breaking news
Karur Stampede
-
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్‌లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. -
కరూర్ ఘటన తర్వాత ప్రజల్లోకి విజయ్.. వేదిక ఫిక్స్
తమిళనాడులోని కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 27న చెన్నై కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారంతో పాటు వారిని దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కరూర్‌లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు కరూర్‌లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియంలేని దృష్ట్యా, బాధితులను చెన్నైకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలిపురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్‌కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్‌లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్‌కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్‌కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
కరూర్ తొక్కిసలాట ఘటనపై దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
-
కరూర్ తొక్కిసలాటపై సీబీ‘ఐ’
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని కరూర్ పెను విషాద తొక్కిసలాట ఘటన కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై సీబీఐ జరిపే దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించడం విశేషం. కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్‌లు ఉంటారని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో గత నెల 27వ తేదీన కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ ప్రచార సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారి తీసింది. ఈ కేసును ఐజీ అష్రా కార్గ్ నేతృత్వంలోని సిట్ విచారిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీవీకే సుప్రీంను కోరింది. కాగా, బీజేపీసహా కొందరు బాధితులు సీబీఐ విచారణను కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరి పిటిషన్లను విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు సిట్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ అరుణా జగదీషన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ యథావిధిగా కొనసాగుతుందని, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్ చేయలేదని ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో పాటు వాదనలు వినిపించిన న్యాయవాది, డీఎంకే ఎంపీ విల్సన్ తెలిపారు. కాగా, బాధితులుగా పేర్కొంటూ బాధితులు కానివారు సైతం కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారన్న విషయాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకునిరావడంతో ఈ అంశంపై విచారణ జరుపుతామని బెంచ్ పేర్కొన్నట్లు విల్సన్ తెలియజేయడం గమనార్హం. ఇదీ చదవండి: 'మీరేం ఒంటరి కాదు..' విజయ్‌కు బీజేపీ సపోర్ట్!! -
కరూర్ తొక్కిసలాట.. బాధితులతో విజయ్ భేటీపై పోలీసుల ఆంక్షలు
సాక్షి,చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు నటుడు,తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ సిద్ధమయ్యారు. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి పరామర్శించేందుకు విజయ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన సెప్టెంబర్ 27న టీవీకే ప్రచార సభలో జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలో విజయ్ ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి నేరుగా పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాటలోని బాధిత కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలవాలన్న ఉద్దేశంతో తమిళనాడు డీజీపీకి ఈమెయిల్ ద్వారా అనుమతి కోరారు. అయితే పోలీసుల నుంచి అనుమతి ఇంకా రాలేదు. భద్రతా కారణాల వల్ల విజయ్ పరామర్శను ఒకే వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇంటింటికి వెళ్లి బాధితుల్ని కలవడం వల్ల గందరగోళం నెలకోవడంతో పాటు, అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని అందుకే విజయ్‌కు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు బాధితుల పరామర్శ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని టీవీకే పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో విజయ్ కరూర్‌లో బాధితులందరూ ఒకే చోట సమావేశయ్యేలా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రానున్నారు. ఆ ప్రాంతం వరకు జనం లేకుండా చూడాలని టీవీకే ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.టీవీకే అనుమతికి అనుగుణంగా పోలీసులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ వచ్చే మార్గంలో చెక్పాయింట్లు,మొబైల్ పెట్రోల్ యూనిట్లు, ప్రజలు గుమిగూడకుండా ట్రాఫిక్ మళ్లింపులు, జనసమూహాన్ని నివారించడానికి విమానాశ్రయం ఎంట్రన్స్,ఎగ్జిట్ పాయింట్ల వద్ద పోలీసు ఎస్కార్ట్‌లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తమిళ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.దీంతోపాటు కరూర్‌లో జరిగే వేదికకు సంబంధించి..ఒక కిలోమీటరు వరకు పోలీసులు మోహరించనున్నారు. ముందస్తు అనుమతి పొందిన బాధిత కుటుంబ సభ్యులకు మాత్రమే వేదిక వద్దకు అనుమతి ఇవ్వనున్నారు. ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్ల వద్ద బాధితుల కుటుంబ సభ్యులన్ని ధృవీకరిస్తారు. ఆ సమయంలో జనం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. This video shows how much effort @TVKVijayHQ has taken in that time for people safety , he gave priority for the people but #KarurStampede happend was unexpected pic.twitter.com/mZu6s1QPFa— 𝕽æ𝖓𝖏𝖎𝖙𝖍𝕶ü𝖒𝖆𝖗 (@romeorkr) October 4, 2025 -
కరూర్ విషాద ఘటన.. విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి, చైన్నె: తమిళనాడులో(Tamil Nadu) కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరవైపు.. టీవీకే అధినేత విజయ్(TVK Vijay).. పలువురు బాధితులను పరామర్శించినట్టు సమాచారం. వీడియోలో వారిని పలకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధితులను కలిసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం.. కరూర్(Karur Stampade) బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు తెలిసింది. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించిన నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరూర్ బాధితులను కలిసేందుకు విజయ్.. రాష్ట్ర డీజీపీ(Tamil Nadu DGP) కోరినట్టు సమాచారం. ఈ మేరకు తమిళనాడు డీజీపీకి విజయ్ ఈమెయిల్ పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ మెయిల్‌కు డీజీపీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత నెల 27వ తేదీన కరూర్‌లో టీవీకే విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్‌కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు.అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. -
కరూర్ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు విజయ్ పరామర్శ
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను విజయ్ ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) వీడియో కాల్లో పరామర్శించారు. వారిని ఓదార్చిన విజయ్.. త్వరలో కరూర్‌లో పర్యటిస్తానని తెలిపారు."నేను మీతో ఉన్నాను, మీకు అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అయితే, వీడియో కాల్ సమయంలో ఫోటోలు తీసుకోవద్దని.. రికార్డ్ చేయవద్దని ఆయన బృందం కోరింది. ప్రతి వీడియో కాల్ సుమారు 20 నిమిషాల పాటు సాగిందని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీకి చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, మొదట వ్యతిరేకించిన కోర్టు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, టీవీకే పార్టీకి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ సుమారు 30 వేల మందికి పైగా హాజరయ్యారు. భారీగా జనం హాజరవుతారని అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారు. -
కరూర్ తొక్కిసలాట బాధితులకు టీవీకే అధినేత విజయ్ వీడియో కాల్
-
‘మరీ ఇంత దిగజారిపోవాలా కమల్?’
తమిళ అగ్రనటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై(Annamalai Slams Kamal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ ఘటనలో స్టాలిన్ ప్రభుత్వంపై కమల్ హాసన్ ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ.. మరీ డీఎంకేకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ అన్నామలై మండిపడ్డారు.సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో జరిగిన విజయ్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ బాధితులను డీఎంకే నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలై భగ్గుమన్నారు.రాజ్యసభ సీటు కోసం తన అంతరాత్మను అమ్మేసుకున్నారంటూ అన్నామలై, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్‌పై మండిపడ్డారు. ‘‘కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా?. ఆయన మరీ ఇంత దిగజారాలా?. అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలేం పట్టించుకునే పరిస్థితిలో లేరు’’ అని అన్నామలై అన్నారు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)ఇదిలా ఉంటే.. కరూర్ బాధితులను పరామర్శించిన అనంతరం కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషాదంపై విచారణ జరుగుతున్న దశలో రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. దీనిని మానవీయ కోణంలోనే చూడాలి. ప్రభుత్వం ప్రజల పక్షాల నిలబడాలి. సీఎం స్టాలిన్ నాయకత్వ లక్షణం కనబరిచారు. పోలీసులు, అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అని అన్నారు. అదే సమయంలో ‘‘క్షమాపణ చెప్పి.. తప్పు ఒప్పుకోవాల్సిన సమయం ఇది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే విజయ్ను ఉద్దేశించినవేనన్న కామెంట్(Kamal Blames Vijay on Karur Incident) బలంగా వినిపిస్తోందక్కడ. ఇదీ చదవండి: విజయ్‌కు సపోర్ట్‌గా బీజేపీ, ఆ పార్టీ కూడా! -
