‘రేవంత్‌.. నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా?’ | BJP Kasam Venkateshwarlu Serious Comments On CM Revanth | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌.. నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా?’

Published Mon, Jul 15 2024 3:00 PM | Last Updated on Mon, Jul 15 2024 3:05 PM

BJP Kasam Venkateshwarlu Serious Comments On CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణలో నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. అలాగే, రేవంత్‌కు జాబ్‌ క్యాలెండర్‌ దొరకలేదా అని కామెంట్స్‌ చేశారు.

కాగా, కాసం వెంకటేశ్వర్లు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడపల్లి లైబ్రరీలో మోకాళ్ల మీద నిలబడి నిరుద్యోగుల ఓట్లు అడిగారు. రేవంత్‌కు జాబ్‌ క్యాలెండర్‌ దొరకలేదా?. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్‌ చేస్తున్నారు. ఏటా 3 నుంచి 5 శాతం ఉద్యోగులు రిటైర్డ్‌ అవుతున్నారు. ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు.

1970 నుంచి అమలులో ఉన్న పోస్టులనే భర్తీ చేస్తున్నారు. అంతే తప్ప కొత్త పోస్టులు పెంచడం లేదు. రేవంత్‌.. నీకు నిర్యోగులతో చర్చించే దమ్ము లేదా?. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులతో  అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. రేవంత్ ముందస్తు హౌస్ అరెస్టులు చేసి కేసీఆర్‌ కంటే డబుల్‌ తప్పులు చేస్తున్నారు. నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చేపించలేదా?. తమ గోడు వివరించేందుకు నిరుద్యోగులు సెక్రటేరియట్‌కు వెళ్తే వారిని అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడమేంటి?

గతంలో హౌస్ అరెస్టుల మీద మాట్లాడిన సెల్ఫ్ డిక్లరేషన్ మేధావులు కోదండరాం, ఆకునూరి మురళీ, హరగోపాల్ ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రభుత్వ తాయిలలకు ఏమైనా లొంగిపోయారా?. యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి లేదు. అక్కడ కొత్త వారిని ఎవరిని రానివ్వడం లేదు. రేవంత్ ఎప్పుడైనా యూనివర్సిటీలో చదువుకుని ఉంటే ఆయనకు తెలిసేది. ఆయన ఎక్కడ చదివాడో ఏమీ చదివాడో ఎవరికి తెలియదు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఉంటున్నారు. ఇదేమైనా పోలీస్ పాలనా?. కేసీఆర్‌ దొంగ అయితే రేవంత్‌ గజ దొంగ’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement