keethavarigudem
-
ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ
కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం శివాలయంలో నూతనంగా నిర్మించిన శివాంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుజారులు రాయప్రోలు శ్రీరామశర్మ, రాయప్రోలు భద్రయ్యశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెంగుండ్ల వెంకటేశ్వర్లు పుష్పావతి దంపతుల విరాళంతో 25 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చింతకాయల రామచంద్రయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
7న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ
కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివాంజనేయ విగ్రహా ప్రతిష్ట మహోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరాయప్రోలు భద్రశర్మ, శ్రీరామశర్మలు మంగళవారం తెలిపారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెగుండ్ల వెంకటేశ్వర్లు, పుష్పావతి దంపతుల సహకారంతో ఆలయంలో 25 అడుగుల ఎత్తుగల శివాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.