తమిళనాట ట్విస్ట్.. కరూర్ ఘటనపై కుష్బు సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడులోని(Tamil Nadu) కరూర్(Karur Stampede) ఘటన తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కరూర్ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని టీవీకే మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే నేతల ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తూ.. బీజేపీ(BJP Party) నాయకురాలు, సినీ నటి కుష్బు సుందర్(Khusbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.కరూర్ తొక్కిసలాట ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్ స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘తమిళనాడు ప్రజలందరూ కరూర్ తొక్కిసలాట ఘటన నిర్లక్ష్యంగా జరిగిందని అనుకుంటున్నారు. కానీ, ఈ ప్రమాదం ప్లాన్ ప్రకారమే ఎవరో సృష్టించినట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే విజయ్(TVK Vijay) ర్యాలీ నిర్వహించడానికి ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వలేదు. విజయ్ ర్యాలీకి ఎంత మంది అభిమానులు, ప్రజలు వస్తారు అనేది ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలుసు. అయినా కూడా ఇలా ర్యాలీకి తగిన స్థలం కేటాయించలేదు.VIDEO | Chennai: “Tamil Nadu CM MK Stalin should switch from mute mode, speak on Karur stampede”, says actor and BJP leader Khushbu Sundar (@khushsundar) raising questions on various viral videos of Karur tragedy.#KarurStampede (Full video available on PTI Videos -… pic.twitter.com/Fm587TeDvf— Press Trust of India (@PTI_News) October 4, 2025తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉన్నారు. పలు ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?. ఈ దురదృష్టకర ఘటనలో 41 మంది మరణించారు. ఇప్పటికైనా స్టాలిన్ మాట్లాడాలి. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారని అధికారులు చెబుతున్నారు. అలా లాఠీఛార్జ్ ఎందుకు చేశారు?. ఇది ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిన ఘటన అయి ఉండాలి’ అని ఆరోపించారు.విజయ్‌కు బీజేపీ అగ్రనేత ఫోన్.. మరోవైపు.. కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. తాజాగా టీవీకే విజయ్‌తో బీజేపీ అగ్రనేత ఒక్కరు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్‌కు సూచించినట్లు సమాచారం.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్‌గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!. -
‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్‌కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ విజయ్‌కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్‌గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్‌కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్‌కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్‌ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.ఇటు కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్‌ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్‌గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.ఇప్పటికే విజయ్ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట -
కరూర్ తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం..‘విజయ్‌లో నాయకత్వ లక్షణాలు లేవు’
సాక్షి,చెన్నై: సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్‌పై కోర్టు విమర్శలు గుప్పించింది. శుక్రవారం (సెప్టెంబర్ 03) కరూర్ తొక్కిసలాటపై విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ‘విజయ్ మీకు నాయకత్వ లక్షణాలు లేవు.. ఉంటే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయేవారు కాదు.‘41 మంది చనిపోతే కోర్టు కళ్లు మూసుకోదు. ఈవెంట్ నిర్వాహకులపై సానుభూతి ఎందుకు చూపించాలి?’అని ప్రశ్నించింది. బాధితుల పట్ల కనీస పచ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని విజయ్ మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ ఐజీ ఆస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశించింది.ఈ సందర్భంగా టీవీకే నేతలందరూ ఘటన తర్వాత ఎక్కడికి వెళ్లారు?. బాధితులను ఎందుకు పట్టించుకోలేదు?. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? అని మండిపడింది. అనంతరం, టీవీకే నేతల ముందస్తు బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. తొక్కిసలాట ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని టీవీకే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025 -
కరూర్ ఘటన: విజయ్ టీవీకేపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం పార్టీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.‘‘ప్రారంభ దశలోనే సీబీఐకి బదిలీ చేయాలని కోరితే ఎలా?. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో సంతృప్తి కలగనప్పుడు కోర్టును ఆశ్రయించండి. అసలు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగు నీరు, ఆహారం సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు?.. దయచేసి న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దు’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు.. రాజకీయ ర్యాలీలు, సభల విషయంలో అనుమతులు ఎలా జారీ చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ లాయర్.. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన నియమాలు ప్రభుత్వం రూపొందిస్తుందని, అప్పటిదాకా ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోదని తెలిపారు. అలాగే.. రోడ్డుపై సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. దీంతో వివరణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో అంగీకరించింది. మరోవైపు.. బాధితులకు పరిహారం పెంపు పిటిషన్‌కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కుట్ర కోణం ఉందని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని టీవీకే ఓ పిటిషన్ వేసింది. అలాగే తమ కార్యదర్శులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ వేసింది. ఈ రెండింటితో పాటు కరూర్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్, మరో నాలుగు వేర్వేరు పిటిషన్లు.. మొత్తం ఏడింటిని కలిపి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. -
కరూర్ తొక్కిసలాట.. టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: కరూర్ ర్యాలీ దుర్ఘటనతో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత శనివారం సాయంత్రం తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన మీట్ ద పీపుల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాట దుర్ఘటనలో టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయ్ సైతం కరూర్ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్1)విజయ్ తన టీవీకే పార్టీ రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీవీకే తన అధికారిక ‘ఎక్స్’ ట్వీట్ చేసింది. ‘మా ప్రియమైన వారిని కోల్పోయినందుకు మేము బాధలో ఉన్నాం. ఈ పరిస్థితిలో రాబోయే రెండు వారాల పాటు టీవీకే బహిరంగ సభలను తాత్కాలికంగా వాయిదా వేస్తుంది’అని ట్వీట్లో పేర్కొంది. పార్టీ అధినేత విజయ్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీ భవిష్యత్ కార్యచరణకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం’అని తెలిపింది. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025 -
కక్ష సాధించాలంటే.. నన్ను ఏమైనా చేసుకోండి
సాక్షి, చెన్నై: కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే తనను ఏమైనా చేసుకోవాలని, తన కేడర్‌ను విడిచి పెట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విజ్ఞప్తి చేశారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మూడు రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. తన జీవితంలో ఇంత వేదన ఎన్నడూ అనుభవించలేదని తెలిపారు. ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. జరగకూడనిది జరిగిందని, ఘటన జరిగిన రోజున తాను అక్కడే ఉంటే, పరిస్థితిని మరింత సమస్యాత్మకంగా మార్చేస్తారేమోనని చెన్నైకి వచ్చేసినట్టు వివరించారు. సీఎం సార్ .. విజయ్ వీడియోలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ‘ఐదు జిల్లాలకు ప్రచారానికి వెళ్లాను. కరూర్‌లో మాత్రమే ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది.. ఏం జరిగింది.. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ప్రజలు అన్నింటిని చూస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ‘కరూర్ ప్రజలు బయటకు వచ్చి వాస్తవాలు చెబుతున్నప్పుడు దేవుడే తన ముందుకు వచ్చి చెబుతున్నట్టుగా అనిపించింది. కేటాయించిన స్థలానికి వెళ్లి నిలబడి ప్రసంగించారు. ఏ తప్పు చేయలేదు. అయితే, నా పార్టీ వర్గాలను కేసుల పేరిట వేధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు.సీఎం సార్.. కక్షసాధింపు చర్య ఏదైనా ఉంటే .. నన్ను ఏమైనా చేసుకోండి. నా వాళ్లను వదలేయండి. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటాను.. నా వాళ్లను వదిలేయండి..’ అని అన్నారు. అలాగే కేడర్‌కు భరోసా ఇస్తూ, రాజకీయ ప్రయాణం మరింత బలంగా, ధైర్యంగా కొనసాగిస్తాం.. అని ముగించారు. టీవీకే వర్గాలపై కేసులు, అరెస్టుల ప్రక్రియ సాగుతుండటంతో ఆయన ఈ వీడియోను విడుదల చేసినట్టుందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో ఆయన కక్షసాధింపు అంటూ సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేయడం మరింత చర్చకు దారితీసింది.ఇద్దరు నేతలకు రిమాండ్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, కరూర్ నగర్ ఇన్చార్జ్ మాశి పొన్‌రాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం కరూర్ కోర్టులో న్యాయాధికారి భరత్‌కుమార్ ఎదుట హాజరుపరిచారు. అక్టోబర్ 14వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.బీజేపీ బృందం అనుమానాలు తొక్కిసలాటకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో ఎనిమిదిమంది ఎంపీలున్న బీజేపీ నిజనిర్ధారణ కమిటీ మంగళవారం కరూర్‌లో పర్యటించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారసభ కోసం సరైన స్థలం కేటాయించలేదని చెప్పారు. ఇరుకైన రోడ్డులో అనుమతి ఇవ్వడం, విద్యుత్ సరఫరా ఆగడం, చెప్పులు విసరడం వంటి అంశాలను పరిశీలిస్తే ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అముదా నేతృత్వంలో ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదం, ఇతర అధికారుల బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు కారణాలు, రద్దీపెరగడం వంటి అనేక అంశాలను వీడియో ఆధారాలతోసహా విడుదల చేసిన అధికారులు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
‘నా గుండె పగిలింది’.. కరూర్ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్
సాక్షి,చెన్నై: ‘నన్ను టార్గెట్ చేయండి.. ప్రజల్ని కాదు’ అంటూ కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు విజయ్ మంగళవారం (సెప్టెంబర్30న) ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ‘ఈ ఘటన నన్ను కలచివేసింది. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది. మాటలు రావట్లేదు. త్వరలో బాధితుల్ని కలుస్తా. నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుంటాను’ అని వ్యాఖ్యానించారు. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025శనివారం రాత్రి కరూర్‌లో విజయ్ మీట్ ది పీపుల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సభలో విజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు,టీవీకే కార్యకర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. షెడ్యూల్ ప్రకారం .. విజయ్ కేఎస్ థియేటర్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు కరూర్ నగరంలోని వేలు స్వామిపురం సభాస్థలికి చేరుకున్నారు.దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి పదుల సంఖ్యలో వాటర్ బాటిళ్లను విజయ్ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. -
