఇవాళ ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు.ఈ కార్యక్రమంలో 30 మంది భక్తులకు సలహాలు,సూచనలు ఈవో తీసుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించామని, అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన సమారాధన,కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.. భక్తుల రద్దీని బట్టి వారపు రోజుల్లో 7 వేల టోకెన్లు, వారాంతంలో మరిన్ని అదనపు టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్ల వద్ద భక్తులు విధిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వెంట తెచ్చుకోవడం లాంటి కోవిడ్-19 నిబంధనలను పాటించాలని ఈవో విజ్ఞప్తి చేశారు..తిరుమలలో నవంబరు 14న దీపావళి ఆస్థానం, నవంబరు 18న నాగుల చవిత,నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. -
సూర్య చంద్రప్రభలపై అలమేలు మంగమ్మ
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లోభాగంగా మంగళవారం ఉదయం పద్మావతీ అమ్మవారు పాండురంగడు అలంకరణలో సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. రాత్రి చిన్నికృష్ణుడి అవతారంలో చంద్రప్రభపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి నామస్మరణలు.. కళాబృందాల భజనల మధ్య వాహన సేవలు వైభవంగా సాగాయి. పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవరోజైన మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై పాండురంగడి అలంకరణలో చల్లనితల్లి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 7 గంటలకు అమ్మవారిని ఆలయం నుంచి వాహనమండపానికి వేంచేపుగా తీసుకొచ్చి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్యాభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఉదయం 8 గంటలకు భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 8 గంటలకు అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వాహన సేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్నం, పంచాయతీ ఈవో ఎం.జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి గొడుగుల సమర్పణ తిరుచానూరు : పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనసేవల్లో వినియోగించే గొడుగులను మంగళవారం ఆలయ అధికారులకు అందజేశారు. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్.గోపాల్జీ నేతృత్వంలో 7 గొడుగులను వాహనమండపం వద్ద ఆలయ సూపరింటెండెంట్ శేషాద్రిగిరి, వాహన ఇన్స్పెక్టర్ నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్జీ మాట్లాడుతూ మూడేళ్లుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులను అందజేస్తున్నామన్నారు. అనంతరం వీరికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు.