Kashi Yatra
-
కాశీ యాత్రకు ‘రైలు’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లిరావాలని చాలా మంది పెద్దల కోరిక. అంతదూరం ప్రయాణించాల్సి రావడంతో.. కాశీకి వెళితే కాటికి వెళ్లినట్టే అన్న సామెత కూడా పుట్టింది. ఇప్పుడు ఇంతగా ప్రయాణ సౌకర్యాలు పెరిగినా మన రాష్ట్రవాసులకు మాత్రం కాశీ యాత్ర కష్టాలు మాత్రం తప్పడం లేదు. అంత దూరం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించలేక, విమాన ప్రయాణ ఖర్చులు భరించలేక.. రైళ్లను ఆశ్రయించే భక్తులు తిప్పలు పడుతున్నారు. రెండు నెలల ముందు రిజర్వేషన్ కోసం బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టే ఉంటూ.. సగం మందికి కూడా సీట్లు మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు. హైదరాబాద్ నుంచి రోజూ ఒక్క రైలు మాత్రమే ఉండటం దీనికి కారణం. అంతేకాదు కాశీ వెళ్లే భక్తులతోపాటు ఉత్తరాదికి వెళ్లే ఇతర ప్రయాణికులూ ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. దీనితో భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకుని మళ్లీ టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్ ఉన్నా రైలు లేదు కాశీ విశ్వనాధుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగు వారే ఎక్కువ. నిత్యం రెండు వేల మంది వరకు కాశీకి వెళతారని ఒక అంచనా అందులో రైలు ద్వారా వెళ్లేవారు వెయ్యి మందికిపైగా ఉండగా.. మిగతా వారు రోడ్డు మార్గంలో, అతికొద్ది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నట్టు చెబుతున్నారు. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఆధారం. బిహార్ నుంచి వచ్చి, తిరిగి వెళ్లే కూలీలకూ ఈ రైలే దిక్కు. అయితే ప్రయాణికుల డిమాండ్, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ఆయా మార్గాల్లో క్లోన్ రైళ్లను నడిపేది. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో మరో రైలును అదనంగా నడిపేది. దానితో కొంత వరకు వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు అవకాశం దక్కేది. ఇలా సికింద్రాబాద్–దానాపూర్ మధ్య ఓ క్లోన్ రైలును నడిపేవారు. కానీ కరోనా ఆంక్షల సమయంలో నిలిపివేసిన ఆ రైలును మళ్లీ పునరుద్ధరించలేదు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం స్వయంగా రైల్వే బోర్డును కోరినా స్పందన రాలేదు. రైల్వే స్పందించి అదనపు రైలు వేయాలని, లేదా క్లోన్ రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: వందే భారత్ రైలు.. హైదరాబాద్ ట్రాక్‌లపై నడిచేనా! -
కాశీ యాత్రికులను వెనక్కు తీసుకొస్తాం
సాక్షి, నెల్లూరు : కాశీలో చిక్కుకున్న నెల్లూరు యాత్రికులను వెనక్కు తీసుకు వస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి అధికారులతో ఎస్పీ భాస్కర్ మాట్లాడుతున్నారని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడిలో అధికార యంత్రాగం అద్భుతంగా పని చేస్తోందన్నారు. అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి తన మూడు నెలల జీతాన్ని సాయంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా, నెల్లూరు నుంచి తీర్థయాత్రల కోసం కాశీ వెళ్లిన నెల్లూరీయులు.. లాక్డౌన్లో చిక్కుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చిన్న బజార్‌కు చెందిన వారు 15 రోజుల క్రితం ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. కాశీలో శ్రీ విశ్వనాథుని దర్శనం తర్వాత నెల్లూరుకు తిరిగి రావాల్సి ఉంది. తిరుగు ప్రయాణం కోసం రైల్ టికెట్స్ రిజర్వ్ చేయించుకున్నారు. లాక్ డౌన్ వల్ల రైళ్లు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు. ప్రస్తుతం మరో 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో తమను ఆడుకోవాలని కోరుతున్నారు. -
