ఇది ప్రజా ప్రభుత్వం కాదు..‘ఈవీఎం’ల ప్రభుత్వం: చెవిరెడ్డి | ysrcp Leader Chevireddy bhaskarreddy Comments On Alliance Government | Sakshi
Sakshi News home page

ఇది ప్రజాప్రభుత్వం కాదు..‘ఈవీఎం’ల ప్రభుత్వం: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

Published Mon, Dec 9 2024 3:17 PM | Last Updated on Mon, Dec 9 2024 4:46 PM

ysrcp Leader Chevireddy bhaskarreddy Comments On Alliance Government

సాక్షి,ప్రకాశం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని,ఈవీఎంల ప్రభుత్వమని ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్‌ 9) ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీచేస్తానని,జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు.

వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉంటే ఇప్పటికే ఇంటికి యాభై వేలు వచ్చేవి: మాజీ మంత్రి కారుమూరి

  • రాష్ట్రంలో ప్రజా కంటక పాలన జరుగుతుంది... ఎమ్మెల్యే లు ప్రజలలోకి రావడానికి భయపడుతున్నారు
  • ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలనను మరచిపోయి కక్ష సాధింపుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
  • ఎన్ని కష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట నిలుపుకొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఎన్ని సార్లు అయినా మోసం చేసే ఏకైక సీఎం చంద్రబాబు
  • వైఎస్‌ జగన్ అధికారంలో ఉంటే  ఈ ఆరునెలల్లో ఇంటికి యాబైవేల రూపాయలు వచ్చేవి

నేను ఎప్పుడూ వైఎస్‌ జగన్‌ వెంబడే: బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

  • ఎంపిటిసి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాడిని  కార్యకర్తల కష్టాలు తెలుసు
  • నాకు రాజకియ బిక్ష పెట్టింది దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి
  • నేను నా కుటుంబం ఎప్పటికీ వైఎస్‌ జగన్  వెంబడే
  • ప్రజలను వంచించి అక్రమ కేసులు పెడుతున్న పార్టీ పై పోరాటం చేద్దాం
  • అతి తక్కువ మెజారిటితో  గిద్దలూరు సీటును కోల్పోయాం
  • వైఎస్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement