ఆత్మకూరు(ఎం),న్యూస్‌లైన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి తావులేని పరిపాలన అందిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేం ద్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీని అధికారంలోకి తెవడానికి, నరేంద్రమోడీని ప్రధానిని చేయడానికి దేశ ప్రజ లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 24 గంటల కరెంట్‌ను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుతగులుతున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా పార్లమెంట్‌ను సమావేశ పరిచి తెలంగాణ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా సివిల్ సప్లై రాష్ట్ర సెల్ కన్వీనర్ దూదిపాల విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిని కింది స్థాయి నుంచే అంతమొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం కిసాన్ మోర్చా సంచులను పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు బొబ్బల ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రైతు రక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బొట్టు అబ్బయ్య, పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ తుమ్మల మురళీదర్‌రెడ్డి, నాయకులుగజరాజు కాశీనాథ్, జంపాల శ్రీనివాస్, బండారు సత్యనారాయణ, లోడి వెంకటయ్య, నాగం సత్తిరెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి అంతం
Published Wed, Jan 1 2014 3:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement