Kasturba Girls College
-
మండుటెండలో నిలబెట్టి... ఆపై జుత్తు కత్తిరించి!
జి.మాడుగుల: అసెంబ్లీకి సమయానికి రాలేదని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం నాడు పాఠశాల, కళాశాల విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకొని పూజలు చేసుకొని ఆలస్యంగా కేజీబీవీకి వచ్చారు.పాఠశాలలో రోజువారీ నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు అలస్యంగా రావడంతో వారిపై ప్రిన్సిపాల్ ఆగ్రహించారు. విద్యార్థినులను పాఠశాల, కళాశాలల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టారు. అసెంబ్లీకి రాని విద్యార్థినుల్లో కొంతమందిని దండించారు. వీరిలో 15 మందికి జట్టును ఇష్టానుసారంగా కత్తిరించారు. మనోవేదనకు గురైన విద్యార్థినులు ప్రిన్సిపాల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచినా.. వెంబడించి మరీ జుత్తు కత్తిరించినట్టు సమాచారం. వీరిలో ఒక విద్యార్థిని దేవుని మొక్కు ఉందని జుత్తు కటింగ్ చేయవద్దని ప్రాథేయపడినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. జుత్తు కట్ చేస్తున్న సమయంలో మనోవేదనకు గురైన ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ తాగడానికి మంచినీరు కూడా ప్రిన్సిపాల్ అందించటానికి నిరాకరించారు. క్రమశిక్షణ నేర్పాలనే... విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ కోరగా విద్యార్థినుల జుత్తు బాగా పెరిగిపోవడం వల్ల పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుత్తు కట్ చేసినట్లు తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం కేజీబీవీలో విద్యార్థినుల జుత్తును అకారణంగా కటింగ్ చేసినట్టు కొంతమంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఎంఈవో బాబూరావుపడాల్ తెలిపారు. ఈ విషయంపై కేజీబీవీని సందర్శించేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్టు చెప్పారన్నారు. అక్కడ నుంచి ఫోన్లో ప్రిన్సిపాల్‌ని సంప్రదించగా విద్యార్థినులకు జుట్టు పెరిగిపోయిందని, క్రమశిక్షణ(డిసిప్లేన్) కోసం విద్యార్థినుల్లో కొంతమంది జత్తు కటింగ్ చేసినట్టు చెప్పారని ఎంఈవో తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, జీసీడీవోకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు. -
ఈ హాస్టళ్ల ఉండలేం!
‘తానం చేద్దామంటే బాత్రూమ్లు బయట ఉన్నయి. తొవ్వొంట పోయే అబ్బాయిలు వచ్చి భయపెడుతండ్రు. ప్రహరీ లేక ఎప్పుడుపడితే అప్పుడు వత్తండ్రు.. బెదిరిత్తండ్రు. నిన్న ఇద్దరు అబ్బాయిలు వచ్చిండ్రు. కొట్టినంత పనిచేసిండ్రు. అందరం కలిసి తరిమినం. ఎవలకు చెప్పుకోమంటరు. ఎప్పుడు ఏమైతదో తెల్వదు. ఆడపిల్లలం.. మాకేమైన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తరు. మమ్ములను మా ఇంటికి పంపించుండ్రి. మేం ఇక్కడ ఉండలేం.. రక్షణ కల్పించకుంటే దసరకు పోయి మళ్లరానేరాం..’ అంటూ హుస్నాబాద్‌లోని కస్తూరిబా గిరిజన బాలికల ఆశ్రమ విద్యాలయం విద్యార్థినులు మంగళవారం హాస్టల్పెకైక్కి ఆందోళనకు దిగారు. ‘మీ పిల్లలను ఇలాంటి హాస్టల్లో ఉంచుతారా..’ అంటూ అధికారులను ప్రశ్నించారు. హుస్నాబాద్ : కస్తూరిబా బాలికల విద్యాలయం పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్తిగా నిర్మానుష్య ప్రదేశంలో నిర్మించిన దీనికి ప్రహరీ చేపట్టలేదు. స్నానపుగదులు బయటే ఉన్నాయి. దీంతో పట్టపగలే ఆకతాయిలు విద్యాలయంలోకి చొరబడి బెదిరిస్తున్నారని పేర్కొంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పాఠశాల భవనంపెకైక్కి నిరసన తెలిపారు. ప్రహరీ నిర్మించాలని, అప్పటివరకు తమను ఇళ్లకు పంపించాలని, లేకుంటే దసరా సెలవులకు ఇంటికెళ్లి తిరిగిరాబోమని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ విజయ్‌సాగర్, ఎస్సై మహేందర్‌రెడ్డి, వార్డెన్ మమత అక్కడికి చేరుకున్నారు. అబ్బాయిలు తరచూ వస్తున్నారని, పిల్లలను బెదిరింపులకు గురిచేస్తున్నారని హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్నెల్ల క్రితం హడావుడిగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రహరీ ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. పాములు, తేళ్లు, విష పురుగులు వస్తున్నాయని, అయినా తమను పట్టించుకున్న వారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తాత్కాలిక కంచె ప్రహరీ నిర్మించడంలో భూమి పట్టాదారుడితో వివాదం ఉందని, వారంలోపు తాత్కాలికంగా కంచె ఏర్పాటు చేయిస్తామని తహశీల్దార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడుతా : ఎమ్మెల్యే వొడితెల బాలికలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సాయంత్రం విద్యాలయాన్ని సందర్శించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ప్రహరీ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చుట్టూపక్క రైతులతో మాట్లాడాలని తహశీల్దార్‌కు సూచించారు.