అల్లర్ల భూమిగా మార్చేశారు.. విజయ్‌పై సినీ నటి కామెంట్స్
కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తీవ్రమైన వ్యతిరేఖత కనిపిస్తుంది. తమిళనాడులో తన ఉణికి కూడా ప్రమాదంలో పడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కనీసం ఒక వీడియో రూపంలో కూడా స్పందించ లేదు. కేవలం సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే షేర్ చేశారు. దీంతో నెటిజన్లు నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది.ఇప్పటికే విజయ్‌ని అరెస్ట్ చేయాలంటూ సినీ నటి ఓవియా సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పంచుకుంది. అయితే, తాజాగా ఆమె మరోసారి ఇలా రియాక్ట్ అయింది. కరూర్ సంఘటన తర్వాత, రజనీకాంత్ సర్, అజిత్ సర్, సూర్య సర్ అభిమానుల మీద నాకు గౌరవం పెరిగింది. వారిలో చాలామంది సరైన మార్గంలో వెళ్తున్నారు. కానీ, విజయ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. టీవీకే ప్రచార ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చాలా ప్రమాదకరమైన ట్వీట్లు చేస్తూ.. హింసను సృష్టిస్తున్నాడు. అతను తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నాడు.' అంటూ ఆమె పేర్కొన్నారువిజయ్ అభిమానులపై కూడా తమిళనాడులో విమర్శలు వస్తున్నాయి. విజయ్‌కు వ్యతిరేఖంగా ఎవరైనా మాట్లాడితే వారు బూతులతో ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే ఓవియాను టార్గెట్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ భారీగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. After #Karur incident, my respect for Rajini sir, Ajith sir, and Suriya sir has grown as their fans walk on the right path.But Vijay is misleading youngsters, making people like Adhav Arjuna post harmful tweets and create violence.He is turning Tamil Nadu into a land of riots. pic.twitter.com/XccxjsfAYG— Oviya (@oviya__offll) September 30, 2025 -
అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో.. రెండు మానాడులు, సామాజిక యాత్రలో భాగంగా ర్యాలీలు నిర్వహించినా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చూసుకోలేకపోయారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది.శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జీ నిరసనలు ప్రభుత్వాల్ని గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో.. తమిళ యువత కూడా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలంటూ విజయ్ పేరిట ఓ ప్రచారం నడుస్తోంది. అయితే కరూర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఇది తెరపైకి రావడంతో.. ఇటు రాజకీయ ప్రత్యర్థులు, అటు నెటిజన్లు విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. టీవీకే(TVK) అధికారికంగా స్పందించింది. ఆ ప్రకటనతో విజయ్కిగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కూడా ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జున చేయడం చేసిన సోషల్ మీడియా పోస్టుతో వైరల్ అయ్యింది. కరూర్ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే యువతను రెచ్చగొట్టేలా ఆధవ్ అర్జున(TVK Aadhav Arjuna) పోస్ట్ చేశారంటూ అధికార డీఎంకే మండిపడింది. 41 మందిని బలిగొన్న కూడా ఆ పార్టీ ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదు అని డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) హెచ్చరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీని ఆధారంగా డీఎంకే ఫిర్యాదునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆధవ్ అర్జున.. కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ కోర్టును కోరారాయన. అలాగే బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించేందుకు అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది.ఇదీ చదవండి: కరూర్ ఘటన 21 మందిపై కేసు.. తొలి అరెస్ట్ -
విజయ్‌కు సపోర్ట్‌గా మన్సూర్ సంచలన కామెంట్స్
తమిళనాడు కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందని సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పేర్కొన్నారు. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరగడంతో 41 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో విజయ్ తన క్రెడిబులిటీ కోల్పోయాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం విజయ్ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు అండగా మన్సూర్ అలీ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు.కరూర్ ఘటన ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిన భారీ కుట్ర అంటూ మన్సూర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. రాబోవు ఆరు నెలల్లో ఈ ఘటనకు కారణమైన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. విజయ్‌ని అరెస్ట్ చేసినా సరే అతను బయపడడంటూ మన్సూర్ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఆయన్ను రాజకీయంగా సమాధి చేసేందుకు వేసిన ప్లాన్ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.'తమిళనాడులోని కరూర్ సంఘటన హృదయ విదారకం. నా స్వస్థలం కరూర్. ఈ ఘటన తర్వాత నాకు గత రెండురోజులుగా నిద్ర కూడా పట్టడం లేదు. నేను ఎలా నిద్రపోగలను..? ఆ తొక్కిసలాటలో మరణించిన వారందరూ ఎలాంటి బాధను అనుభవించారో తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. మన దేశంలో ఇలా జరగడం చాలా సిగ్గుచేటు. కరూర్ సంఘటనను తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆయుధంగా ఉపయోగించనున్నారు. మీకు విజయ్ ఎదుగుదల నచ్చకుంటే నేరుగా ఆయన్ను ఎదుర్కొండి. విజయ్ నినాదం తప్పు అయితే మీరు కూడా సమావేశాలు నిర్వహించి ఎండగట్టండి. అలా చేయడం చేతకాక ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారా..? ఇది నీతిలేని రాజకీయమని అనిపించడం లేదా..? మీ రాష్ట్ర ప్రజలనే ఇలా చంపుకుంటారా.. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మీది కాదా.. తమిళనాడులో గెలుపు ఎవరిది అనేది రాబోయే ఆరు నెలల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కొంతమంది తిమింగలంలా మింగేసేందుకు రెడీగా ఉన్నారు. విజయ్ ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయంలో నేను విజయ్‌కు మద్దతు ఇస్తున్నాను. నా తమ్ముడు విజయ్‌ని నేనే పెంచాను. అరుణ జగతీశన్ నేతృత్వంలో జరిగే దర్యాప్తుతో ఏమీ ఒరిగేది లేదు. వారు సరైన పోలీసు రక్షణ కల్పించలేదు. ఏ పార్టీ అయినా ఇన్ని షరతులు విధించిందా..? అంత కఠినత ఉందా..? విజయ్‌ని ఇబ్బంది పెట్టే వారికి ఆరు నెలల్లో శిక్ష పడుతుంది. 41 మంది మరణానికి విజయ్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని మీరు అంటున్నారు. కానీ, అతన్ని అక్కడే ఉండనివ్వకుండా పంపించేశారు. కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర. విజయ్ గొప్ప వ్యక్తి. ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. తరువాత ఏమి చేయాలో అతనికి తెలుసు' అని నటుడు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. -
కరూర్ తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్
చెన్నై: కరూర్‌లో తమిళగ వెట్రికళగం(TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Vijay) ప్రచారం తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్ జరిగింది. టీవీకే జిల్లా సెక్రటరీ మతియఝగన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది.కరూర్ ఘటన గురించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. రెండోరోజూ ఆమె ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ పరిసర వాసులతో మాట్లాడారు. అలాగే ఐదుగురు మరణించిన ఏలురు పుదురు, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విశ్వనాధపురి గ్రామానికి వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడారు. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ కమిషన్ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా ఇది వరకు నియమితులైన డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించారు. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను సోమవారం రంగంలోకి దించారు.ఘటనా స్థలంలో భద్రతా విధులలో ఉన్న మణివణ్ణన్ అనే ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శి ∙మది అళగన్, రాష్ట్ర కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌తో పాటూ ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్ ఈశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో 10 మంది గుర్తు తెలియని టీవీకే వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఐదు సెక్షన్లతో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో సమగ్ర వివరాలను పొందు పరిచారు. ఇందులో పేర్కొన్న అంశాలు విజయ్ మెడకు సైతం మున్ముందు ఉచ్చు పడేనా? అన్న చర్చ ఊపందుకుంది. -
కరూర్ తొక్కిసలాటలో 41కి చేరిన మరణాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందింది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు కోలుకుంటున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సోమవారం పరామర్శించారు. ఘటనపై విచారణ అధికారిగా ఉన్న డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. సోమవారం ఎఫ్ఐఆర్లో విజయ్ ఆలస్యంగా రావడం, పోలీసులు విధించిన నిబంధనల్ని తుంగలో తొక్కడం, సభకు వచి్చన జనం నీళ్లు, ఆహారం లేకపోవడం వల్ల నీరసించిపోతున్నారని, రద్దీ మరింత పెరిగితే ఊపిరి ఆడకపోవచ్చని తాము పదేపదే హెచ్చరించినా నిర్వాహకులు ఖాతరు చేయకపోవడంతోనే ఇంత పెద్ద ఘోరం జరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుండగా.. కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ వీడియో విడుదల చేస్తూ, జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల సమావేశాలకు కొత్త మార్గదర్శకాలను రూపకల్పన చేసి ప్రజల ప్రాణ రక్షణ దిశగా నిబంధనలు కఠినం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నటుడు విజయ్ తొక్కిసలాట ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని సోమవారం ఆశ్రయించారు. ఆయన తరపున టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున న్యాయవాదులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారని, రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీచార్జి చేశారని పేర్కొంటూ స్థానిక డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు అంశాలను పిటిషన్లో ప్రస్తావించారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరారు. బాధితులను పరా>మర్శించడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రతకు ఆదేశించాలని కోరారు. అత్యవసరంగా విచారించాలని కోరినా.. అక్టోబరు 3వ తేదీన విచారించేందుకు ధర్మాసనం నిర్ణయించింది. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దుకు ఆదేశించాలని కోరుతూ మధురైకు చెందిన న్యాయవాది సెల్వకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. చెన్నై శివారులోని పనయూరు నివాసంలో ఉండే విజయ్ సోమవారం హఠాత్తుగా నగరం నడ్డిబొడ్డున ఉన్న పట్టినంబాక్కం నివాసానికి మకాం మార్చారు. కరూర్ ఘటనపై విజయ్‌తో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఫోన్లో మాట్లాడారు. కాగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తిని టీవీకే సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్ నేతృత్వంలోని బృందం చెన్నైలో కలిసినట్టు సమాచారం. బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ ఘటనపై విచారణకు బీజేపీ అధిష్టానం కమిటీని నియమించినట్టు తెలిసింది. ఉరేసుకున్న టీవీకే పార్టీ నేత కరూర్‌లో తమ పార్టీ నేత ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన విల్లుపురం జిల్లా వీరపట్టుకు చెందిన టీవీకే పార్టీ నాయకుడు అయ్యప్ప (26) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు రాసిపెట్టిన లేఖ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
