karumuri nageshwarrao
-
సీఎం జగన్ హయాంలో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయి: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
-
ధాన్యం కొనుగోలుపై అసత్య వార్త రాసి.. అడ్డంగా దొరికిపోయి..
-
‘ఏపీలో ధాన్యం సేకరణ బ్రహ్మాండంగా జరుగుతోంది’
ఢిల్లీ: కేంద్ర ప్రజా పంపిణీ శాఖ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 1702 కోట్ల బకాయిలు వచ్చే వారంలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని ఏపీ పౌరసరఫరాల శాఖామంతత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఏపీలో ధాన్యం సేకరణ బ్రహ్మండంగా జరుగుతుందని, ఇప్పటికే 13 లక్షల 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన విషయాన్ని మంత్రి కారుమూరి తెలిపారు. అదే సమయంలో ధాన్యం సేకరణలో భాగంగా రూ. 750 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఏపీ ప్రజా పంపిణీ శాఖలో డిజిటలైజేషన్‌పై కేంద్రం అభినందించిందన్నారు. -
ఏపీకి ఇవ్వాల్సిన రూ.1702 కోట్లు చెల్లించండి
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ చెల్లించాల్సిన 1702 కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. 2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2017-18 వరకు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ 1702.90 కోట్లు రూపాయలు బకాయి ఉందని మంత్రి వివరించారు. ఢిల్లీలో గురువారం నాడు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ఏ కరువు పెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఆరేళ్లుగా పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అలాగే 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బకాయి పడిన 963.07 కోట్లను కూడా ఇప్పించాలని మంత్రి కారు మూరి కోరారు. వీటికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను పలుమార్లు కేంద్రానికి సమర్పించామన్నారు. గోనె సంచుల విషయంలో కూడా వరి ధాన్యానికి వినియోగించే గన్నీ బ్యాగులకు నగదును కేంద్రం చెల్లించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ డిప్యూటీ సెక్రటరీని అయన కోరారు. హమాలీలకు చెల్లించాల్సిన మండి లేబర్ ఛార్జీలు కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉందన్నారు. క్వింటాలుకు 22 రూపాయల వంతున కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 2024-25 ఆర్ధిక సంవత్సరం వరకూ మండి లేబర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని మంత్రి కారుమూరి వివరించారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి కారుమూరితో పాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సంస్థ ఎండీ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. -
దోచుకో.. దాచుకో.. పంచుకో.. ఇదే చంద్రబాబు విధానం : మంత్రి కారుమూరి
-
సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారంటే.. నెరవేరుస్తారు : మంత్రి కారుమూరి
-
చంద్రబాబు పై కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్
-
వికేంద్రీకరణకు మద్దతుగా కారుమూరి ప్రత్యేక పూజలు
-
‘రేషన్ షాపుల మూసివేతపై కొన్ని పత్రికలు అపోహలు సృష్టిస్తున్నాయి’
తాడేపల్లి: కరోనా సమయంలో రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 9 వెనుకబడ్డ జిల్లాలు, ఎస్సీ, ఎస్టీలు అందరికి ఇస్తామని, ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపులను మూసేస్తామని వస్తున్న వాదనలు పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు తొలగించలేదన్నారు. కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు. కోటీ 50 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం: మంత్రి బొత్స రాష్ట్రంలో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామని, కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు మంత్రి. 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందన్నారు. తాము కోటి 50 లక్షల మందికి అదనంగా అందించామని తెలిపారు. ‘ప్రస్తుతం కరోనా తగ్గింది కాబట్టి 3 నెలల నుంచి పునరాలోచన చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేస్తున్నది మన రాష్ట్రమే. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించాం. కేంద్రం ఇచ్చే కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: వనరుల సమీకరణపై సీఎం జగన్ సమీక్ష -
సీఎం జగన్ కు ఈ విజయం కానుకగా ఇస్తాం
-
వాలంటీర్ల వ్యవస్థను..
-
బీసీ కమిషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అంతకుముందు బీసీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లుపై అసెంబ్లీ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో బీసీలు ఇతర వర్గాలతో సమాన స్థాయికి ఎదగాలనే బీసీ కమిషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో బీసీల అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. బీసీలను కించపరిచేవిధంగా చంద్రబాబు మాట్లాడారని పార్థసారథి గుర్తుచేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారని పేర్కొన్నారు. విస్తృత అధికారాలు, లక్ష్యాలతో బీసీ కమిషన్ చట్టం రాబోతున్నదని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని విస్తృతంగా తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని, దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానం అమలుకాకుండాపోయిందని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. టీడీపీ హయాంలో కులాల తారతమ్యాలు తగ్గలేదని, అలాంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్ బిల్లు వెనుకబడిన వర్గాలను ఆదుకుంటుందని తెలిపారు. బీసీ కమిషన్ ఏర్పాటుతో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని అన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సూచనలు ఇచ్చేందుకు బీసీ కమిషన్‌కు హక్కు ఉంటుందన్నారు. కులాల సర్టిఫికెట్ల జారీ అంశాన్ని బీసీ కమిషన్ ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు టీడీపీ ఒక్క కార్యక్రమమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలకు మేలు చేసేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సభలో టీడీపీ ప్రవర్తన ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు బీసీ కమిషన్ వైఎస్సార్సీపీ సభ్యుడు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీసీ ప్రజలకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని, పాదయాత్రలో బీసీ ప్రజల కష్టాలు తెలుసుకొని.. వారికి న్యాయం చేసేందుకు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీసీ వర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయో.. అన్ని కులాల వారందరికీ దీని వల్ల న్యాయం జరుగుతుందన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ సమస్యను బీసీ కమిషన్ పరిష్కరిస్తుందని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకూ న్యాయం జరిగేలా బీసీ కమిషన్ చూస్తుందన్నారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లు బీసీలకు ధైర్యాన్నిస్తుందని, ఈబిల్లును ఓర్వలేక టీడీపీ సభను అడ్డుకుందని మండిపడ్డారు. -
