కేకే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఎస్.కోట(విజయనగరం): విశాఖ జిల్లా కిరండోల్- కొత్తవలస మార్గంలో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ మార్గంలో కొండచరియలు విరిగి రైలు పట్టాలపై పడటంతో గురువారం ఉదయం విశాఖ నుంచి అరకు బయలుదేరిన రైలును ఎస్.కోట వద్ద నిలిపివేశారు. పట్టాలపై అడ్డంకులను తొలిగించటంతో గంటన్నర అనంతరం తిరిగి రైలును ముందుకు నడిపారు.