Kaththi remake
-
కత్తి రీమేక్‌లో హృతిక్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కత్తి. తమిళ నాట వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగు రీమేక్ చేశాడు. మెగా రీ ఎంట్రీగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ టాలీవుడ్లో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. చాలా రోజులుగా కత్తి సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కత్తి రిలీజ్ సమయంలోనే సల్మాన్ ఖాన్ హీరోగా కత్తి రీమేక్ ఉంటుందన్న వార్త వినిపించింది. అయితే సల్మాన్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించకపోవటంతో అక్షయ్ కుమార్ చేతికి వెళ్లిందన్న ప్రచారం జరిగింది. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ రీమేక్‌గా తెరకెక్కిన హాలీడే సినిమాలో నటించిన అక్షయ్ మరోసారి మురుగదాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరిచాడు. కానీ ఇప్పటికే చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న అక్షయ్ కూడా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ను పట్టా లెక్కించే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో కత్తి రీమేక్ కథ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ దగ్గరికి వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాబిల్ సినిమాలో ఘన విజయం సాధించిన హృతిక్, ప్రస్తుతం ఏహై మొహబ్బతేన్ తో పాటు ఓ బయోపిక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు కత్తి రీమేక్ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఫుల్ ఖుష్!
చిరంజీవి 150వ చిత్రం... ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ ఎవరు...? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవన్నీ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తమిళ ‘కత్తి’ రీమేక్‌తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వడానికి చిరు సిద్ధమవుతున్నారని తెలిసినప్పటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర మాతృక కథ మీద వివాదం చెలరేగడంతో కొంత కాలం హాట్ టాపిక్‌గా మారింది. వీవీ వినాయక్ మాత్రం తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్ది, చిరంజీవికి కూడా వినిపించారని సమాచారం. స్క్రిప్ట్ విన్న చిరంజీవి ఫుల్ ఖుష్ అయిపోయి, వినాయక్‌ను హగ్ చేసుకున్నారట. ఇంకేముంది? ఇక చిత్రీకరణ మొదలుపెట్టడమే ఆలస్యం. ఈ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే. కథానాయికగా నయనతార పేరు వినపడుతోంది. -
కత్తిమీద సాము