‘ఆ పాపం విజయ్‌దే’.. కరూర్ తొక్కిసలాట ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో, తమిళగ వెట్రీ కజగం (TVK) అధినేత విజయ్ తమిళనాడు కరూర్ జిల్లాలో హీరో,టీవీకే అధినేత విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తొక్కిసలాట (Karur stampede) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ ఆరోపణల ఉచ్చు బిగిస్తున్నట్లు తాజా ఎఫ్ఐఆర్ వివరాలు సూచిస్తున్నాయి.పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం, సెప్టెంబర్ 27, 2025న వేలుసామిపురం వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ‘మీట్ ద పీపుల్’ ర్యాలీకి 11 గంటలకల్లా భారీగా అభిమానులు, టీవీకే కార్యకర్తలు చేరుకున్నారు. మధ్యాహ్నం ప్రసంగించాల్సిన విజయ్ నాలుగు గంటల ఆలస్యంగా, సాయంత్రం 7 గంటలకు సభకు హాజరయ్యారు. ఈ ఆలస్యమే సభపై అంచనాలను పెంచి, జనసందోహాన్ని అధికంగా పెంచిందని పోలీసులు పేర్కొన్నారు.అనుమతి ఉల్లంఘన.. నిర్వాహకుల నిర్లక్ష్యంవిజయ్ ప్రసంగించాల్సిన బస్సు అనుమతి పొందిన స్థలంలో ఆగకపోవడం.. నీరు, ఆహారం అందించడంలో నిర్లక్ష్యం, ట్రాఫిక్‌కు అంతరాయం వంటి అంశాలు ఎఫ్ఐఆర్లో హైలెట్ అయ్యాయి. పోలీసుల విజ్ఞప్తిని పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్ బస్సీ ఆనంద్ సహా టీవీకే నేతలు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.బారీకేడ్లు తొలగింపు.. పైకప్పు కూలి విషాదంజనసమూహాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన పోలీసు బారీకేడ్లను టీవీకే వాలంటీర్లు తొలగించడంతో, పరిస్థితి అదుపు తప్పింది. అభిమానులు విజయ్ను చూడాలనే ఉత్సాహంతో రూఫ్‌పైకి ఎక్కగా, పైకప్పు కూలిపోయి టీవీకే వాలంటీర్లు మరణించినట్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో హైలెట్ చేశారు. This will haunt you forever! @TVKVijayHQ #tvkstampede #KarurTragedy #KarurStampede pic.twitter.com/jKTbSyfIhS— Karunyan MBA (@KarunyanMBA) September 28, 2025తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వ హించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 18 మహిళలు, 13 పురుషులు, 5 బాలికలు, 5 బాలురు ఉన్నారు. 60 మందికి పైగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందిఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్లో పలు క్రిమినల్ సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. టీవీకే పార్టీ నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం జరిగిందనే ఆరోపణలతో టీవీకే నేతలు ఎన్ ఆనంద్ కుమార్, సీటీఆర్ నిర్మల్‌కుమార్, మతియళగన్‌పై అరెస్టు చర్యలు ప్రారంభించారుతొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో టీవీకే పిటిషన్ దాఖలు చేసింది . సీబీఐ,సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. తమిళనాడు ప్రభుత్వం అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. విజయ్ దుర్ఘటనపై స్పందిస్తూ..కరూర్ తొక్కిసలాటలో మరణించిన ప్రతీ కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. -
కరూర్ ఘటనపై 'ఛీ' అంటూ సత్యరాజ్ విమర్శలు
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి స్టార్స్ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నటుడు సత్యరాజ్ రియాక్ట్ అయ్యారు. విజయ్‌పై ఆయన విమర్శలు చేశారు.కరూర్ ఘటన గురించి సత్యరాజ్ ఇలా అన్నారు.. " ఒక్కోసారి తప్పులు అనేవి మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. కానీ, తెలిసి ఎవరైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది చిన్న తప్పు అయితే, దాన్ని సరిచేసుకోవాలి. ఒకవేళ అది అనుకోకుండా పెద్దదైతే మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఛీ!" అంటూ సత్యరాజ్ పోస్ట్ చేశారు.విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయన సభల్లో 8మంది మరణించారు. తను ప్రయాణించే వాహనం కింద బైకర్స్ పడిపోయి కొందరు తీవ్రంగానే గాయపడ్డారు. ఇలా తరుచుగా విజయ సభల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతను కట్టడి చేయడం తమిళనాడు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయం కోర్టుకు కూడా తెలిపారు. ఇప్పుడు సినీ నటుడు సత్యరాజ్ కూడా దానిని పరోక్షంగా చెప్పారు. తను పాల్గొంటున్న ర్యాలీలో ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం విజయ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్యరాజ్ పరోక్షంగా చెప్పారు. -
ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందా?.. టీవీకే పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ
చెన్నై: కరూర్ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్ర అన్న అనుమానాన్ని తమిళగ వెట్రి కళగం న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. అడయార్‌లోని న్యాయమూర్తి దండపాణి నివాసానికి చేరుకుని కేసును సుమోటోగా స్వీకరించాలని విన్నవించారు. ఇందుకు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.కరూర్ ఘటనతో తీవ్ర మనో వేదనలో ఉన్న విజయ్ తన ఆవేదనను ఎక్స్ పేజి ద్వారా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి తలా రూ. 2 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, తన హృదయం ముక్కలైందని, కన్నీటీ వేదనలో ఉన్నానని పేర్కొంటూ, అందరినీ కలవాలని ఉన్నా, అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో ప్రకటన విడుదల చేశారు.ఇంటి వద్ద భద్రత పెంపు విజయ్ నివాసం ఉన్న పనయూరు పరిసరాలలో కొన్ని సంఘాలు కరూర్ ఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు ఆదివారం దిగాయి. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో విజయ్ నివాసం, తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం పరిసరాలలో భద్రతను పెంచారు. విజయ్ నివాసం వద్ద కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి.5 సెక్షన్లతో కేసు నమోదు విజయ్ పార్టీకి చెందిన కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్‌కుమార్‌తో పాటుగా ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.సెక్షన్ 105,110, 125, 223, సెక్షన్ 3 కింద నాన్ బెయిల్ బుల్ వారెంట్‌తో కూడిన కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసి విచారించేందుకు కరూర్ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు.కుట్ర కోణంపై అనుమానాలు విజయ్ వేలుస్వామి పురం వద్దకు వచ్చే సమయంలో వరసగా అంబులెన్స్‌లు రావడం, ఓ చోట లాఠీచార్జ్ జరిగినట్టు వీడియోలు వైరల్ కావడం, విజయ్ వాహనంపైకి రాళ్లు రువ్వినట్టుగా వచ్చిన సంకేతాలను తమిళ వెంట్రికళగం న్యాయవాద విభాగం తీవ్రంగా పరిగణించింది. కరూర్ ఘటన ప్రమాదంగా తెలియడం లేదని, పథకం ప్రకారం జరిగిన కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ న్యాయవాదుల బృందం చెన్నై అడయార్ నివాసంలో న్యాయమూర్తి దండపాణిని కలిసి అనుమానం వ్యక్తం చేశారు.కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. కేసును సీబీఐకు లేదా ప్రత్యేక సిట్‌కు అప్పగించి విచారించాలని విన్నవించారు. చివరగా పిటిషన్ దాఖలు చేయాలని, సోమవారం మధ్యాహ్నం విచారిస్తానంటూ ఆయన పేర్కొనడంతో ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయడానికి న్యాయవాద విభాగం చర్యలు చేపట్టింది. కాగా, విజయ్ మనస్సు తీవ్రంగా రోదిస్తుందని.. ఆయన తీవ్ర ఉద్వేగంతో ఉన్నారని న్యాయవాద బృందం మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా భద్రతా వైఫల్యాలు, కరూర్ ఘటనను పరిగణించి ఇక విజయ్ ప్రచారాలకు నిషేధం విధించాలంటూ వేలుస్వామి పురం ఘటనలో బాధితుడైన సెంథిల్ కన్నన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.ఈ పరిణామాలతో కొద్ది రోజులు ప్రచార పర్యటనను వాయిదా వేసుకునే విధంగా విజయ్ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా పుష్ప–2 చిత్రం విడుదల సందర్భంలో జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లుఅర్జున్ను అరెస్టు చేసినట్టుగా కాగా ఘటనలో విజయ్ను అరెస్టు చేయాలంటూ సామాజిక మాద్యమాలలో కొందరు పోస్టులు పెట్టడం గమనార్హం. అలాగే అనేక చోట్ల సేలం, ఈరోడ్లతో పాటూ పలుచోట్ల ఇదే తరహాలో పోస్టర్లు వెలిశాయి. -
ప్రమాదమా.. కుట్రా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్ విచారణ కోరుతూ ఆ పార్టీ న్యాయవాద విభాగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంతో పాటు ఐదుగురు ఐజీలు, డీజీఐలు ఘటనా స్థలంలో విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 14 మంది పురుషులు, 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు డీఎండీకే, బీజేపీ, తదితర పార్టీ ల నేతలంతా కరూర్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫ్యలమే కారణమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విజయ్ సైతం ముందస్తు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేసుకుని ఉండాల్సిందని హితవు పలికారు. కాగా.. ఈ ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు టీవీకే డిమాండ్ కరూర్‌లో బాధితుల సమాచారం, మరికొందరు వైరల్ చేస్తున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన ప్రమాదమా? లేక కుట్ర జరిగిందా..? అన్న అనుమానాలకు దారితీసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీవీకే న్యాయవాది విభాగం బృందం చెన్నైలో న్యాయమూర్తి దండపాణిని కలిసి సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీచార్జ్ జరిగినట్టు వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా న్యాయమూర్తికి వివరించారు. కేసును సీబీఐ లేదా సిట్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం మధ్యాహ్నం విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి సూచించగా.. ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తాను సైతం కరూర్ వెళ్లేందుకు సిద్ధమైనా, పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కాగా.. విజయ్ ఇంటివైపు కొన్ని విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఆ పరిసరాలన్నీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ప్రచారాలపై నిషేధం విధించాలని కోరుతూ సెంథిల్ కన్నన్ అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిలావుండగా కరూర్ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్‌కుమార్‌తో పాటు ఇతరులు అని పేర్కొంటూ మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. వేలుస్వామిపురంలో పరిశీలన, విచారణ జరిగింది. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్‌లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిదంటూ మరికొందరు తెలిపారు. -
