kasam venkateswarlu
-
‘రేవంత్.. నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా?’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణలో నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. అలాగే, రేవంత్‌కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా అని కామెంట్స్ చేశారు.కాగా, కాసం వెంకటేశ్వర్లు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడపల్లి లైబ్రరీలో మోకాళ్ల మీద నిలబడి నిరుద్యోగుల ఓట్లు అడిగారు. రేవంత్‌కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా?. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ఏటా 3 నుంచి 5 శాతం ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు.1970 నుంచి అమలులో ఉన్న పోస్టులనే భర్తీ చేస్తున్నారు. అంతే తప్ప కొత్త పోస్టులు పెంచడం లేదు. రేవంత్.. నీకు నిర్యోగులతో చర్చించే దమ్ము లేదా?. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. రేవంత్ ముందస్తు హౌస్ అరెస్టులు చేసి కేసీఆర్ కంటే డబుల్ తప్పులు చేస్తున్నారు. నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చేపించలేదా?. తమ గోడు వివరించేందుకు నిరుద్యోగులు సెక్రటేరియట్‌కు వెళ్తే వారిని అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడమేంటి?గతంలో హౌస్ అరెస్టుల మీద మాట్లాడిన సెల్ఫ్ డిక్లరేషన్ మేధావులు కోదండరాం, ఆకునూరి మురళీ, హరగోపాల్ ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రభుత్వ తాయిలలకు ఏమైనా లొంగిపోయారా?. యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి లేదు. అక్కడ కొత్త వారిని ఎవరిని రానివ్వడం లేదు. రేవంత్ ఎప్పుడైనా యూనివర్సిటీలో చదువుకుని ఉంటే ఆయనకు తెలిసేది. ఆయన ఎక్కడ చదివాడో ఏమీ చదివాడో ఎవరికి తెలియదు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఉంటున్నారు. ఇదేమైనా పోలీస్ పాలనా?. కేసీఆర్ దొంగ అయితే రేవంత్ గజ దొంగ’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి అంతం
ఆత్మకూరు(ఎం),న్యూస్‌లైన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి తావులేని పరిపాలన అందిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేం ద్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీని అధికారంలోకి తెవడానికి, నరేంద్రమోడీని ప్రధానిని చేయడానికి దేశ ప్రజ లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 24 గంటల కరెంట్‌ను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుతగులుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా పార్లమెంట్‌ను సమావేశ పరిచి తెలంగాణ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా సివిల్ సప్లై రాష్ట్ర సెల్ కన్వీనర్ దూదిపాల విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిని కింది స్థాయి నుంచే అంతమొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం కిసాన్ మోర్చా సంచులను పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు బొబ్బల ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రైతు రక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బొట్టు అబ్బయ్య, పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ తుమ్మల మురళీదర్‌రెడ్డి, నాయకులుగజరాజు కాశీనాథ్, జంపాల శ్రీనివాస్, బండారు సత్యనారాయణ, లోడి వెంకటయ్య, నాగం సత్తిరెడ్డి పాల్గొన్నారు.