నేరుగా మీ ఖాతాల్లోకి జీతాలు : బాలినేని
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం నిర్వహించిన వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సబ్ కమిటీ వేసిందని తెలిపారు. ఆ కమిటీలో తాను కూడా సభ్యుడుగా ఉన్నానని, ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు వచ్చేలా కృషి చేస్తానని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అందరి కష్టాలను తీర్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో రూ. 20 వేల కోట్లు అప్పు చేసిందని, విండ్, సోలార్, పవర్ పీపీఏల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బాలినేని ఆరోపించారు. హెచ్ఆర్ పాలసీ తెచ్చి ప్రత్యక్షంగా ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు వచ్చేలా చేస్తామన్నారు. 3 వేల మందితో ప్రారంభమైన యూనియన్ నేడు 25 వేలకు చేరుకుందని.. ఇందుకు కారుమురి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అవినీతికి తావు లేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలను అమ్ముకున్న పరిస్థితిని చూశామని, తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకున్నారని.. తగిన న్యాయం చేస్తారని కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వెన్నపూస వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో దిగులు
- అన్ని నియోజకవర్గాల్లోనూ ఎదురుగాలి - నీరుగార్చిన పొత్తు, వలసలు, వ్యూహాలు - నేతలు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం - జనం మధ్యకు వెళ్లలేక అగచాట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెచ్చిపెట్టుకున్న వాపును బలుపుగా ప్రచారం చేసుకుని.. తమదే విజయమని మేకపోతు గాంభీర్యంతో కొద్దిరోజుల క్రితం వరకూ హడావుడి చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఒక్కసారిగా నీరుగారిపోయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు లేనిబలాన్ని ఉన్నట్టు చెప్పుకుని ఊగిపోయిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చడీచప్పుడూ చేయడం లేదు. జనంలో పార్టీకి ఆదరణ లేదనే విషయం స్పష్టంగా తెలిసిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బీజేపీతో పొత్తువల్ల టీడీపీ చాలా నష్టపోతుందనే భావన తెలుగుదేశం శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వలస నేతల వల్ల కూడా పార్టీ బలహీనపడినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. వీటిన్నింటినీ మించి చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలే ఆ పార్టీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా టీడీపీకి జిల్లాలో ఎదురుగాలి వీస్తోందని స్పష్టమైపోయింది. బలమనుకున్న సీట్లే బలహీనమై.. మొన్నటివరకూ తమకు బలంగా ఉన్నాయని, ఆ నియోజకవర్గాలు తమవేనని ఘంటాపథంగా చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో గెలుపు సునాయూసం కాదని తేల్చుకుని పరుగులు పెడుతున్నారు.ఇందుకు ఉదాహరణ దెందులూరు నియోజకవర్గమే. ఇక్కడ గెలుపు తమదేనని నిన్నటి వరకూ ఆ పార్టీ అగ్రనేతలు కూడా భావించారు. కానీ ఇప్పుడు అది తమదేనని ధైర్యంగా చెప్పే పరిస్థితి లేకుండాపోయింది. అక్కడి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు వారం రోజుల వ్యవధిలోనే రాజకీయాన్ని మార్చేయడంతో టీడీపీ శ్రేణులు నివ్వెరపోయి దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో దెందులూరు, నిడదవోలు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకున్న టీడీపీ తాజా పరిస్థితుల్లో వాటి గురించి కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ బలమైన అభ్యర్థులను పోటీకి దింపడంతోపాటు వలసలను నిరోధించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ కాగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా తమదని చెప్పుకునే సాహసం ఆ పార్టీ నేతలు చేయలేకపోతున్నారు. జిల్లాలో టీడీపీ దుస్థితికి ఇదే నిదర్శనంగా కనబడుతోంది. పొత్తుతో చిత్తేనా! బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా నష్టపోయామని టీడీపీ కిందిస్థాయి క్యాడర్ కూడా భావిస్తోంది. జిల్లాలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ, నరసాపురం ఎంపీ సీటు మాత్రమే వదులుకున్నా ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ వర్గాల నుంచి తీవ్ర ప్రతికూలత వాళ్లకు కళ్లముందే సాక్షాత్కారమవుతోంది. ముస్లిం వర్గాలైతే టీడీపీని దరిచేరనీయడంలేదు. తమ ఉనికికే ప్రమాదమైన బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ నయవంచన చేసిందని వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. దళిత క్రిస్టియన్లు కూడా ఇదే అభిప్రాయానికి రావటంతో టీడీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. మరోవైపు వలస నేతలైన పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు వంటి వారివల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతోందనే వాదన పార్టీలోనే బలంగా వినిపిస్తోంది. దీనికితోడు సీట్ల కేటాయింపులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘోరమైన తప్పిదాలు చేయడంతో ఆ పార్టీ ఒక్కసారిగా పక్షవాతం వచ్చినట్లు మారిపోయింది.నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున నలుగురు బలమైన అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో ఉండటమే చంద్రబాబు సీట్ల ఎంపికలో చేసిన తప్పిదాలకు ఉదాహరణ. ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీని ఉన్నట్టుండి బలహీనంగా మార్చాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణుల్ని మళ్లీ చైతన్యం చేసేందుకు భీమవరంలో మోడీ సభ ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌తో రోడ్‌షోలు నిర్వహించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అవి కూడా ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం నాయకులు, శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయాయి.