Kaushambhi
-
ప్రియురాలిపై అత్యాచారం చేసేందుకు వెళ్లి...
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను నిర్లక్ష్యం చేస్తుందనే కోపంతో ఓ యువకుడు ప్రియురాలితో పాటు ఆమె తమ్ముడిని కాల్చి చంపేశాడు. నవంబరు 7న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలు... కౌశాంబికి చెందిన షీలా(16) తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమెకు పుర్వా గ్రామానికి చెందిన గంగా ప్రసాద్(20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్లుగా షీలా.. ప్రసాద్‌తో మాట్లాడటం మానేసింది. దీంతో మరో యువకుడితో ఆమె స్నేహం చేస్తున్నట్లుగా అనుమానించిన ప్రసాద్.. షీలాకు బుద్ధి చెప్పాలని భావించాడు. వారం రోజుల క్రితం ఆమె హత్యకు పథకం రచించాడు. ఈ క్రమంలో షీలా తల్లిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లారని తెలుసుకున్న ప్రసాద్ నాటు తుపాకీతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తొలుత షీలాపై అత్యాచారానికి యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేస్తూ అందరినీ పిలిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన ప్రసాద్ ఆమె కణతిపై కాల్చి చంపేశాడు. అదే విధంగా తన అక్క అరుపులు విని గది నుంచి బయటకు వచ్చిన షీలా తమ్ముడు రాజేంద్ర(12)ను కూడా తుపాకీతో కాల్చి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో అక్కాతమ్ముళ్లు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కాగా షీలా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ జాడ కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసాద్ నేరాన్ని అంగీకరించాడని... తనను కాదని మరో యువకుడిని ప్రేమిస్తుందనే కారణంగానే ఆమెను హత్య చేసినట్లు తెలిపాడని పేర్కొన్నారు. -
షర్టు పట్టుకుని ఈడ్చి.. పొలాల వెంట పరిగెత్తిస్తూ..
లక్నో : సామూహిక అత్యాచార ఘటనలో నిందితుడిగా భావిస్తున్న ఓ యువకుడిని గ్రామస్తులు చితక్కొట్టారు. షర్టు పట్టుకుని ఈడుస్తూ.. పొలాల వెంట పరిగెత్తిస్తూ తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేయడంతో శాంతించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కౌశాంబి జిల్లాకు చెందిన ఓ పదహారేళ్ల అమ్మాయిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అకృత్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా తొలుత ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించిన స్థానిక పోలీసులు.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ‘ నేను పళ్ల తోటకు వెళ్లివస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు నాపై దాడి చేశారు. వెనుక నుంచి అకస్మాత్తుగా నన్ను కొట్టి లాక్కెళ్లారు. నాతో చాలా నీచంగా ప్రవర్తించారు. భయంకరంగా అకృత్యానికి పాల్పడ్డారు. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ పొలాల్లో పరిగెత్తలేక వాళ్లకు దొరికిపోయాను అని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న మహ్మద్ నజీమ్(20) మంగళవారం బాధితురాలి గ్రామస్తుల చేతికి చిక్కాడు. దీంతో అతడిని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మహ్మద్ చోట్కా, బడ్కా అనే ఇద్దరు సోదరులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం ఐదు బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి
-
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి
ఘజియాబాద్ కొశాంబిలోని ఆమ్ఆద్మీ పార్టీ కార్యాలయంపై శ్రీరామ్ సేన మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. సేన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆప్ కార్యాలయానికి చేరుకుని, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ క్రమంలో ఆప్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దాంతో కిటికి అద్దాలు పగిలాయి. ఆప్ కార్యాలయంపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు పరారయ్యారు. హిందూ రక్షక సంస్థకు చెందిన శ్రీరామ్ సేనకు చెందిన మద్దతుదారులు ఆ దాడికి పాల్పడ్డారని ఘజియాబాద్ ఎస్ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. శ్రీరామ్ సేన మద్దతుదారుడు విష్ణు గుప్తా సారథ్యంలో ఆ దాడి జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆప్ కార్యాయలం వద్ద భారీ భద్రతను మోహరించారు. ప్రముఖ న్యాయవాది జమ్మూ కాశ్మీర్‌పై వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.