4950 లీటర్ల కిరోసిన్ పట్టివేత
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం కాలువ ఒడ్డున అక్రమంగా నిల్వ ఉంచిన 4950 లీటర్ల కిరోసిన్‌ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. లారీ సర్వీసింగ్ సెంటర్లో అక్రమంగా కిరోసిన్ దందా నిర్వహిస్తుండగా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. లారీ యజమాని వి.వి.దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి ఈ కిరోసిన్ ఎక్కడినుంచి వచ్చింది ఎవరికి సరఫరా చేస్తున్నారు వంటి వివరాలు సేకరిస్తున్నారు.