ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్
ఖట్మాండ్: ఢిల్లీ-ఖట్మాండ్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఖట్మాండ్ విమానశ్రయం నుంచి ఆదివారం ఢిల్లీ రావాల్సిన ఎయిర్వేస్ జెట్ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన నేపాల్ విమానాశ్రయ అధికారులు విమానంలోని ప్రయాణికులందరినీ వెంటనే దింపేశారు.
విమానంలో నుంచి ప్రయాణికులను దింపేసిన అనంతరం బాంబు స్క్వాడ్ అక్కడకు చేరుకుని విమానంలో క్షుణంగా తనిఖీలు నిర్వహించింది. అయితే ఆ విమానంలో బాంబు వంటి పేలుడు పదార్థాలు ఏమి దొరకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికుల లగేజీలను కూడా సోదా చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానాలన్నీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వరకు రద్దు చేయబడినట్టు విమానశ్రయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.