వందేళ్ల శివాలయాన్ని సందర్శించిన సోనియా!
ఉత్తరాఖండ్ లోని భాగేశ్వర్ జిల్లాలోని కౌసానీ పర్వత పట్టణంలోని శివాలయాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సందర్శించారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా కౌసానీకి చేరుకున్న సోనియా స్థానికులను కలిసి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. అంతేకాకుండా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం కాలినడకతో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న రుద్రధారి శివాలయాన్ని సందర్శించారు.
అక్కడ నిర్మిస్తున్న పిందర్ లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్ట్ అమలులో జాప్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అల్మోరా జిల్లా పరసర ప్రాంతాల్లోనూ, కౌసానీ ప్రాంత ప్రజలకు తాగునీటి ఏర్పాటు చేయడానికి 1977-78 లో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
ఈ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి హరీష్ రావత్ దృష్టికి తీసుకువస్తామని ప్రజలకు సోనియా హామీ ఇచ్చారు. ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సోనియా ఇక్కడి చేరుకున్నారు.