‘నీ డబ్బేం వద్దు విజయ్.. తొక్కిసలాటలో మరణించిన నా సోదరిని నాకివ్వు’
చెన్నై,సాక్షి: మాటలకందని కరూర్ విషాదంపై తమిళగ వెట్రి కగళం అధ్యక్షుడు విజయ్ ఇస్తానన్న రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా తమకేం వద్దని, తొక్కిసలాటలో మరణించిన తన చెల్లల్ని తిరిగి తనకు ఇవ్వాలని ఓ సోదరి కన్నీటి పర్యంతమవుతున్నారు. శనివారం రాత్రి విజయ్ తమిళనాడు కరూర్‌లో నిర్వహించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కరూర్‌కు చెందిన బృందా ఒకరు.బృందాకు హీరో విజయ్ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానమే బృందా ప్రాణాలు తీసింది. నిన్న తానుండే ఏరియాలో విజయ్ సభ నిర్వహిస్తున్నాడని తెలుసుకుంది. ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది. రెండేళ్ల కొడుకును తన సోదరి వద్ద వదిలి తన హీరోని చూసేందుకు గంపెడాశతో విజయ్ మీట్ ద పీపుల్ వేదిక వద్దకు వెళ్లింది. సభలో విజయ్ను కలుసుకుని, ఆయనతో సెల్ఫీ దిగాలని అనుకుంది. కానీ కొన్ని గంటల తర్వాత, బృందా కరూర్ తొక్కిసలాటలో మరణించింది. ఆ ర్యాలీలో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మంది గాయపడ్డారు.ఇక కరూర్ విజయ్ సభలో శనివారం సాయంత్రం సమయంలో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు రావడంతో బృందకు ఆమె సోదరి ఫోన్ చేస్తూనే ఉంది. అట్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదివారం ఉదయమే బృంద మరణించినట్లు తమకు సమాచారం అందినట్లు ఆమె సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు.‘నా సోదరి తన బిడ్డను నా దగ్గరే వదిలేసి విజయ్ ర్యాలీకి వెళ్తానని చెప్పింది. మేము సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేశాం. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాం.. ఆమె నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. సాయంత్రం పది గంటల తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఈ రోజు ఉదయం నా సోదరి భర్త ఆమె ఫొటోతో ప్రభుత్వ అధికారుల్ని కలిశారు. ఆ తర్వాతే కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారిలో ఆమె ఉన్నట్లు తెలిసింది.ఈ సందర్భంగా తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబానికి రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం ప్రకటించారు. ఆ మొత్తం మాకెందుకు. చనిపోయిన నా సోదరిని ఇవ్వండి చాలు అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. -
మీలాగ పారిపోలేదు: విజయ్‌కు కనిమొళి కౌంటర్
చెన్నై: తమిళనాట టీవీకే అధినేత విజయ్ చేపట్టిన నిన్నటి(శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ) కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృత్యువాత పడటం రాజకీయ ప్రకంపనలకు తెరలేపింది. అసలు తొక్కిసలాట ఘటనకు డీఎంకేనే కారణమని, పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్లే ఇదంతా జరిగిందని విజయ్ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఈ తొక్కిసలాట ఘటనపై విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పచెప్పాలని లేదా సీబీఐకి విచారణకు అప్పగించాలని విజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు విజయ్. తమిళనాడులో తొక్కిసలాటకు తమ పార్టీని బాధ్యుల్ని చేయడంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. ‘ మీ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి భారీ ప్రాణ నష్టం వాటిల్లితే మీలాగా మేము పారిపోలేదు. ప్రభుత్వం నుంచి ఏం చేయాలో అది చేశాం’ అంటూ విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత జరిగినా ఆ సమయంలో విజయ్ కనిపించకుండా పోయారని సెటైర్లు వేశారు. రాళ్లు రువ్వారు.. లాఠీచార్జ్ చేశారుకరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఉదయం తన నివాసంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న టీవీకే విజ్ఞప్తికి జస్టిస్ దండపాణి అంగీకారం తెలిపారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ.. రేపు(సోమవారం) మధురై బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం కనిపిస్తోంది.ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే కేడర్‌పై(విజయ్ మినహా) కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు కూడా. అయితే.. కుట్ర కోణం ఉందన్న నేపథ్యంలో హైకోర్టే సుమోటోగా దర్యాప్తు చేపట్టాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణకు ఆదేశించాలని పిటిషన్లో టీవీకే విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. కరెంట్ పోవడం, విజయ్‌పైకి గుర్తు తెలియని ఆగంతకులు చెప్పులు విసరడం, అదే సమయంలో తొక్కిసటాల జరగడం లాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.తమ సభలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది కూడా. అయితే.. టీవీకే ఆరోపణలను ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ వెంకట్రామన్ ఖండించారు. అనుమతిచ్చిన దానికంటే జనం అత్యధికంగా వచ్చారని, విజయ్ ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, ఆ సమయంలో పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారని, ఇప్పుడేమో పోలీసులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 10 వేల మందికే అనుమతి తీసుకున్నారని, కానీ జనం భారీ సంఖ్యలో తరలి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాట.. విజయ్‌కు భారీ షాక్? -
కరూర్ తొక్కిసలాట.. విజయ్‌కు భారీ షాక్?
చెన్నై: తమిళగ వెట్రి కగళం (టీవీకే) అధినేత విజయ్‌కు భారీ షాక్ తగిలింది. కరూర్ (TVK chief Vijay at Karur rally) విషాద ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు విజయ్ నిర్వహించే ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదివారం (సెప్టెంబర్28) సాయంత్రం 4.30 గంటలకు మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టనుందని సమాచారం. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన కరూర్ తొక్కిసలాట. శనివారం సాయంత్రం విజయ్ నిర్వహించిన సభకు హాజరై ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కొద్దిసేపటి క్రితం 40మందికి చేరింది. 100మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 48మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్యను కరూర్ జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ దుర్ఘటనలో విజయ్‌పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కరూర్ విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట కేవలం ప్రమాదం కాదని, సభ నిర్వాహాణ లోపం, సభకు హాజరైన ప్రజల ప్రాణాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు టీవీకే అధినేత ఎలాంటి రాజకీయ సభలు నిర్వహించకుండా నిషేధం విధించాలని కోరుతూ కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.సామాజిక కార్యకర్త సెంథిల్ కన్నన్ సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంథిల్ కన్నన్ తన పిటిషన్లో ‘ప్రజా భద్రత ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) అనేది అసెంబ్లీ హక్కు (సమావేశాలు నిర్వహించే హక్కు) కంటే ముఖ్యమైనది. అంటే, ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటం అత్యవసరం. అందువల్ల, టీవీకే పార్టీ భవిష్యత్‌లో నిర్వహించే ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా నిరోధించాలి’ అని కోర్టును కోరారు.విజయ్ పర్యటన రద్దుమరోవైపు వచ్చేవారం తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ తన రాజకీయ పర్యటనను రద్దు చేసుకున్నారు. కరూర్ తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు. పరామర్శ కోసం విజయ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. -
కరూర్ తొక్కిసలాట: విచారణకు సిద్ధమైన జస్టిస్ అరుణ జగదీశన్ ఎవరు?
కరూర్: కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిషన్‌ను నియమించింది. గతంలో జస్టిస్ అరుణ జగదీశన్ ఇలాంటి సున్నితమైన పలు కేసులను సమర్థవంతంగా విచారణ చేశారు. జస్టిస్ అరుణ జగదీశన్.. మద్రాస్ హైకోర్టులో రిటైర్డ్ న్యాయమూర్తి . ఆమె తమిళనాడులో పలు ఉన్నతస్థాయి విచారణ కమిషన్లకు సారధ్యం వహించారు. 2009 నుండి 2015లో పదవీ విరమణ చేసే వరకు మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఆమె విధులు నిర్వహించారు. కరూర్‌లో టీవీకె పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకూ గాయపడ్డారు. ఈ సందర్భంగా తమిళనాడు డీజీపీ వెంకటరామన్ మాట్లాడుతూ ఊహించనంత సంఖ్యలో ప్రజలు తరలిరావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. ర్యాలీ కోసం 500 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని తెలిపారు.ఈ ఘటనపై స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌తో విచారణకు ఆదేశించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతోపాటు ఆమె సహచరులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును జస్టిస్ అరుణ విచారించారు. జస్టిస్ అరుణ హైకోర్టులో పని చేస్తున్నప్పుడు ఓ కేసులో చెన్నై పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2015లో పోలీసు ఎన్కౌంటర్లో ఐదుగురు మృతిచెందారు. వారంతా బ్యాంకును దోచుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. పలువురు దీనిని నకిలీ ఎన్కౌంటర్ అని ఆరోపించారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.ఆ సమయంలో పోలీసులకు జస్టిస్ అరుణ బెంచ్ క్లీన్చిట్ ఇచ్చింది. 2018లో తమిళనాడులోని టుటికోరిన్లో స్టెర్లైట్ పరిశ్రమకు నిరసన సెగ తగిలి హింస చెలరేగింది. పోలీసులు.. నిరసన కారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను అప్పటి ప్రభుత్వం జస్టిస్ అరుణ్‌కు అప్పగించింది .ఈ నేపధ్యంలో ఓ ఐపీఎస్ అధికారితో సహా 17 మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె నేతృత్వంలోని కమిషన్ సిఫార్సు చేంది. 2002లో ఓ దళిత మహిళ కస్టోడియల్ మరణం కేసులో నూ ఆమె సంచలన తీర్పు ఇచ్చారు. బాధితురాలిపై ప్రలలో సానుభూతి ఉన్నప్పటికీ, తగిన ఆధారాలు లేకపోవడంతో దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేశారు. ఎనిమిది మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించారు. -
విజయ్ నీకే చెప్తున్నా.. కరూర్ తొక్కిసలాట ఘటనపై KA పాల్ స్ట్రాంగ్ రియాక్షన్
-
కరూర్ మృతుల కుటుంబాలకు విజయ్ ఆర్ధిక సాయం
-
రాళ్లు రువ్వారు.. లాఠీఛార్జి చేశారు.. అందుకే తొక్కిసలాట జరిగింది
