ముంబయి: భవిష్యత్తులో సందేశాత్మక చిత్రాలను రూపొందించాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తీ మహమ్మద్ సయీద్ తమ రాష్ట్ర మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు చెప్పారు. వారి కలలకు రెక్కలు జతచేయాలని, ఏదనుకుంటే అది చేయాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని సూచించారు. కాశ్మీర్లోని మీడియా ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్(ఎంఈఆర్సీ) యూనివర్సిటీకి చెందిన 12మంది పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విధువినోద్ చోప్రాను గుర్తు చేశారు. వినోద్ తమకు గర్వించదగిన పుత్రుడని, అతడు రూపొందించే చిత్రాల్లో ఎప్పుడూ ఒక సందేశం దాగి ఉంటుందని అన్నారు. జమ్మూకశ్మీర్ వ్యాలీలో కళలు, సంస్కృతి, భాషలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ విద్యార్థులను ముంబయిలో జరుగుతున్న 17వ మామి చిత్రోత్సవానికి ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ విధంగా వారిని ప్రోత్సహించారు.
'మీ కలలకు రెక్కలు తొడగండి'
Published Fri, Nov 6 2015 8:09 PM | Last Updated on Mon, Jul 30 2018 8:14 PM
Advertisement