కాశీ యాత్రికులకు కరోనా పరీక్షలు
తూర్పుగోదావరి,కరప: కాశీ యాత్రకు వెళ్లిన కరప మండలంలోని భక్తులు ఆదివారం తిరిగి రావడంతో.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలతో అధికారులు, వైద్యులు వారికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. స్థానిక పీహెచ్సీలో వారిని పరీక్షించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపి ఇళ్లకు పంపేశారు. వారిలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేకపోవడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు వారాల పాటు కాశీ యాత్ర నుంచి వారిని రోజూ పరీక్షించి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని మండల వైద్యాధికారి ఆర్.శ్రీనివాస్ నాయక్, వేళంగి పీహెచ్సీ డాక్టర్ జి.వీరయ్య తెలిపారు. కరప, పేపకాయలపాలెం, కోరుపల్లి తదితర గ్రామాల చెందిన వారు, ఇతర మండలాలకు చెందిన వారి బంధువులు 71 మంది ఈ నెల 13న కాశీ యాత్రకు బయలుదేరి వెళ్లారు. పూరి, గయ, ప్రయాగ, వారణాసి, త్రివేణి సంగమం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ వచ్చారు. అక్కడి నుంచి 30 మంది ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రకారం రామేశ్వరం వెళ్లాల్సి ఉంది. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకు, జనతా కర్ఫ్యూ నేపథ్యంలో, వారు విజయవాడ నుంచి రైలులో సామర్లకోట చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కన్నబాబు శనివారం నుంచి అధికారులను, వైద్యులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. కరప పీహెచ్సీలో వైద్య పరీక్షలు కాశీ యాత్రీకులకు వైద్య పరీక్షలు చేసేందుకు మండల వైద్యాధికారి ఆర్. శ్రీనివాస్ నాయక్, వేళంగి పీహెచ్సీ డాక్టర్ జి.వీరయ్య, మరో ఐదుగురు వైద్యులు, 50 మంది సిబ్బంది కరప పీహెచ్సీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్రికులు రాగానే వారిని కాళ్లు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోమని, మాస్కులు ఇచ్చి పరీక్షించారు. రెండు వారాల పాటు ఇంటిలోనే ఉండాలని, ఆశా వర్కర్, ఏఎన్ఎంలు రోజూ వచ్చి పరీక్షిస్తారని వారికి వైద్యులు తెలిపారు. అవసరమైతే కాకినాడ ఆస్పత్రికి తీసుకెళతామని అన్నారు. కరప ఎస్సై డి.రామారావు, వైద్య సిబ్బంది యాత్రీకుల చిరునామాలు తీసుకుని, ఇంటికి వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు పాట్నీటి భీమేశ్వరరావు, గొర్రెల శ్రీనివాస్, దేవు వెంకన్న, సలాది బాబీ యాత్రికులు పీహెచ్‌సీకి రాగానే కూల్డ్రింకులు, పులిహోర ప్యాకెట్లను అందజేశారు. సామర్లకోట నుంచి కరప వచ్చి, వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లేవరకు వారికి వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసులు సపర్యలు చేశారు. ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు కరప మండలం భక్తులు సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగగానే, జనతా కర్ఫ్యూ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక స్టేషన్లోనే ఉండిపోయారు. వైఎస్సార్ సీపీ కరప మండలం జెడ్పీటీసీ అభ్యర్థి యాళ్ల సుబ్బారావు ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లారు. యాత్రికులకు బస్సు ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి, ఇళ్లకు పంపే ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావు, ఆర్టీఓ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులను మంత్రి కన్నబాబు ఆదేశించారు. కాకినాడ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. ఈలోగా 16 మంది భక్తులు రెండు ఆటోల ద్వారా, 44 మంది ఆర్టీసీ బస్సులో కరప పీహెచ్‌సీకి చేరుకున్నారు. మిగిలిన 11 మంది సొంతూరు వైజాగ్, ఇతర గ్రామాలకు వెళ్లిపోయారు. -
కాశీయాత్ర చరిత్ర
‘జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్ను నేలుచున్న సుప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830(ఈ అంకెలు తెలుగు పద్ధతిలో రాస్తారాయన) సంవత్సరము మే నెల 18వ తేది కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము జేరినాను’. తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య నాడు చెన్నపట్టణం అనబడిన చెన్నైలో నాడు ఉండిన సుప్రీమ్ కోర్డులో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేశారు. 1830–31 కాలంలో 15 నెలల పాటు ‘సకుటుంబముగా, సపరివారముగా’ సుమారు నూరుమందితో కాశీయాత్ర చేశారు. రోడ్లు, రైళ్లు లేని కాలంలో పల్లకీలో ఆయన వెళ్లారు. మద్రాసు, తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, నాగపుర్, అలహాబాదు మీదుగా కాశీ చేరుకుని, తిరుగు ప్రయాణంలో గయ, భువనేశ్వర్, విశాఖపట్నం, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మళ్లీ మద్రాసు వచ్చారు. ‘తాను చూచిన దేశములు, నగరములు, పల్లెలు, అందుండే నానాజాతి మనుష్యులు, వారి వృత్తులు, ఆచారములు మొదలయిన విషయములు సవిస్తరముగా వర్ణిస్తూ దినచర్య రచించినాడు’. అది 1838లో పుస్తకరూపంలో వెలువడింది. అందులోని క్లిష్టతరమైన తెలుగు–ఉరుదూ–తమిళం మిళిత భాషకు తెలుగు సమానార్థకాలను ప్రక్షేపించి దిగవల్లి వేంకట శివరావు 1941లో దాన్ని తిరిగి వెలయించారు. ‘అణాలు, అర్ధలు, పావులాలు చెన్నపట్టణపు దుడ్లు కడప విడిచిన వెనుక దొరకవు. కూడా తెచ్చియుంటే వెండి నాణ్యములు మాత్రము పనికి వచ్చుచున్నవి. కృష్ణ కవతలి పయిసాలు కృష్ణ కీవల పనికిరావు’ అని రెండవ ప్రకరణములో రాశారు.‘ఈ షహరు గోడకు చేరినట్టుగా ‘ముసి’ అని అక్కడి వారిచేత చెప్పబడుచున్న ముచుకుంద నది పారుచున్నది... పోయిన సంవత్సరం నదీప్రవాహము ఎక్కువగా వచ్చి ఢిల్లీ దరవాజా వద్ద యింగిలీషువారు కట్టిన వారధిని పగలకొట్టి ఆ షహరులో కొన్ని వీధులున్ను, బేగంబజారులో కొన్ని వీధులున్ను ముంచివేసి పోయినది. బేగంబజారుకున్నూ, షహరుకున్నూ నడమ ఆ నది దాటుటకు పూర్వకాలమందు తురకలు మంచి రాళ్ళతో అతి బలముగా నొక్క వారధి యేనుగలు మొదలయినవి గుంపుగా నెక్కి పోవడానికి యోగ్యముగా కట్టినారు’ అని హైదరాబాదు గురించి రాశారు. ‘కాశీ పట్టణములో పదివేల యిండ్లున్ను, లక్షమంది ప్రజలున్ను వుందురని తోచుచున్నది. యిక్కడ దొరకని పదార్థము వకటిన్ని లేదు. అందరు దేశభాష అయిన హిందుస్తాన్ మాటలాడుచున్నారు’. సుమారు రెండు వందల యేళ్ల కిందటి సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి గొప్ప ఉపకరణం ఈ పుస్తకం. -
కాశీలో సందడి చేస్తున్న గోపాల గోపాల టీం
-
తీర్థయాత్రలో విషాహారం..