karunya death
-
ఆర్టీసీలో ‘కారుణ్యం’
మనసున్న పాలకుడి పనితీరు ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటుకున్నారు. 2016–19 మధ్య కాలంలో మరణించిన 1,168 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. – సాక్షి, అమరావతి/కదిరి నాడు చంద్రబాబు ససేమిరా... టీడీపీ అధికారంలో ఉండగా 2016 – 19 మధ్య 1,168 మంది ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందగా కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. ఆర్టీసీ నాడు కార్పొరేషన్‌గానే ఉన్నప్పటికీ కనికరించలేదు. కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. నేడు మానవత్వంతో.. కారుణ్య నియామకాల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవీయ దృక్పథంతో వ్యవహరించారు. విలీనంతో ఆర్టీసీ ప్రభుత్వ విభాగంగా మారిన తరువాత కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు సమ్మతించడం గమనార్హం. 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హతలను బట్టి 34 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, 146 మందికి ఆర్టీసీ కానిస్టేబుళ్లుగా, 175 మందికి కండక్టర్లుగా, 368 మంది డ్రైవర్లుగా, 445 మందికి శ్రామిక్/ అసిస్టెంట్ మెకానిక్‌లుగా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల హర్షం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు ఆమోదం తెలపడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. వివిధ కేటగిరీల్లో 1,168మందికి ఉద్యోగాలు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయడంపై ధన్యవాదాలు తెలియజేశాయి. ఆర్టీసీ ఉద్యోగులపట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందనేందుకు ఇది నిదర్శనమంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సుబ్రహ్మణ్యం కుమార్తెకు..డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్
సాక్షి, అమరావతి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ వైఎస్‌తోపాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం కుమార్తె పి. సింధు సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం.. చిత్తూరు జిల్లాలో జరగాల్సిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్‌తో కలిసి హెలికాప్టర్లో వెళ్తూ 2009 సెప్టెంబరు రెండున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె పి. సింధు సుబ్రహ్మణ్యంకు కారుణ్య నియామకం కింద డిప్యూటీ కలెక్టరు పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఏ చదివిన సింధు సుబ్రహ్మణ్యంను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక ఉత్తర్వులు అందుకున్న తర్వాత నెలరోజుల్లోగా ఆమె డ్యూటీలో చేరాల్సి ఉంటుంది. ఆమెకు రిజిస్టర్ పోస్టులో నియామక ఉత్తర్వులు పంపుతారు. -
మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ‘మా బిడ్డ కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా రూ. 25 లక్షలు ఖర్చవుతుందంటున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. కూతురు పడుతున్న బాధలు చూడలేకపోతున్నాము. రాత్రింబవళ్లు ఇద్దరం కష్టపడితే కానీ కుటుంబం గడవని పరిస్థితి. వైద్యం చేయించలేక పోతున్నాము. మా కూతురు కారుణ్య మరణానికి అనుమతించండి’ అని జగద్గిరిగుట్టకు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతులు గురువారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హర్షిత(11) కొంతకాలంగా కామెర్లతో బాధపడుతుండగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అమ్మాయికి కాలేయం పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాల్సిందేనని ఇందుకోసం రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని స్పష్టం చేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ దంపతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి తమ కూతురు కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం ఉప్పునూతలకు చెందిన రాంచంద్రారెడ్డికి కూతురు హర్షితతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. పదేళ్ల క్రితం నగరానికి వచ్చిన వీరి కుటుంబం జగద్గిరిగుట్టలో ఉంటుంది. స్థానికంగా ఓ స్వీట్‌షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జగద్గిరిగుట్టలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న హర్షితను అనారోగ్య కారణాల వల్ల చదువు మాన్పించారు. కష్టపడి సంపాదించిన రూ. 2.5 లక్షలు సైతం కూతురు కోసమే ఖర్చు చేశానని, ఇక తన వద్ద డబ్బులు లేవని.. గత్యంతరం లేకనే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నట్లు రాంచంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.