కరూర్ ఘటనపై తమిళగ వెట్రి కగళం(TVK) సంచలన ఆరోపణలకు దిగింది. ర్యాలీపై రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీఛార్జి చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ మేరకు కుట్ర కోణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ మద్రాస్ హైకోర్టును ఆదివారం ఆశ్రయించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఉదయం తన నివాసంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న టీవీకే విజ్ఞప్తికి జస్టిస్ దండపాణి అంగీకారం తెలిపారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ.. రేపు(సోమవారం) మధురై బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం కనిపిస్తోంది.ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే కేడర్‌పై(విజయ్ మినహా) కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు కూడా. అయితే.. కుట్ర కోణం ఉందన్న నేపథ్యంలో హైకోర్టే సుమోటోగా దర్యాప్తు చేపట్టాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణకు ఆదేశించాలని పిటిషన్లో టీవీకే విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. కరెంట్ పోవడం, విజయ్‌పైకి గుర్తు తెలియని ఆగంతకులు చెప్పులు విసరడం, అదే సమయంలో తొక్కిసటాల జరగడం లాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమ సభలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది కూడా. అయితే.. టీవీకే ఆరోపణలను ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ వెంకట్రామన్ ఖండించారు. అనుమతిచ్చిన దానికంటే జనం అత్యధికంగా వచ్చారని, విజయ్ ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, ఆ సమయంలో పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారని, ఇప్పుడేమో పోలీసులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఇదిలా ఉంటే.. కరూర్ ర్యాలీలో విజయ్ పది రూపాయల మంత్రి అంటూ పరోక్షంగా సెంథిల్ బాలాజీని ఉద్దేశించి పాట అందుకున్నారు. ఆపై జోష్‌తో అక్కడున్నవాళ్లంతా ఆయన దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాతే పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది.ఇదిలా ఉంటే.. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు జరుపుతున్నారు. వారాంతాల్లో కీలక నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కరూర్ జిల్లా వెలుచామైపురం వద్ద జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో మరొకరు మరణించడంతో ఆ సంఖ్య 40కి చేరింది. ర్యాలీకి చాలా ఆలస్యంగా విజయ్ రాగా.. అప్పటికే తిండి, నీరు లేక నీరసించి పోయిన జనం సొమ్మసిల్లిపోవడంతో అలజడి రేగింది. ఆపై ఆంబులెన్స్ వచ్చే క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు ఎంత అదుపు చేసే ప్రయత్నం చేసినా.. పరిస్థితి చేజారిపోయింది. ఈ పరిణామంతో ర్యాలీ మధ్య నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు విజయ్. బాధితులను పరామర్శించుకుండా, మీడియాతో మాట్లాడకుండా విజయ్ వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో చెన్నైలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు విజయ్ మద్దతుదారులు.. మరోవైపు ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నిరసనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.వచ్చేవారం పర్యటన రద్దుతొక్కిసలాట ఘటన నేపథ్యంలో వచ్చేవారం నిర్వహించాల్సిన టీవీకే ర్యాలీని విజయ్ రద్దు చేసుకున్నారు. కరూర్ బాధితులను పరామర్శించేందుకు అనుమతించాలంటూ ఆయన పోలీసులకు లేఖ రాశారు. దీనిపై బదులు రావాల్సి ఉంది.ఇదీ చదవండి: జనాలు చస్తుంటే విజయ్ పారిపోయాడు! -
కరూర్ కన్నీరు.. హృదయవిదారక దృశ్యాలు
ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రాణాల కోసం పాకులాడిన యువత.. చేతులు జోడించి ప్రాణభిక్ష కోరుతూ ఆర్థించిన వృద్ధురాలు.. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడ్డ ఆవేదన.. ఆ పక్కనే పడి ఉన్న ఓ చిన్నారి మృతదేహం.. ఇవన్నీ ఇప్పుడు కరూర్ విషాదాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి. కరూర్ వెలుచామైపురం టీవీకే ర్యాలీలో ఘోర విషాదం.. 39 మందిని బలిగింది. అనుమతించిన దానికంటే రెట్టింపు సంఖ్యల్లో జనం హాజరు కావడం, వాళ్లను పోలీసులు అదుపు చేయలేకపోవడం, ఆంబులెన్స్‌లకు దారి ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీవీకే పరిహారాలు ప్రకటించాయి. న్యాయపరమైన విచారణ జరుగుతోంది. అదే సమయంలో.. ఈ ఘటనకు సంబంధించిన ఘటన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చెల్లా చెదురైన చెప్పులు, టీవీకే జెండాలు అక్కడి పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతున్నాయి. పరామర్శకు వచ్చిన నేతలకు తన రెండేళ్ల బిడ్డ విగతజీవిగా మారిందని చూపిస్తూ ఓ తండ్రి పెట్టిన రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.So disturbing! Heart-breaking! 😢We need to get out of the hero-worshipping mentality. No celebrity is worth risking a life. #KarurStampede#VijayRally pic.twitter.com/FAlgDjKUkG— Satish Acharya (@satishacharya) September 28, 2025த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025உரிய பாதுகாப்பு வழங்கப்பட்டதாக தெரியவில்லை - Karur People !#TVK #JanaNayagan #KarurStampede pic.twitter.com/VkTqbB5mU5— MAHI (@MahilMass) September 28, 2025#KarurStampede 🚨 Heartbreaking Tragedy in Tamil Nadu 🚨What was meant to be a moment of hope and celebration at #TvkVijay’s rally in Karur has turned into an unimaginable nightmare.💔 31 innocent lives lost in a stampede-like situation.💔 Families who came with joy have… pic.twitter.com/y9cl6hW4RT— Akash (@AdvAkashji) September 27, 2025மீளமுடியாத துயர் 💔#JusticeForKarurRally #Karur #KarurStampedepic.twitter.com/bjvyACOnqS— Prakash (@prakashpins) September 28, 2025#KarurStampede #TVKVijayStampede #Karurpic.twitter.com/9BpJWtY2u3— Manoj Trichy (@manoj4trichy) September 28, 2025#KarurStampede#கொலைகாரன்_விஜய் pic.twitter.com/JRpXLGqDVL— த.சந்தோஷ்குமார் (@MKPSandy) September 28, 2025 -
కరూర్ తొక్కిసలాట మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి
తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారి శోకం వర్ణనానీతం. విగతజీవులుగా మారిన తమ బిడ్డలను చూసి కన్నీరమున్నీరుగా విలవిస్తున్న దృశ్యాలు ఎవరికైనా కంట తడిపెట్టించక మానవు. ఈ క్రమంలో గుండె పగిలే మరోహదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కరూర్ తొక్కిసలాటల కాబోయే జంట కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. హీరో విజయ్ ఫ్యాన్‌గా భావిస్తున్న ఆకాశ్ (24) మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఉంది. కానీ అంతలోనే అనంత లోకాలకు చేరాడు. ఆకాశ్ కు ఇటీవల గోకులశ్రీ ( 24)తో ఇటివల ఎంగేజ్మెంట్ అయింది. త్వరలో ఇద్దరికీ వివాహం జరగనుంది. ఆకాశ్ తన కాబోయే భార్యతో కలిసి గోకులశ్రీ ఎంతో ఉత్సాహంగాతన అభిమాన హీరో సభకు వెళ్లాడు. కానీ విధి మరోలా ఉంది. శనివారం విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభ, అక్కడ జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని ఆకాశ్, గోకులశ్రీ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.ఈ ఘోరం ప్రమాదం విజయ్ Xలో స్పందించారు: “నా హృదయం ముక్కలైంది, నేను భరించలేని, వివరించలేని బాధ దుఃఖంలో ఉన్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. టీవీకే తరఫున మృతులకు రూ.20 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.2లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ విషాదంపై తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి సాధ్యమైన అన్ని వైద్య సహాయం అందించాలని ఆదేశించారు, తొక్కిసలాటపై విచారణ కమిషన్‌ను ఆదేశించారు.A woman lost her 5-year-old child in the Karur tragedy. Disturbing video shows her crying inconsolably. #Karur #KarurVijaySpeech #KarurTragedy https://t.co/YRskL4GoDr pic.twitter.com/cVOLJcN4cX— Vani Mehrotra (@vani_mehrotra) September 28, 2025 > కాగా కాగా తమిళ హీరో విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది ఆహారం లేదా నీరు లేకుండా ఎండలో గంటల తరబడి వేచి ఉండటంతో ఉద్రిక్తత్తకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో 39 మంది చనిపోగా, మరో కొంతమంది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
నా గుండె వణికిపోయింది.. కరూర్ ఘటనపై 'కమల్, రజనీ' రియాక్షన్
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రచార ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ అంశం గురించి సినీ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా.. 60 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ మాట్లాడుతున్న సమయంలో ఆభిమానులు ఒక్కసారిగా ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతోనే తొక్కిసలాట జరిగినట్లు విచారణలో తేలింది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు రావాల్సిన విజయ్ పలు కారణాల వల్ల రాలేకపోయారు. సుమారు ఆరు గంటలు ఆలస్యంగా కరూర్‌కు ఆయన చేరుకున్నాడు. దీంతో ఎవరూ ఊహించిన విధంగా జనాలు గుమికూడారు. ఇలా అనేక కారణాల వల్ల ఈ తొక్కిసలాట జరిగింది.విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట గురించి రాజ్యసభ సభ్యులు, నటుడు కమల్ హాసన్ ఇలా స్పందించారు 'కరూర్‌లో ఇంతమంది చనిపోయారని తెలిశాక నా గుండె వణికిపోయింది. అక్కడి నుండి వస్తున్న వార్తలు తెలుసుకుంటుంటే షాక్ అవుతున్నాను. అవన్నీ నాలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. తొక్కిసలాటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు సానుభూతి చెప్పేందుకు కూడా నాకు మాటలు రావడం లేదు. గాయాలతో చికిత్స పొందుతున్న వారికి సరైన సహాయం అందేలా ప్రభుత్వమే చూడాలి. మరణించిన వారి కుటుంబ సభ్యలను తమిళనాడు ప్రభుత్వం ఆదుకోవాలి.' అని ఆయన కోరారు.'కరూర్ సంఘటనలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త నా హృదయాన్ని కలచివేసింది. నాకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో భగవంతుడు అండగా నిలివాలని కోరుతున్నాను.' - రజనీకాంత్'ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ భర్తి చేయలేని నష్టాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.' -చిరంజీవి -
10 లక్షల ఎక్స్ గ్రేషియా.. కరూర్ తొక్కిసలాటలో 40 మంది మృతి, 50 మందికి సీరియస్
-
‘కరూర్ తొక్కిసలాట’ ఘటనపై స్పందించిన చిరంజీవి!
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకోవడం చాలా విషాదకరం, ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.కాగా,తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్(Vijay ) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 39 మంది మరణించారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10 మంది వరకు చిన్నపిల్లలు, 16 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.Deeply saddened by the tragic stampede at the rally in Karur, Tamil Nadu. My sincere condolences to the families who are living through this unbearable loss. I wish them strength in this difficult time and pray for the speedy recovery of those injured.Om Shanti 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
తమిళనాడు తొక్కిసలాట ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి
-
కోర్టు మొట్టికాయలేసినా.. కరూర్ విషాదం!
