Kashmir CM
-
‘పోలింగ్ తగ్గడంపై ప్రధానితో చర్చించా’
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగ్గిన పోలింగ్, తమ రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. మోదీతో భేటీ ముగిసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రధాని చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అడుగుజాడల్లో నడుస్తానని ఆయన పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జలవనరులపై తమ రాష్ట్రానికి నియంత్రణ లేకపోవడంతో సింధు నదీజలాలు ఏవిధంగా కోల్పోతున్నామో ప్రధానికి వివరించినట్టు చెప్పారు. కొంత మంది కశ్మీరీ యువకులు భ్రమల్లో బతుకుతున్నారని, మరి కొందరిని పురిగొల్పుతున్నారని ఆరోపించారు. యువత పెడదారి పట్టకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. కాగా, కశ్మీర్ లోని శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో కేవలం 7శాతం ఓట్లు మాత్రమే పోలైన సంగతి తెలిసిందే. -
శ్రీనగర్లో కశ్మీర్ సిఎం మెహబూబా సమావేశం
-
'మీ కలలకు రెక్కలు తొడగండి'
ముంబయి: భవిష్యత్తులో సందేశాత్మక చిత్రాలను రూపొందించాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తీ మహమ్మద్ సయీద్ తమ రాష్ట్ర మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు చెప్పారు. వారి కలలకు రెక్కలు జతచేయాలని, ఏదనుకుంటే అది చేయాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని సూచించారు. కాశ్మీర్లోని మీడియా ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్(ఎంఈఆర్సీ) యూనివర్సిటీకి చెందిన 12మంది పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విధువినోద్ చోప్రాను గుర్తు చేశారు. వినోద్ తమకు గర్వించదగిన పుత్రుడని, అతడు రూపొందించే చిత్రాల్లో ఎప్పుడూ ఒక సందేశం దాగి ఉంటుందని అన్నారు. జమ్మూకశ్మీర్ వ్యాలీలో కళలు, సంస్కృతి, భాషలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ విద్యార్థులను ముంబయిలో జరుగుతున్న 17వ మామి చిత్రోత్సవానికి ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ విధంగా వారిని ప్రోత్సహించారు.