మళ్లీ వచ్చేశాయ్.. ఏ చీరకాకాసు.. తళతళల కాసులు!!
కంచిపట్టుచీరకు కనకపు కాసు, సిల్క్ కుర్తాకు సిల్వర్ కాసు, వెస్ట్రన్ వేర్‌కు ఆక్సిడైజ్డ్ కాసు లోహమేదైనా... ధరించే దుస్తులు ఏవైనా పండగ రోజున కాసుల పేరు మెడ నిండుగా.. కనుల పండుగలా కమనీయంగా కట్టడి చేస్తుంది. ఎంపిక మీదే సుమా అన్నట్టుగా ఆకట్టుకుంటుంది.
బంగారు కాసుల పేరు బామ్మలనాటి డిజైన్ అయినా నేటికి తన హుందాతనాన్ని, లక్ష్మీ కళను తరతరాలకు అందిస్తూనే ఉంది. ఏ వేడుకకైనా నిండుతనాన్ని తీసుకువస్తుంది. ఆధునిక యువతికి వేషధారణకు తగినట్టు సిల్వర్ కాయిన్లు రకరకాల డిజైన్లలో కనువిందుచేస్తున్నాయి. కొన్ని అఫ్గాన్స్టైల్, మరికొన్ని బొహేమియన్ స్టైల్... అంటూ విదేశీ కాసులు కూడా వినూత్నమైన హారాలుగా ఆకట్టుకుంటున్నాయి.
చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!
కాసులు సిల్క్ దారాలతో జత కలుస్తున్నాయి, పూసలతో దోస్తీ కడుతున్నాయి. లోహానికి తగిన ధరల్లో వేల రూపాయల నుంచి వందల రూపాయల్లో ఆభరణాల మార్కెట్, ఆన్లైన్ షాపింగ్‌లో రెడీమేడ్ కాసులు లభిస్తున్నాయి. నూరు కాసులతో ఓ హారం లేదంటే నాలుగు కాసులతో సరిపెట్టుకునే హారమైనా అందమైన డిజైన్లతో నేడు మరింత కళగా కనులకు విందు చేస్తున్నాయి. ఆభరణాల జాబితాలో ఎప్పటికీ నిలిచి ఉండే కాసు హారాలు ఈ దీపావళి పండగకు కొత్త కళను నింపనున్నాయి.
చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..