కరూర్ వెలుచామైపురం తొక్కిసలాట ఘటన ఇప్పటికే 39 మంది మరణించగా.. 95 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. అయితే 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు బాధ్యుడైన టీవీకే అధినేత విజయ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ అన్ని పార్టీల వైపు నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ దరిమిలా.. రాజకీయ పార్టీల బహిరంగ సభలపై ఈ మధ్యే తమిళనాడు ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకే లక్ష్యంగా.. తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ప్రచార సభలను సెప్టెంబర్ 13, 2025న తిరుచ్చిలో ప్రారంభించారు. అయితే తమ సభలకు, ర్యాలీలకు డీఎంకే ప్రభుత్వం అడ్డం పడుతోందని ఆరోపిస్తూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ పిటిషన్‌పై సెప్టెంబర్ 18వ తేదీన మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి.‘‘తిరుచ్చిలో మా పార్టీ ప్రచార సభ అనుమతి కోరుతూ సీపీ ఆనంద్‌కు మా పార్టీ జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ రిక్వెస్ట్ చేశారు. అయితే అనుమతులు ఇచ్చినప్పటికీ.. 23 కఠిన నిబంధనలు విధించారు. గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు సభకు రాకూడదని చెబుతూ అందులో పేర్కొన్నారు. దీనిని అమలు చేయడం కష్టం. ఇది అన్యాయం. ఇతర పార్టీలకు సులభంగా ఇస్తున్న పోలీసులు.. టీవీకే విషయంలోనే పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు’’ అని టీవీకే వాదించింది. దీంతో కోర్టు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర హోం కార్యదర్శిని విచారణలో భాగంగా పిలిపించుకుంది. అయితే.. టీవీకే సభలకు అనుమతికి మించి జనాలు వస్తున్నారని, తిరుచ్చి ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆస్తికి నష్టం కలిగించారంటూ పోలీసులు ఫొటో ఆధారాలను సమర్పించారు. దీంతో జస్టిస్ సతీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు, ప్రజా ఆస్తులకు పార్టీలే బాధ్యత వహించాలి, గర్భిణులు, వికలాంగులు, వృద్ధులు సభలకు రాకుండా నేతలే సూచించాలి. ఇక నుంచి తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు నిర్వహించాలంటే ఒక నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. సభల సమయంలో ప్రజా/ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగితే, ఆ డిపాజిట్‌ను పరిహారంగా ఉపయోగించాలి. అలాగే.. పోలీసు యంత్రాగం కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధమైన, చట్టబద్ధమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. సభలకు అనుమతులు ఇవ్వడంలో వివక్ష ఉండకూడదు’’ అని ఇటు ప్రభుత్వానికి, అటు టీవీకేకు మొట్టికాయలు మద్రాస్ హైకోర్టు వేసింది. ఈ క్రమంలో టీవీకేకు స్వల్ప ఊరట ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కోర్టు సూచన మేరకు సెప్టెంబర్ 24వ తేదీనే తమిళనాడు ప్రభుత్వం పొలిటికల్ ర్యాలీల మార్గదర్శకాలను సమర్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ గడువు కోరడంతో తదుపరి విచారణ వాయిదా పడింది. మధ్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీల సభలపై ఆందోళనలు వ్యక్తం చేసిన కొన్ని రోజులకే కరూర్ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాణాలు పోతుంటే.. పారిపోయావా విజయ్? -
నా హృదయం ముక్కలైంది.. కరూర్ ఘటనపై విజయ్ పోస్ట్
-
కరూర్ ఘటన.. టీవీకే సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 39 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది.కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే స్పందిస్తూ..‘తొక్కిసలాట ఘటనకు కారణంగా స్టాలిన్ ప్రభుత్వమే. మేము అడిగిన ప్రాంతంలో కాకుండా.. చిన్నపాటి రోడ్డులో సభకు అనుమతి ఇచ్చారు. సభ జరుగుతున్న సమయంలో అంబులెన్స్‌లు అటుగా వచ్చేలా డీఎంకే ప్లాన్ చేసింది. ఈ క్రమంలో అంబులెన్స్ కోసం దారి ఇవ్వాలని విజయ్ కోరడంతో తొక్కిసలా జరిగింది. పోలీసులతో కలిసి డీఎంకే ప్రభుత్వం విజయ్‌పై కుట్ర చేసింది అని ఆరోపించింది. మరోవైపు.. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం అంటూ టీవీకే పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.He shamelessly ignored people literally dying around him and continued with this nonsense on mic.There are times when you have to stop and think what kind of demons and narcissistic animals are made Gods by us...💔#Karur #KarurStampede pic.twitter.com/10lngolUI8— Namita Balyan (@NamitaBalyan) September 27, 2025డీజీపీ కీలక వ్యాఖ్యలు..ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తమిళనాడు లా అండ్ ఆర్డర్ డీజీపీ వెంకట్రామన్ అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..‘టీవీకే పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. కరూర్‌లో జరిగినది చాలా విషాదకరమైన ఘటన. వీరిలో 13 మంది పురుషులు, 16 మంది మహిళలు, ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ నాయకత్వంలో ముగ్గురు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలతో సహా 2000 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు.விஜயிடம் பேசிய போலீஸ் குறிப்பிட்ட நேரத்திற்கு செல்லாத விஜய்க்கு காவல்துறையினர் தொடர்புகொண்டு பேசியிருக்கின்றனர்.கூட்டம் அதிக அளவில் இருக்கிறது என்பதையும் தெரியப்படுத்தி,ஒத்துழைப்பு தருமாறு அறிவுறுத்தியுள்ளனர்.அதனால்தான் விஜய் காவல்துறைக்கு நன்றி சொல்லி பேசினார். #karur pic.twitter.com/6BbXGxc2Jp— Gokula Kannan R 👑 (@rg_kannan_dmk61) September 27, 2025తమిళనాడు టీవీకే పార్టీ గతంలో నిర్వహించిన సమావేశాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో, వారి అభ్యర్థన మేరకు ఇప్పుడు కరూర్‌లో పెద్ద స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర స్థాయిలో అదే స్థలంలో ఒక పెద్ద పార్టీ ప్రచారం చేసింది. పది వేల మంది వస్తారని భావించినప్పటికీ, 27 వేల మంది గుమిగూడారు. విజయ్ ప్రచారం చేసిన ప్రదేశంలో 500 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి కోరారు. కానీ, ఉదయం 11 గంటల నుండి గుమిగూడిన జనసమూహం రాత్రి 7:40 గంటలకు వస్తూనే ఉన్నారు. విజయ్ వస్తున్నారనే వార్తతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 27వేల మందికిపైగా ఉన్న సమూహాన్ని పోలీసులు కంట్రోల్ చేశారు. సభ జరుగుతున్న సమయంలో పోలీసులకు విజయ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం లేదు. కానీ, దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. దీనికి సంబంధించి కారణాల కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఏమీ మాట్లాడలేం. అయితే, ఈ ఘటనకు పోలీసులే కారణమా? అని మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు.ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందించారు. కరూర్ జిల్లా కలెక్టరుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను ఆదివారం ముఖ్యమంత్రి పరామర్శించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. -
TVK Vijay: మొన్న మధురై.. నిన్న కరూర్
తమిళనాడు కరూర్ తొక్కిసలాట(Karur Stampede) ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభకు హాజరై.. 39 మంది మృతి చెందడం, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడడం.. ఇటు రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు తొక్కిసలాట జరిగిన తర్వాత వెంటనే విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం మరింత ఆగ్రహావేశాలకు కారణమౌతోంది.. కరూర్‌లో విజయ్ బహిరంగ సభకు(Vijay Meeting) కేవలం 10 వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే.. అంతకు రెండు రెట్లు పైనే జనాలు వచ్చారు. దీనికి తోడు అనుకున్న సమయం కంటే ఆరు గంటలు ఆలస్యంగా విజయ్ సభకు వచ్చారు. దీంతో ఆ రద్దీ మరింత ఎక్కువైంది. అప్పటికే అక్కడ గుమిగూడిన జనాల్లో చాలామంది నీరు, తిండి లేకపోవడంతో నీరసంగానే ఎదురు చూస్తూ ఉండసాగారు. ఈలోపు సాయంత్రం 7.30-7.45 సమయంలో విజయ్ ప్రచార రథం రావడం.. ఆ రోడ్డు ఇరుకుగా ఉండడంతో.. ఆ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో జనాలు వెనక్కి పోవడం, జనాల్లో కొందరు ఆయన్ని దగ్గరి నుంచి చూడాలనే కుతూహలంతో తోసుకున్నారు. ఈ తోపులాటలో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసింది. ఆ అలజడిని గమనించిన విజయ్.. ‘‘పోలీస్.. ప్లీజ్ హెల్ప్, ఆంబులెన్స్’’ అంటూనే వాహనంపై ఉన్న వాటర్ బాటిళ్లను జనాల్లోకి విసిరారు. అయితే తొక్కిసలాట జరుగుతున్న గందరగోళ పరిస్థితుల నడుమే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ టీవీకే వలంటీర్లు తక్కువగా ఉండడం, ఆంబులెన్స్‌లకు దారి లేకపోవడంతో సకాలంలో ప్రాణాలు కాపాడలేకపోయారని తెలుస్తోంది. த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025కరూర్ తొక్కిసలాట ఘటనను.. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా అభివర్ణిస్తున్నారు. 39 మంది మృతుల్లో.. పది మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం గమనార్హం. 95 మందిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో 58 మంది ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రాష్ట్రపతి, దేశ ప్రధాని.. ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మీడియాకు నో అనుమతిఇదిలా ఉంటే.. విజయ్ ఆలస్యంగా రావడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఘటన తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. త్రిచీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి, అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరారు. దీంతో బాధితులను పరామర్శించకుండా, మీడియాను ఎదుర్కొనకుండా.. బాధ్యతల నుంచి విజయ్ తప్పించుకున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. திடீரென மயங்கிய தொண்டர்”என்ன ஆச்சு..என்ன ஆச்சு” பதறி BOTTLE-ஐ எறிந்த விஜய் #vijayspeech #tvk #vijay #karur #mkstalin #abpnadu pic.twitter.com/0BRXYch0LM— ABP Nadu (@abpnadu) September 27, 2025#WATCH | Karur, Tamil Nadu | Visuals from the spot where a stampede occurred yesterday, during a public event of TVK (Tamilaga Vettri Kazhagam) chief and actor Vijay. As per CM MK Stalin, so far, 39 people have lost their lives in the incident. pic.twitter.com/hswWaa9ljq— TIMES NOW (@TimesNow) September 28, 2025మరోవైపు చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద కూడా మీడియాను అనుమతించడం లేదు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దళపతి మద్దతుదారులు అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ హల్ చల్ చేస్తున్నారు. ఇటు గుండె బద్దలైందంటూ.. క్షతగాత్రులు కోవాలంటూ కేవలం ట్వీట్‌తో విజయ్ సరిపెట్టడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. టీవీకే పార్టీ ప్రతినిధి రంజనా నాచియార్ మాట్లాడుతూ.. విజయ్ ఆస్పత్రికి వెళ్లి ఉంటే అక్కడా పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యేదని, అందుకే వెళ్లలేకపోయారని అన్నారు. తప్పంతా తమిళనాడు ప్రభుత్వం, పోలీసులదేనని ఆ పార్టీ అంటోంది.మధురై మానాడులోనూ..విజయ్ మొన్నీమధ్యే మధురైలో నిర్వహించిన టీవీకే రెండో మానాడులోనూ దాదాపు తొక్కిసలాట జరిగినంత పనైంది. ఆగస్టు 21న మధురై-తూత్తుకుడి హైవే వద్ద జరిగిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరగ్గా.. సుమారు 4,00,000 పైగా జనం హాజరయ్యారు. సభకు భారీగా జనాలు రావడం, మంచి నీళ్లు లేక అవస్థలు పడడం, ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని కింద పడిపోయారు. ఈ ఘటనలో సుమారు 400 మంది ఊపిరాడక అస్వస్థతకు గురైనట్లు ఆ సమయంలో పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు ఈ మానాడు ఏర్పాట్ల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు కూడా. అయితే ఈ అనుభవాల నుంచి కూడా టీవీకే కరూర్‌లో క్రౌడ్మేనేజ్మెంట్ను సరిగ్గా చేసుకోలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. VIDEO | Karur: Tamil Nadu CM M K Stalin paid tributes to the victims of the Karur stampede and visited the hospital to meet those injured.Thirty-nine people, including eight children, lost their lives in the incident.#Karur #TamilNadu #MKStalin(Full video available on PTI… pic.twitter.com/Z0jdrliuTz— Press Trust of India (@PTI_News) September 28, 2025విజయ్ను అరెస్ట్ చేయాల్సిందే!క్షతగాత్రుల్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎక్స్‌లోనూ ఈ విషయాన్ని ట్వీట్ చేశారాయన. మరోవైపు.. ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని హోం మంత్రి అమిత్ షా కోరారు. కరూర్ టీవీకే కార్యదర్శిపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యూడీషియల్ కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని సీఎం స్టాలిన్ తెలిపారు. విజయ్ను అరెస్ట్ చేయాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే టీవీకే మాత్రం ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది. -
తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వ హించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పో యారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మహిళలు ఉన్నారు. వీరు కాకుండా 45 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసుల భద్ర తా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా క్ష త గాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు భారీ స్థాయిలో వైద్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రుల కు లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై విచార ణకు రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ఏకసభ్య కమిషన్ ఏర్పా టు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాల యంలో సమీక్ష అనంతరం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడానికి అర్ధరాత్రి ఘటనా స్థలికి సీఎం స్టాలిన్ బయలుదేరా రు. ఈ దుర్ఘటనపై 24 గంటల్లో నివేదికను సమ ర్పించాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సభాస్థలికి ఏడు గంటల ఆలస్యంగా..సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పేరిట గత ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఈ నెల 13వ తేదీ నుంచి మీట్ ది పీపుల్ పేరుతో ప్రచార సభ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పర్యటన చేస్తున్నారు. ఇందులో అధికార డీఎంకేను తీవ్రంగా విజయ్ టార్గెట్ చేస్తున్నా రు. అలాగే బీజేపీని ఫాసిస్టులు అంటూ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం నామక్కల్‌లో ఆయన పర్యటించారు. ఇక్కడి కేఎస్ థియేటర్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు కరూర్ నగరంలోని వేలు స్వా మి పురం సభాస్థలికి చేరుకున్నారు. దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి పదుల సంఖ్యలో వాటర్ బాటిళ్లను విజయ్ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. విజయ్ వెళ్లిన కొదిసేపటికే...విజయ్ వెళ్లిన కాసేపట్లోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇరుకైన రోడ్లతో కూడిన ప్రాంతం, పరిసరాలు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో జనం తల్లడిల్లారు. జనం రద్దీ ఒక్క సారిగా పెరగడంతో తోపులాట, తొక్కిస లాటతో అక్కడి వాతావరణం తీవ్ర ఉత్కంఠ భరితంగా మారింది. ఊపిరి ఆడక పోవడంతో సొమ్మ సిల్లే వారి సంఖ్య పెరిగింది. క్షణాలలో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు అక్క డికి చేరుకున్నాయి. అస్వస్థతకు గురైన వారందర్నీ ఆస్ప త్రులకు తరలించారు. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు నిమి షాల వ్యవధిలో బాధితులతో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకు న్నాయి. ఒక్కో అంబులెన్స్‌లో ఇద్దరు, ముగ్గుర్ని తీసు కొచ్చారు. ఒకే స్ట్రక్చర్‌లో ఇద్దరి లోనికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి కొందరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 45 మంది చికిత్సలో ఉండగా, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. మిన్నంటిన రోదనలుప్రచార సభకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో పలు కుటుంబాలు తీవ్రంగా రోదిస్తూ ఆస్పత్రులకు పరుగులు తీశాయి. ఆస్పత్రి మార్చురీ పరిసరాలు ఆప్తులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. పరిస్థితి దారుణంగా మారడంతో నామక్కల్, తిరుచ్చి జిల్లాల నుంచి వైద్య బృందాలు హుటా హుటిన కరూర్‌కు చేరుకున్నాయి. కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేల్, ఎమ్మెల్యే , మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను తక్షణ చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ పరిస్థితి తక్షణ సమీక్షకు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్, ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్‌ను కరూర్‌కు పంపించారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఉన్న వారందరికీ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఇక, సీఎం స్టాలిన్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సచివాలయానికి చేరుకుని కరూర్ పరిస్థితిపై సమీక్షించారు. అటు తర్వాత అర్ధరాత్రి ఘటనా స్థలికి బయలుదేరారు. అంబులెన్స్‌తో గందరగోళం..కాగా సభా సమయంలో విజయ్ పార్టీ వర్గాలు అటుగా వచ్చిన ఒక అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా, డ్రైవర్ పైదాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి చేజారినట్లు సమాచారం. పోలీసుల ముందస్తు భద్రతా చర్యలలో వైపల్యాలపై విమర్శలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషణ్ణ వదనంతో వెళ్లిపోయిన విజయ్..కాగా, ఈ ప్రమాద ఘటనపై తిరుచ్చి విమానాశ్రయంలో విజయ్ను మీడియా ప్రశ్నించడంతో, ఆయన మౌనంగా విషణ్ణ వదనంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసులు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే.. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. పోలీసులు వీటికి తగినంత భద్రత కల్పించాల్సి ఉంది. అప్పుడే తొక్కిసలాటలను నివారించొచ్చు. కానీ పోలీసులు విజయ్ సభకు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే తాజా దుర్ఘటన జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. విజయ్ అభిమానులు సైతం ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపడుతున్నారు. తగినంత మంది పోలీసులను కేటాయించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. విజయ్ ప్రచార సభ కోసం కరూర్‌లో సభాస్థలిని పోలీసులే ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. విజయ్‌పార్టీ వర్గాలు మరో ప్రదేశాన్ని కోరితే, చివరకు పోలీసులు ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇరుకైన రోడ్లతో కూడిన ఈ ప్రాంతంలో వేలాది మంది చేరడమే ఘటనకు దారితీసినట్లు విమర్శలు వస్తున్నాయి. -
తొక్కిసలాట ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయ్
తమిళనాడు: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు.నా హృదయం ముక్కలైంది; చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంలో నేను విలవిలలాడుతున్నాను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ విజయ్ తన ట్వీట్‌ను ముగించారు. -
విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు. -
విజయ్ సభలో తొక్కిసలాట ఘటన.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న మోదీ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. The unfortunate incident during a political rally in Karur, Tamil Nadu, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. Wishing strength to them in this difficult time. Praying for a swift recovery to all those injured.— Narendra Modi (@narendramodi) September 27, 2025 తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్‌తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారు. కాగా, విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్‌లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్న విజయ్ సభకు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. -
టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. 38 మంది మృతి
కరూర్(తమిళనాడు): కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో విజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్‌లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10 వేల మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నారు. ర్యాలీకి ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. పరిమితికి మించి జనం రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గతంలో మధురై తొలి సభలోనూ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్‌తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారుకాగా, మీట్ ది పీపుల్ నినాదంతో విజయ్ చేపట్టిన ప్రచార యాత్ర గురించి తెలిసిందే. ప్రతి శనివారం ఆయన రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇవాళ (శనివారం, సెప్టెంబర్ 27) నామక్కల్, కరూర్‌లలో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే, విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం వివాదానికి దారి తీసింది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు, ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా? అన్న చర్చ జరిగింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పర్యటన ఖరారైంది. కరూర్‌లో వేలుస్వామి పురంలో ప్రచార బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు.విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు.


